వనపర్తి, మే 3 (నమస్తే తెలంగాణ) : అకాల వర్షంతో కొనుగోలు కేంద్రాల్లో తడిసిన ధా న్యాన్ని కొనుగోలు చేయాలని రైతులు ఆందోళనకు దిగారు. శుక్రవారం రాత్రి కురిసిన వర్షంతో మార్కెట్లోని ధాన్యం తడిసిముద్దయింది. ఈ విషయం తెలుసుకొన్న బీఆర్ఎస్ నాయకులు మార్కెట్ వద్దకు చేరుకొని పాడైపోయిన ధాన్యం పరిశీలించారు. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు గట్టు యాదవ్, జిల్లా అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్ సమక్షంలో నాయకులు రైతుల ఇబ్బందులపై వాకబు చేశారు. ధాన్యం నష్టపోవడంతో నిరసన చేపట్టిన రైతులకు మద్దతుగా రోడ్డుపై బైఠాయించి ధర్నా చేపట్టారు.
ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాల్లో తడిసిన ధాన్యాన్ని షరతుల్లేకుండా కొనాలని డి మాండ్ చేశారు. ప్రభుత్వం రైతులను పట్టించుకోవడం లేదని వాపోయారు. అనంతరం బీఆర్ఎస్ నేతలు మాట్లాడుతూ నెలరోజులు గా కేంద్రాలలో ధాన్యం కొనుగోలు చేయకుం డా తాత్సారం చేయడంతో వర్షానికి తడిచిపోయిందన్నారు. దాదాపు 20 వేల బస్తాలు వర్షార్పణమైందన్నారు. మార్కెట్లో మార్కెట్‌కు వచ్చే యాసంగి ధాన్యానికి సరిపడా ఏర్పాట్లు చేయడంలో అధికారులు విఫలమయ్యారని ధ్వజమెత్తారు. గంటసేపు రాస్తారో కో చేపట్టడంతో వాహనాలు పెద్ద ఎత్తున నిలిచిపోయాయి.
ఈ విషయం తెలుసుకొన్న తా సీల్దార్ రమేశ్‌రెడ్డి అక్కడకు చేరుకొని రైతులతో మాట్లాడారు. తడిచిన ధాన్యం కొనుగోలు చేస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ధర్నా విరమించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు రమేశ్‌గౌడ్, విజయ్‌కుమా ర్, వెంకట్రావు, రఘువర్ధన్‌రెడ్డి, అశోక్, పరంజ్యోతి, భాను, మహేశ్వర్‌రెడ్డి, ధర్మానాయక్, నాగన్న యాదవ్, తిరుమల్, గిరి, ఇమ్రాన్, హుస్సేన్, సునీల్, రాము, బాబు నాయక్, పాషా, నారాయణ పాల్గొన్నారు.