రాజోళి, మే 30 : ఒక వైపు వానకాలం సీజన్ సమీపిస్తుండడం, మరోవైపు ముందస్తు వర్షాలు కురుస్తుండడంతో రైతులు పొలం పను ల్లో బిజీబిజీగా ఉన్నారు. ముఖ్యంగా పంటల కోసం విత్తనాలు, ఎరువులు సిద్ధం చేసుకునేందుకు ఎరువులు, విత్తనాల దుకాణాలకు పరుగులు పెడుతున్నారు. ఇదే అదునుగా భా వించి కొంత మంది దళారులు త మ జేబులు నింపుకొనేందుకు సిద్ధమవుతున్నారు. ముఖ్యంగా రైతులకు విత్తనాల ఎంపికలో సరైన అవగాహన లేకపోవడంతో చాలా వరకు షాపు యజమానులపై ఆధారపడి వారిని నమ్మకమైన విత్తనాలు ఇవ్వాలని కోరుతుండడంతో వారు ఏ కంపెనీ పడితే ఆ కంపెనీకి చెందిన విత్తనాలను రైతులకు అంటగడుతున్నారు.
దీంతో నకిలీ విత్తనాలు వేసుకొని సంవత్సరం పొడువుగా కష్టపడి పెట్టుబడులు పెట్టి చివరకు పంట పండక పీకలోతు కష్టాల్లో రైతులు మునిగిపోతున్నా రు. రైతుల నిరక్షరాస్యతను ఆసరా చేసుకొని అసలుదు ఏదో.. నకిలీ ఏదో గుర్తుపట్టలేనంతగా కంపెనీలు రకరకాల వెరైటీలతో ప్యాకింగ్‌లు చేసి గుర్తింపున్న వేరైటీల పేర్లు చెబుతూ వ్యాపారులు నకిలీల విత్తనాలను అంటగట్టి మోసాలకు పాల్పడుతున్నారు. ప్రస్తుతం గ్రామాల్లో కొంతమంది సీడ్ విత్తనాలు వేసిన వాటిని కంపెనీలకు ఇవ్వకుండా ఎలాంటి జీవో టీ టెస్టు చేయకుండా ఫ్యాకింగ్ చేసి రైతులకు కంపెనీ ధరలకు అమ్ముకుంటూ రైతులను నట్టేటా ముంచుతున్నారు.
రైతులకు అండగా ఉండాల్సిన టాస్క్‌ఫోర్స్ అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతోనే రైతులు మోసపోతున్నారనే ఆ రోపణలు ఉన్నాయి. వ్యవసాయాధికారులు సైతం గ్రామాల్లో రైతులకు విత్తనాల ఎంపికలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించడంతోపాటు అసలు విత్తనాలు ఏవో.. నకిలీవి ఏవో గుర్తించేందుకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాల్సిన అవసరం ఉన్నది.