మహబూబ్‌నగర్ అర్బన్, జనవరి 9 : కొత్త సంవత్సరంలో సామాజిక సేవా కార్యక్రమాలను మరింత ఉత్సాహంగా నిర్వహించాలని ఎక్సైజ్, క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని క్రౌన్గార్డెన్ ఫంక్షన్హాల్లో సోమవారం బీసీ మేధావుల సంఘం క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. అదేవిధంగా తెలంగాణ ప్రైవేట్ స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్, బీసీ మేధావుల సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ముగ్గుల పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని విద్యార్థినులకు ముగ్గుల పోటీలు నిర్వహించడం అభినందనీయమన్నారు. జిల్లా కేంద్రంలో ట్రస్మా కార్యాలయ భవన నిర్మాణానికి స్థలాన్ని కేటాయించామని, త్వరలోనే నిధులను మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. బీసీ మేధావుల సంఘం, ట్రస్మా ఆధ్వర్యంలో నిర్వహించే సామాజిక సేవా కార్యక్రమాలకు తనవంతు సహకారం అం దిస్తానని చెప్పారు. కాగా ముగ్గుల పోటీల్లో ప్రతిభకనబర్చిన విద్యార్థినులకు బహుమతులను ప్రదానం చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సింహులు, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు శివరాజ్, ట్రస్మా జిల్లా అధ్యక్షుడు ప్రభాకర్, రమేశ్ సరోడే, పాండురంగం, మాధవి, అంజిరెడ్డి, సురేందర్‌గౌడ్, హరినాథ్‌గౌడ్, మల్లికార్జున్, కౌన్సిలర్ రామ్‌లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.
వీరన్నపేటను అన్నివిధాలా అభివృద్ధి చేస్తాం
మహబూబ్‌నగర్‌టౌన్, జనవరి 9 : జిల్లా కేంద్రంలోని వీరన్నపేటను అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. వీరన్నపేటలో రూ.74.10 లక్షల వ్య యంతో నిర్మించనున్న సీసీరోడ్డు పనులకు శంకుస్థాపన చేశా రు. ఈ సందర్భంగా మంత్ర మాట్లాడుతూ గతంలో అభివృద్ధికి దూరంగా ఉన్న వీరన్నపేటలో అన్నిరకాల మౌలిక వసతులు కల్పించామన్నారు. ప్రభుత్వ పనుల్లో కాంట్రాక్టర్లు నా ణ్యత పాటించాలని సూచించారు. డబుల్ బెడ్రూం ఇండ్లు, బైపాస్ రహదారి రాకతో ప్రాధాన్యత పెరిగిందన్నారు. ఇండ్లు పడిపోయిన వారికి డబుల్ బెడ్రూం ఇండ్ల ఎంపికలో ప్రాధాన్యత ఇస్తామన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సింహులు, కమిషనర్ ప్రదీప్‌కుమార్, కౌన్సిలర్లు షబానాబేగం, చెన్నవీరయ్య, అంజయ్య, కోఆప్షన్ సభ్యులు రామలింగం, జ్యోతి, నాయకులు శివరాజ్, మోసీన్, శాంతయ్య, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.