అమరచింత, ఏప్రిల్ 16 : అప్పుసొప్పు చేసి వరిపంటలు సాగు చేసినం. పంటలు చివరి దశకొచ్చినయి. రెండు వారాలు సాగునీళ్లు వదిలితే త మ పంటలు చేతికొస్తయి.. మీ కాళ్లు మొక్తం సాగునీళ్లు ఇవ్వండి సారూ అం టూ ఆత్మకూర్ మండలం గుంటిపల్లి రైతులు ఎద్దుల లక్ష్మయ్య, మాసన్న ఎమ్మెల్యేకు మొరపెట్టుకున్నారు.
బుధవారం ఆత్మకూర్ పట్టణంలోని సాయిబాబా మందిరంలో 25 వార్షికోత్సవం సందర్భంగా మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి పూ జలు చేసి బయటకు వచ్చిన క్రమంలో రైతు లక్ష్మయ్య ఎమ్మెల్యే కాళ్లపై పడేందుకు రాగా, ఎమ్మెల్యే వారించి జూరాల నుంచి సాగునీళ్లు విడుదల చేసినట్లు చెప్పారు. ఈ సందర్భంగా రైతులు లక్ష్మయ్య, మాసన్న మాట్లాడుతూ ఇన్నాళ్లు కష్టపడి సాగుచేసిన పంట చివరాఖరున ఎండిపోతుంటే కన్నీళ్లు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులకు చెప్పి నా పట్టించుకోవడం లేదని, సాగునీళ్లి తమ ను గట్టెక్కించాలని కోరారు.