ఎంవీఎస్ కళాశాల మైదానంలో ఏర్పాటుచేసిన సీఎం కేసీఆర్ బహిరంగ సభకు భారీగా తరలిరావాలని ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి రాకకోసం పాలమూరు ప్రజలు ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారన్నారు. సీఎం పర్యటన సందర్భంగా కలెక్టరేట్, పార్టీ కార్యాలయం, సభావేదికను మంత్రి ఎంపీ, ఎమ్మెల్యేలు, అధికారులతో కలిసి పరిశీలించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆదివారం మధ్యాహ్నం సీఎం రోడ్డు మార్గం మీదుగా పాలమూరుకు వస్తున్నారని.., ముం దుగా పార్టీ కార్యాలయాన్ని, ఆ తరువాత పాలకొండ వద్ద నిర్మించిన సమీకృత కలెక్టరేట్‌ను ప్రారంభిస్తారన్నారు. అధికారులతో జిల్లా అభివృద్ధిపై సమీక్షా సమావేశం నిర్వహించాక.. అక్కడే భోజనం చేస్తారని చెప్పారు.
అక్కడి నుంచి ఎం వీఎస్ డిగ్రీ కళాశాలలో జరిగే బహిరంగ సభలో ప్రసంగిస్తారని తెలిపారు. పాలమూరు ఎంపీగా తెలంగాణ సాధించిన ఉద్యమ నేత కేసీఆర్.. రాష్ట్రం ఏర్పడ్డాక జిల్లా రూపురేఖలు మార్చారన్నారు. ఎంతో అభివృద్ధి చెందిన మహబూబ్‌నగర్‌కు సీఎం వస్తున్న సందర్భంలో అభిమానులు, ప్రజలు, టీ ఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలిరావాలని కోరారు.
సీఎం కేసీఆర్ వస్తున్న వేళావిశేషం ఎంటో కానీ.. సుమారు రూ.10వేల కోట్ల పెట్టుబడితో దివిటిపల్లి వద్ద ఉన్న ఐటీ పార్కులో భారీ పరిశ్రమ రానున్నదని మంత్రి తెలిపారు. శుక్రవారం మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ఎంవోయూ కుదరడం జిల్లా ప్రజల అదృష్టమన్నారు. మంత్రి కేటీఆర్ చొరవ తీసుకొని 10 వేల మందికి ఉపాధి కల్పించే పరిశ్రమను జి ల్లాకు తీసుకురావడంపై కృతజ్ఞతలు తెలిపారు. త్వరలో ఐటీ టవర్ నిర్మాణం పూర్తి చేసుకొని కంపెనీల రాక మొదలవుతుందన్నారు. మంత్రి వెంట ఎంపీ రాములు, ఎమ్మెల్యేలు లక్ష్మారెడ్డి, ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, కలెక్టర్ వెంకట్రావు, అదన పు కలెక్టర్ తేజస్‌నందలాల్‌పవార్, డీసీసీబీ చైర్మన్ నిజాంపా షా, టీఎస్ఐఐసీ చైర్మన్ బాలమల్లు ఉన్నారు.