మరికల్ : నారాయణపేట జిల్లా మరికల్ మండలం పూసలపాడు గ్రామ రైతులు అధికారులను నిలదీశారు. పంట ఉత్పత్తులను తరలించేందుకు ప్రభుత్వం పంపించిన గన్ని బ్యాగులు ( Gunny bags ) రైతులందరికీ ఇవ్వడం లేదని ఆరోపిస్తూ రైతు వేదికకు వచ్చిన అధికారులను నిలదీశారు. పూర్తిస్థాయిలో గన్ని బ్యాగులు సరఫరా కాలేదని వెంటనే సరఫరా చేయలేదని ఆరోపించారు.
రైతులకు 70 వేల గన్ని బ్యాగుల అవసరం ఉండగా 37 వేల గన్ని బ్యాగులు రావడంతో రైతులు ఒక్కసారిగా గన్నీ బ్యాగుల కోసం ఎగబడ్డారు. దీంతో కొద్దిసేపు రైతు వేదికలో గంధర గోళపరిస్థితి చోటుచేసుకుంది. తహసీల్దార్ రామకోటి, ఏవో రెహమన్ రైతులతో మాట్లాడి రెండు, మూడు రోజుల్లో రైతులకు సరిపడ గన్ని బ్యాగులు అందిస్తామని హామీ ఇవ్వడంతో రైతులు శాంతించారు.