మహబూబ్‌నగర్, డిసెంబర్ 16 : రోడ్డు విస్తరణ పనుల పూర్తికి అధికారులు బాధ్యతగా పనిచేయాలని ఎక్సైజ్, క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ఆదేశించారు. కలెక్టరేట్లో శుక్రవారం ఆర్అండ్బీ, పంచాయతీరాజ్ అధికారులతో రహదారుల నిర్మాణ ప నులపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పనుల్లో వేగం పెంచి త్వరగా పూర్తి చేయాలని సూచించారు. హన్వాడ మండలం గొండ్యాల్ వద్ద బ్రిడ్జి విస్తరణతోపాటు, రోడ్డు నిర్మాణ పనులను చేపట్టేందుకు నివేదికలను సిద్ధం చేయాలని తెలిపారు. బ్రిడ్జి నిర్మాణంతో వర్షాకాలంలో ఎలాంటి ఇబ్బంది ఉండదన్నారు. నిర్ణీత గడువులోగా పనులు పూర్తయ్యేలా చూడాలన్నారు. సమావేశంలో ఆర్అండ్బీ అధికారులు స్వామి, సంధ్య తదితరులు ఉన్నారు.
పాలమూరు, డిసెంబర్ 16 : ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారంతో కులమతాలకు అతీతంగా పరిపాలన సాగిస్తున్నామని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. జిల్లా కేం ద్రంలోని ఎంబీసీ కల్వరి మెన్నోనైట్ బ్రదరన్ చర్చిలో నిర్వహించిన క్రిస్మస్ వేడుకలకు మంత్రి హాజరై కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కిస్టియన్ మైనార్టీలకు ప్రభుత్వం అన్నివిధాలా అండగా ఉం టుందన్నారు. మహబూబ్‌నగర్‌ను అన్నిరంగాల్లో అభివృద్ధి చేయడమే లక్ష్యమని తెలిపారు. కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ రాజేశ్వర్‌గౌడ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ రాజేశ్వర్, కౌన్సిలర్లు గోవిం దు, రాజురాణి, జాజిమొగ్గ నర్సింహు లు, ప్రతాప్‌కుమార్, పాస్టర్ యేసుపాదం, స్వదే శ్, టైటిల్పాల్ పాల్గొన్నారు.
నవాబ్‌పేట, డిసెంబర్ 16 : ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి, టీటీడీబోర్డు సభ్యుడు మన్నె జీవన్‌రెడ్డిని శుక్రవారం మంత్రి శ్రీనివాస్‌గౌడ్ పరామర్శించారు. ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన ఎంపీ సోదరుడు మన్నె వెంకట్రాంరెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. మంత్రి వెం ట గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ రాజేశ్వర్‌గౌడ్, ఎంపీపీ అనంతయ్య, సింగిల్‌విండో చైర్మన్ మాడెమోని నర్సింహులు, మార్కెట్ కమిటీ చైర్మన్ లక్ష్మయ్య, సింగిల్‌విండో డైరెక్టర్ ప్రతాప్, గురుకుంట సర్పంచ్ లక్ష్మమ్మ, ఎంపీటీసీ అనిత, మాజీ ఎంపీపీ శీనయ్య, నాయకులు గాండ్ల రవి, ఎర్రోళ్ల శ్రీనివాస్, పురుషోత్తం, ఉపసర్పంచుల సంఘం మం డల అధ్యక్షుడు రవికిరణ్, హన్మసానిపల్లి భీమయ్య తదితరులు పాల్గొన్నారు.