మిడ్జిల్, డిసెంబర్ 21 : విద్యార్థులు లక్ష్యానికి అనుగుణంగా ముందుకు సాగాలని సినీ దర్శక, నిర్మాత ప్రదీప్‌కుమార్ అన్నారు. శనివారం మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చేయూత స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో మండలంలోని ప్రభు త్వ, ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులకు నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడా రు. సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని, అవసరమైన మేరకే టెక్నాలజీని ఉపయోగించుకోవాలని సూచించారు.
ఇష్టమైన రంగాన్ని ఎంచుకొని అందు లో ఉన్నతంగా రాణించేలా కృషి చేయాలన్నారు. పరీక్షలంటే భయం వీడాలని డీఈవో ప్రవీణ్‌కుమార్ అ న్నారు. అంతకుముందు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. కార్యక్రమంలో చే యూత వ్యవస్థాపక అధ్యక్షుడు వెంకటేశ్వర్లు, మా ర్కెట్ కమిటీ చైర్పర్సన్ జ్యోతి, తాసీల్దార్ రాజు, ఎంపీడీవో గీతాంజలి, ఎంఈవో సుధాకర్, ఎస్సై శివనాగేశ్వర్నాయుడు, హెచ్ఎం సరస్వతి పాల్గొన్నారు.