క్షణాల్లో రిజిస్ట్రేషన్.. నిమిషాల్లో మ్యుటేషన్.. ఇది ధరణి ప్రత్యేకం.. ఇంత మంచి పోర్టల్‌ను తొలగించి.. పాత పటేల్, పట్వారీ వ్యవస్థను తీసుకొస్తామని కాంగ్రెస్ నేతలపై వ్యాఖ్యలపై రైతులు కన్నెర్ర చేస్తున్నారు. మళ్లీ పాత పద్ధతిని తీసుకొస్తామని చేస్తున్న ప్రకటనలతో ఆందోళన చెందుతున్నారు. మా భూములు లాక్కోవాలని.. హక్కులు హరించాలని చూస్తే సహించేది లేదని, ఓటుతో బుద్ధి చెబుతామని కర్షకులు ముక్తకంఠంతో చెబుతున్నారు. పహాణీ, ఆర్వోఆర్ నకలు పుట్టించి మా భూములపై బినామీలు రుణాలు తీసుకొని కష్టాల పాలు చేసిన వ్యవస్థ మాకొద్దంటూ నినాదిస్తున్నారు. మళ్లీ పాత వ్యవస్థ తెచ్చి పహాణీలో 56 కాలమ్స్ చేరుస్తామని చెబుతున్న ప్రకటనలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతున్నది. దీంతో దళారులు పుట్టుకొస్తారని.. లంచాలు ఇవ్వందే పనులు జరగవని అభిప్రాయపడుతున్నారు. గతంలో రెవెన్యూ అధికారులతో అన్నదాతలు పడిన కష్టాలను గుర్తు చేసుకుంటున్నారు. ధరణితో మా భూములు మాకు దక్కాయని.. అమ్మాలన్నా కొనుగోలు చేయాలన్నా నిమిషాల్లో పని పూర్తవుతుందని.. మా భూముల వివరాలు సెల్ఫోన్లలో చూసుకుంటున్నాం.. అలాంటి వ్యవస్థను బంగాళాఖాతంలో వేస్తామని టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలు చేయడం సబబు కాదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
రైతు : నా పేరు కె.కొండల్. మాది మహబూబ్‌నగర్ జిల్లా మూసాపేట మండలకేంద్రం. మా నాయన వెంకటన్న అనారోగ్యంతో మరణించాడు. అయితే మా నాయిన పేరున ఉన్న భూమిని అమ్మ పేరుపై మార్చాలని మా అన్నదమ్ములం కలిసి పట్వారీ చుట్టూ తిరిగి తిరిగి అలిసి పోయాం. ‘నా పేరు మీద భూమి ఇంకెప్పుడు చేయిస్తరురా.. నేను చనిపోయిన తర్వాత చేసి బొంద కాడ తెచ్చి పెడతరా’ అని మా అమ్మ తిట్టేది. ఏడాదిన్నర తిరిగినా మా అమ్మ పేరుపై భూమి మారలేదు. ఆమె కూడా చనిపోయింది. ఇక తిరిగే ఓపిక లేక వదిలేశాం. కానీ సీఎం కేసీఆర్ సార్ ధరణి తెచ్చిన తర్వాత ఆ పట్వారే పిలిచి మా ముగ్గురి అన్నదమ్ములకు సమానంగా చేశారు. అప్పుడు అర్థమైంది. ధరణితోనే భూముల సమస్యలు పోతాయని అనుకున్నాం. కానీ ఇప్పుడేమో మళ్లీ ధరణి తీసేస్తామని కాంగ్రెసోళ్లు చెబుతున్నారు. ఆ విషయంపై ఆలోచన కూడా చేయడం మంచిది కాదు. రైతులకు మళ్లీ కష్టాలు వస్తావి. ధరణి ఉండడంతోనే మీ సేవలో వెళ్లి బుక్ చేసుకొని తాసీల్దార్ కార్యాలయానికి వెళ్తే అరగంటలోనే పేరు మారి పట్టాదార్ పాస్ బుక్ వస్తున్నది. బతికి ఉన్నంత కాలం నా పేరుపై ఉన్న భూమిని ఇంకెవరికి మార్చ తరంకాదు. నేను వేలిముద్ర పెడితే తప్పా సాధ్యంకాదు. అంత భద్రత, భరోసా వచ్చింది. అప్పుడైతే ఏండ్ల తరబడి పట్వారీ చుట్టూ తిరగాల్సి వస్తుండె. రైతు లేకపోయినా పట్వారీ రాసిస్తే భూమి వేరే వారి పేరుపైకి మారేది. ఉన్న భూమిని కూడా ఎంత చేయాలన్నా వారి చేతిలోనే ఉంటది. అందుకే ఇష్టమొచ్చిన వారికి ఎక్కువ, నచ్చని వారికి తక్కువ చేసేవారు. ఇప్పుడు ఆ సమస్యలే లేదని రైతులు ధైర్యంగా ఉన్నారు.
రైతు : ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా మంది భూమిని కౌలుకే ఇచ్చి.. వచ్చిన కౌలు బియ్యం తింటున్నారు. కానీ కౌలుదారుడి పేరు రికార్డుల్లోకి ఎక్కిస్తమంటే ఏ రైతుకూడా ఒప్పుకోడు. భూమిని బీడు అయినా పెట్టుకుంటడు కానీ కౌలుకు మాత్రం ఇవ్వరు. ఒకవేళ కౌలుకు ఇస్తే కౌలు రైతు పేరు ఎక్కుతుంది. ఆయన పేరు పీటీలో వస్తది. ఎప్పుడైనా ఆ భూమిని అమ్మాలంటే సదరు రైతు.. కౌలురైతు కాళ్లవేళ్ల పడి సంతకం పెట్టించాల్సి వస్తది. లేదంటే అతను అడిగినంత ఇవ్వాల్సి వస్తున్నది. అలా ఒప్పుకోకపోతే ఆ భూమి ఎప్పటికీ సమస్యలోనే ఉంటుంది. ఒక్క ధరణిని తీసివేయడం వల్ల భూముల వివరాలు అన్నీ కింద మీద అవుతవి. ధరణిని తీసేస్తమని చెప్పడమే వేస్ట్.
ధరణి అయిన తర్వాత పని బాగా అయితుంది.. అంత కష్టం కూడా లేదు. గత పాలనలో ముందు పహాణి కావాలంటే పట్వారి కాళుల మొక్కి.. పది సార్లు తిరిగాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు నెట్ సెంటర్కుపోతే పది రూపాయలు ఇస్తే ఐదు నిమిషాల్లో పట్టాపత్రం ఇస్తాడు. ఏది బాగా మళ్లా.. భూమి కొన్నా, అమ్మినా ఒక గంటల రిజిష్ర్టేషన్ అయితది. అదే భూమి పట్టా పాస్ బుక్కల ఎక్కుతది యాది బాగా.. కాంగ్రెస్, బీజేపోళ్ల మాటలు నమ్మితే చెట్లపాలు కావాల్సిందే.. మాయలు చేస్తరు.. కుట్రలు చేస్తుండ్రు.. రైతులంతా పైలంగా ఉండాలె.. సీఎం కేసీఆర్ సారు రైతులకు మంచి చేస్తుండు.. ఆయన్ను మంచి పనులు చేయనీయండ్రి. మరిన్ని చేసేందుకు మళ్లోసారి కారును గెలిపించాలి.. అప్పుడే రైతు రాజ్యం వస్తది..
ధరణి తీసేస్తే భూముల కథ మళ్లీ మొదటికి వస్తుంది. గ్రామాలోల ఎక్కడ చూసినా దళారీలు పుట్టుకొస్తరు. భూములు గోల్మాల్ అ వుతాయి. ధరణి ఉన్నందుకే మా భూములు భద్రంగా ఉన్నాయి. పైరవీలు లేకుండా రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. ధరణి రాక ముందు రిజిస్ట్రేషన్ చేయాలంటే అధికారుల చుట్టూ తిరగాల్సి వస్తుండె. ఇప్పుడు ఎలాంటి ఇబ్బంది లేదు. పట్వారీ తనం వస్తే రైతులు ఆగమైపోతారు. ధరణి తెచ్చి సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయమే బాగుంది.
కాంగ్రెస్ నేతలు అధికారంలోకి వస్తే పట్వారీ వ్యవస్థ తీసుకోస్తాం అంటున్నారు. గతంలో భూములకు సంబంధించి పాస్‌బుక్‌లు, పహాణీలు కావాలంటే రెవెన్యూ కార్యాలయం చుట్టూ తిరిగినా ఇచ్చేవారు కాదు.. డబ్బులు తీసుకొని కూడా రైతులను ఇబ్బందులు పెట్టినవారు ఉన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి ధరణి పోర్టల్ ద్వారా నేరుగా మీసేవ కేంద్రాల్లో పహాణీలు తీసుకుంటున్నారు. ఎవరికీ రూపాయి ఇవ్వకుండానే భూమి పట్టా పాసు పుస్తకాలు ఇంటికొస్తున్నాయి. మా భూములు సమగ్ర వివరాలు మీ సేవలో చూసుకుంటున్నాము. ధరణి రద్దు చేస్తే రైతుల భూములు ఉంటాయో.. పోతాయో.. తెలియని పరిస్థితి ఉంటుంది. మళ్లీ పాతరోజులు మాకు వద్దు. మాకు ధరణీయే ముద్దు. పట్వారీలు, కావలికార్లు డబ్బులు తీసుకొని రైతులకు తెలవకుండా రైతుల భూములు కాజేశారు. మాకు ధరణి ఉంటే మా భూములకు రక్షణ ఉంటుంది. ఎప్పుడు ఏ పత్రం అవసరమైనా మాకు ఇట్టే లభిస్తుంది.
ధరణిలో లోటు పాట్లు ఉన్నాయని.. అధికారంలోకి వస్తే ఆ వ్యవస్థను రద్దు చేస్తామని, మళ్లీ పట్వారీ వ్యవస్థ తీసుకొస్తామని కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతున్నారు. ఇది చూస్తే ఒక రైతుగా చాలా బాధ కలుగుతున్నది. ధరణి గురించి మాట్లాడే ముందు వారికి రైతు సమస్యలపై అవగాహన ఉండాలి. వారసత్వంగా వచ్చిన భూమిని పిల్లల పేరుపై రిజిస్ట్రేషన్ చేసుకోవాలాంటే ఎమ్మా ర్వో నుంచి మొదలు పెడితే, కావలికారు వరకు ముడుపులు ఇచ్చుకునే పరిస్థితి ఉండేది. ఒక రైతుగా స మస్యలను తెలుసుకున్న సీఎం కేసీఆర్ ఎంతో మంది మేధావులతో సమీక్షలు చేసి రైతుల ఇబ్బందులను తొలగించేందుకు ధరణి వ్యవస్థ తీసుకొచ్చారు. రైతులకు మేలు చేసిన ప్రభుత్వాన్ని ఎవరూ వదులుకోరు. ధరణి జోలికొస్తే రైతులు కాంగ్రెస్ నాయకులను తరమికొడతారు. గతంలో పడ్డ తిప్పలను ఇప్పటికీ మరిచిపోలేదు. కేవలం తమ పొట్టలు నింపుకునేందుకే ధరణి వ్యవస్థను రద్దు చేస్తామని కాంగ్రెస్ నేతలు మాట్లాడడడం సరికాదు.
తెలంగాణ ప్రభుత్వం వచ్చాక ధరణి తీసుకరావడంతో రైతులకు ఇబ్బందులు తొలిగాయి. మా భూములకు సంబంధించిన విషయాలు ధరణి పోర్టల్ ద్వారా త్వరగా తెలుసుకోవచ్చు. పాత పద్ధతి వస్తే మాకు ఏ పత్రం కావాలన్నా కార్యాలయాల చుట్టూ చెప్పులరిగేలా తిరగాల్సి వస్తుంది.. అయినా ఇచ్చేవారు కారు. డబ్బులు తీసుకున్నాగానీ సమయానికి పత్రాలు అందేవి కావు. ధరణి వచ్చాకే మా భూములు సమగ్ర విషయాలు మాకు తెలుస్తాయి. పటేల్, పట్వారీ వ్యవస్థతో రైతులకు కష్టాలు, నష్టలు తప్పవు. ధరణి మాకు ముద్దు.. మాకు కాంగ్రెస్ ప్రభుత్వం వద్ద.. ధరణియే మాకు రక్షణ.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ధరణి పోర్టల్‌ను రద్దు చేసి.. భూమాత పోర్టల్ తీసుకువస్తామని ఆ పార్టీ ప్రకటించింది. ఒకవేళ ధరణిని తీసేస్తే రైతులందరికీ నష్టం జరుగుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో పటేల్ పట్వారీల కాలం నాటి పరిస్థితులు వస్తాయి. ఇప్పుడు రైతులు ధరణి ద్వారా స్వేచ్ఛగా జీవిస్తున్నారు. పొలాలన్నీ భద్రంగా ఉన్నాయని గుండెమీద చెయ్యి వేసుకొని ఉంటున్నారు. ధరణి వల్ల రైతులకు నేరుగా భూమి మీద పూర్తి హక్కులు ఉన్నాయి. మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఎనుకటి కాలంలాగా అధికారులు, పెత్తందార్లు, దళారుల రాజ్యం వస్తది. వాళ్లు ఏం చెబితే అదే జరగాల్సి ఉంటుంది. పాతకాలం నాటిలాగా రెవెన్యూ రికార్డుల్లో అన్ని కాలమ్స్ ఉంటే చాలా నష్టపోతాం. కౌలు రైతులకు కూడా హక్కులు కల్పిస్తే భూములపై పట్టాదారుడికి అన్యాయం జరుగుతుంది. ఇప్పుడున్నటువంటి ధరణితో చాలా ఉపయోగకరంగా ఉంది. మళ్లా కేసీఆర్ సర్కార్ రావాలని రైతులంతా కోరుకుంటున్నారు.
ధరణి కంటే ముందు భూమి పట్టా విషయంలో చాలా ఇబ్బందులు ప డ్డాం. తండ్రి భూమి కొడుకులు చేసుకోవాలంటే కనీసం ఆరు నెలలు తాసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరగాల్సి వచ్చే ది. అధికారులకు అమ్యామ్యాలు ఇచ్చేటోళ్లం.. కానీ గిప్పుడు అన్ని కాగితాలు సరిగ్గా ఉంటే రెండు గంట లే చాలు.. భూమి రిజిస్ట్రేష న్ నిమిషాల్లో అయితుంది. పత్రాలు తొందరగానే వస్తున్నాయి. ఇదే భూమి రిజిస్ట్రేషన్ కర్ణాటకలో చూస్తే పంచనామా అంటూ అధికారులు అవీ.. ఇవీ.. అని ఆరు నెలల సమయం తీసుకుంటారు. అందుకే తెలంగాణలో అమలు చేస్తున్న ధరణే బాగుంది.. పని తొందరగా అయితుంది.. పైసా ఖర్చు కావడం లేదు..