వెల్దండ, మే19 : ఉరేసుకొని ఓ రైతు ఆ త్మహత్య చేసుకున్న ఘటన వెల్దండ మం డలం కంటోన్‌పల్లి గ్రామంలో ఆదివారం చోటుచేసుకున్నది. కుటుంబ సభ్యుల కథ నం మేరకు.. కంటోన్పల్లికి చెందిన కేశమ ని రైతు మల్లేశ్‌గౌడ్ (38) వ్యవసాయమే ఆధారంగా జీవనాన్ని సాగిస్తున్నాడు. ఆదివారం మధ్యాహ్నం తన వ్యవసాయ పొలానికి వెళ్లి చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
గమనించిన స్థానికులు అపస్మారక స్థితిలో ఉన్న మల్లేశ్‌గౌడ్‌ను ప్ర భుత్వ దవాఖానకు తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ద్రువీకరించారు. మృతుడికి భార్య లక్ష్మితోపాటు ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే ఆయన కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడని, మానసికంగా ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ఆత్మహత్య చేసుకొని ఉండవచ్చని పలువురు భావిస్తున్నారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యా ప్తు జరుపుతున్నట్లు ఎస్సై రవి వెల్లడించారు.