అచ్చంపేట రూరల్, ఫిబ్రవరి 12 : రైతులు పగలన, రాత్రనక ఆరుగాలం ఇంటిల్లిపాది శ్రమించి పండించిన వేరుశనగ పంటకు సరైన ధర లభించగా వ్యాపారస్తులు, కమీషన్ ఏజెంట్ల చేత్తుల్లో దగాపడుతున్నాడు. నెలరోజుల నుంచి అ చ్చంపేట నియోజకవర్గం పరిధిలోని ఎనిమిది మండలాల నుంచి వ్యవసాయ మార్కెట్‌కు అధికంగా రైతులు వేరుశనగ అమ్మకానికి బారులుదీరారు. రోజుకు వందల సంఖ్య లో వస్తుండడంతో అమ్ముకోవడానికి స్థలంలేని పరిస్థితి ఏర్పడుతుంది. రైతుకు మద్దతు ధర రావాలని కేంద్ర ప్రభు త్వం 2016లోనే (జాతీయ వ్యవసాయ మార్కెట్ )ఈనామ్ పథకాన్ని దేశంలోని అన్ని వ్యవసాయ మార్కెట్ల్లో అమలులోకి తీసుకొచ్చింది.
ఈ పథకం ద్వారా పండించిన పంటకు మద్దతుధర వచ్చే అవకాశం ఉన్నా ..ఈ పథకం నామమాత్రంగానే అమలవుతుందని చెప్పవచ్చు. సంబంధిత అధికారులు రైతులకు ఈనామ్ పథకంపై సరైన అవగాహన కల్పించపోవడంతో నామమాత్రంగా అమలు చేసి మమా అనిపిస్తున్నారనే ఆరోపణలున్నాయి. పంట అమ్మకానికి మూడురోజులు సమయం పట్టడంతో రైతులు, వ్యా పారులు అక్కడి కమీషన్ ఏజెంట్లను ఆశ్రయిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో 16 వ్యవసాయ మార్కెట్‌యార్డులో ఇదే పరిస్థితి నెలకొన్నది. వీటిలో పెద్ద మార్కెట్లు మహబూబ్‌నగర్, జడ్చర్ల (బాదేపల్లి), గద్వాల, (వనపర్తిరోడ్ మదనపు రం) ఉండగా మిగతావి నారాయణపేట, అచ్చంపేట, నా గర్‌కర్నూల్, దేవరకద్ర, కల్వకుర్తి, మక్తల్, ఆత్మకూర్ యా ర్డుల్లో ఈ నామ్ పథకాన్ని ప్రవేశపెట్టినా నిర్వహణ అ ంతంత మాత్రమే అని చెప్పవచ్చు.
సాధారణంగా మార్కెట్లో ఉదయం 11గంటలకు వ్యాపారులు, కమీషన్ ఏ జెంట్లు రైతులు నిల్వచేసిన పంటల రాశుల వద్దకు వచ్చి పంటను పరిశీలించి ధరను నిశ్చయించుకొని మధ్యాహ్నం తర్వాత మార్కెట్ అధికారులకు తెలియజేస్తారు. అధికారులు రెండు గంటల తర్వాత రేట్లను ప్రకటించి బీట్ పూర్తయిందని పంటను తూకం చేయడానికి నిర్ణయిస్తున్నారని రైతులు పేర్కొన్నారు. మార్కెట్‌కు అధికంగా సరుకు రావడంతో రెండు, మూడు రోజులు తూకం చేయించడానికి పడుతుందని పగలు, రాత్రి పంటలను కాపాడుకోవడానికి నానా ఇబ్బందులను ఎదుర్కొంటున్నామని రైతులు వాపోతున్నారు.
సంబంధిత అధికారులు తగిన ఏర్పాట్లు చేయడంలో పూర్తిగా విఫలమయ్యారని రైతులు ఆరోపిస్తున్నారు. ఈనామ్ పథకంలో పేర్కొన్న విధంగా రైతులు తెచ్చిన పంట ఉత్పత్తుల నాణ్యతను పరీక్షించి గ్రేడింగ్ వివరాలను ఆన్లైన్లో నమోదు చేయాలి కానీ ఇక్కడ వందల మంది రైతులు పంటలు తీసుకొచ్చినా అందులో పదుల సంఖ్య లో గ్రేడింగ్ తీసి ఈ నామ్ పథకాన్ని నామమాత్రంగా అ మలు చేస్తున్నారు. ఆన్లైన్లో సరుకు నాణ్యతను చూసుకొని వివిధ ప్రాంతాల్లోని వ్యాపారులు ధరను నిర్ణయించాల్సి ఉన్నా అచ్చంపేట మార్కెట్లో వ్యాపారస్తులు, కమీషన్ ఏజెంట్లు మార్కెట్ అధికారులతో కుమ్మక్కై బయటి వ్యాపారులను కొనుగొలు చేయకుండా కట్టడి చేస్త్తూ మా ర్కెట్లో మేమే పంట ఉత్పత్తులను కొంటాం అని హుకూం జారీ చేసి రైతులను నిలువునా దోచేస్తున్నారు.ఆన్లైన్లో ధర చూసుకున్న రైతు తనకు ఎక్కువ ధర పెట్టే వ్యాపారి అందుబాటులో లేకపోవడంతో తక్కువ ధర ఇచ్చే వ్యాపారికి సరుకు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
తీరా సరుకు తూకం చేసేటప్పటి 25కిలోల తూకానికి బదులుగా బస్తాను కలుపుకొని 26కిలోల 500గ్రాములు తూకం చేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. 106 బస్తాలు వేరుశనగ పంట మార్కెట్‌కు తీసుకురాగా కమీషన్ ఏజెంట్ 25 కిలోల భర్తీకి బదులుగా 26కిలోల 500 గ్రాములు తూకం చేశారని సింగారం గ్రామానికి చెందిన రైతు జర్పుల రవీందర్ వాపోయాడు. తన ఒక్కడి వద్దే 106కిలోలు అదనంగా దోచుకున్నారన్నారు. క్వింటాకు రూ. 6,627 ధర పలికిందని, తాను 5 క్వింటాళ్ల వేరుశనగ విత్తనాలు క్వింటాకు రూ.14వేలు కొనుగోలు చేయగా దిగుబడి తక్కువ రాగా రేటు కూడా సగానికి కంటే తక్కువ వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. పంట అమ్మేశాక మార్కెట్ తక్ పట్టీలలో పంట అమ్మకం , ఖర్చులు, కమిషన్, హామాలీ తదితర వివరాలు అందించాల్సి ఉండగా అవేమి కాకుండా కమిషన్ ఏజెంట్ తెల్ల కాగితంపై లెక్క చేసి డబ్బులు పడి రోజులకు ఇస్తానని రైతులను పంపిస్తున్నారు. తక్షణం కావలంటే మూడు శాతంతో క్యాష్ కటింగ్‌తో అందిస్తున్నారు. దేశంలోని వివిధ రాష్ర్టాల్లో పల్లీ పంటకు రేట్లు ఎక్కువగా ఉన్నా ఉమ్మడి జిల్లాలో వ్యాపారస్తులు కమీషన్ ఏజెంట్లు ,అధికారులతో కుమ్మకై వ్యాపారులు, ఏజెంట్లు తక్కువ ధరకు కొనుగొలు చేసి లాభాలు పొందుతున్నారు.