మాగనూరు, మే 8 : ధాన్యం మిల్లులకు తరలించేందుకు లారీల కాంట్రాక్టర్ ఒక్కో రైతు నుంచి రూ.10వేల వరకు డిమాండ్ చేస్తూ అక్రమ వసూళ్లకు పాల్పడుతుండడంతో అన్నదాతలు ఆగ్రహించారు. వ్యయప్రయాసాలకో ర్చి పంటను పండించి అమ్ముకుందామంటే లారీలు ఇవ్వకుండా డబ్బులు వసూలు చేస్తారా అంటూ కాంట్రాక్టర్‌పై దాడికి పాల్పడిన ఘటన మాగనూరులో చోటుచేసుకున్న ది.
ఇందుకు సంబంధించి వివరాలు ఇలా.. బుధవారం రాత్రి టైరోడ్డులో ధాన్యాన్ని తరలించేందుకు లారీ లు సమాకూర్చిన కాంట్రాక్టర్, డ్రైవర్లు కలిసి ధాన్యం తరలించాలంటే రూ.10వేలు కావాలని డిమాండ్ చేశారు. లేదం టే ధాన్యం తరలించేది లేదంటూ చెప్పాడు. అంతేకాకుం డా సీఎం తమ్ముడు నాకు బాగా తెలుసని, ఎవరికి చె ప్పుకుంటారో చెప్పుకోడంటూ రైతులను దుర్బాషలాడాడ ని తెలిపారు. దీంతో ఆగ్రహించిన అన్నదాతలు రైతులంటే అంత చిన్నచూపా అంటూ కాంట్రాక్టర్‌పై దాడికి దిగారు.
రైస్‌మిల్లు వద్ద రైతుల ఆందోళన
రైస్ మిల్లుల్లో వడ్లను దింపుకోవడం లేదని మాగనూర్, కృష్ణ మండలాల రైతులు గుడెబల్లూరు పారాజన్య రైస్‌మిల్ యజమానులతో వాగ్వాదానికి దిగిన ఘటన గురువారం మధ్యాహ్నం చేసుకున్నది. కేవలం కొన్ని వాహనాల ధాన్యం మాత్రమే దింపుకొంటూ మిగతావి తీసుకోవడం లేదని గుడెబల్లూరు సమీపంలోని జాతీయ రహదారిపై దాదాపు 100 మంది రైతులు ధర్నా చేపట్టే ప్రయ త్నం చేశారు. విషయం తెలుసుకున్న ఎస్సై నవీద్ ఘటనా స్థలానికి చేరుకొని మిల్లు యజమానులతో మాట్లాడారు. ధాన్యం దింపుకొనేలా చర్యలు చేపడుతామని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు.