కల్వకుర్తి, నవంబర్ 24 : తమ గ్రామానికి అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ అధికారిని నియమించాలని డిమాండ్ చేస్తూ సోమవారం కల్వకుర్తి మండలం తర్నికల్ గ్రామానికి చెందిన రైతులు స్థానిక అగ్రికల్చర్ డివిజన్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు.తమ గ్రామానికి చెందిన ఏఈఏ గత నెలన్నర రోజుల కిందట మెటర్నటీ సెలవుపై వెళ్ళిందని..ఆరోజు నుంచి తమ గ్రామానికి ఏఈవోను నియమించలేదని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు.తాము సాగుచేసిన పంటల వివరాలు ఆన్లైన్లో నమోదు చేస్తేనే పంటను అమ్ముకునే వీలుందని. ఈక్రమంలో తాము పండించిన పంటలను కొనుగోలు కేంద్రాలలో విక్రయించలేక పోతున్నామని ఆందోళన వ్యక్తం చేశారు.
పత్తి, వరి ధాన్యాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలలో విక్రయించాలంటే ఏఈవో ద్రువీకరించిన సర్టిఫికెట్ కావాలని, ఏఈవో లేకపోవడంతో ధాన్యాన్ని విక్రయించలేకపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. గత నాలుగు రోజలు కిందట ఏవో కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించామని, తాత్కాలికంగా ఏఈవోను నియమిస్తామని వ్యవసాయాధికారి హమీ ఇచ్చారని, ఇప్పటి వరకు హమీని అమలు చేయకపోవడంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో మరోసారి ధర్నా చేయా ల్సి వచ్చిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఏఈఓను ని యమించే వరకు ధర్నా విరమించమని రైతులు భీష్మించుకు కూర్చున్నారు. ఏడీఏ, డీఏవో వచ్చి తమ సమస్యను పరిష్కస్తే తప్పా..ధర్నా ఉపసంహరించమని రైతులు తేల్చి చెప్పారు.
ఏ డీఏ అందుబాటులో లేకపోవడంతో సూపరింటెండెంట్‌కు వినతిపత్రం ఇచ్చారు.ఏడీఏ ఫోన్లో అందుబాటులోకి వచ్చి ఏవో సురేశ్‌ను రైతుల వద్దకు పంపించారు. సర్ప్లస్ స్టాఫ్ లేకపోవడం వల్ల ఇబ్బందులు తలెత్తుతున్నాయని ఏవో రైతులకు వివరించే ప్రయత్నం చేశారు. సెలవుపై వెళ్లిన ఏఈవో స్థానం లో తాత్కాలికంగా మరోక ఏఈవో అదనపు బాధ్యతలు అప్పగిం చి సమస్య పరిష్కరిస్తామని ఏవో హామీ ఇచ్చినప్పటి రైతు లు వినలేదు. దీంతో కల్వకుర్తి క్లస్టర్ ఏఈవోగా పనిచేస్తున్న చందన కు తర్నికల్ బాధ్యతలు అప్పగిస్తున్నామని చెప్పడం తో రైతులు ధర్నా విరమించారు.