కొల్లాపూర్, అక్టోబర్ 3 : కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్లోకి మాజీ మంత్రి జూపల్లి వర్గీయులు వరుసగా క్యూకట్టారు. మంగళవారం కొల్లాపూర్, పెద్దకొత్తపల్లి మండలాలకు చెందిన జూపల్లి వర్గీయులు సుమారు 220 మంది కార్యకర్తలు హస్తం పార్టీని వీడి కారెక్కారు. పెద్దకొత్తపల్లి మండలం బాచారంలో 150 మంది బీఆర్ఎస్లో చేరారు. మారెడుమాన్‌దిన్నె గ్రామానికి చెందిన బీఆర్ఎస్ కార్యకర్తలు ఐదు రోజుల కిందట కాంగ్రెస్‌లోకి వెళ్లి, తిరిగి 50మంది తాజాగా బీఆర్ఎస్లో ఎమ్మెల్యే సమక్షంలో సాతాపూర్‌లో చేరారు.
కొల్లాపూర్ మండలం మాధవరావుపేట, మాచినేనిపల్లి గ్రా మానికి చెందిన జూపల్లి వర్గీయులు 20మంది ప ట్టణంలోని ఎమ్మెల్యే బీరం ఆధ్వర్యంలో బీఆర్ఎస్లో చేరారు. వీరికి గులాబీ కండువాలను కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ఆధ్వర్యం లో రాష్ట్రం సుభిక్షంగా ముందుకు సాగుతున్నదన్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీరం హర్షవర్ధన్‌రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపిస్తామని పార్టీలో చేరిన వారు పేర్కొన్నారు.
పార్టీలో చేరిన వారిలో మద్దిలేటి, కిష్టయ్య, చిన్నకుర్మయ్య, మల్లేశ్, వెంకటేశ్, రాముడు, సత్యంయాదవ్, గొల్ల వెంకటస్వా మి, తిరుపతయ్య, బాలు, సంగెం, కుర్మయ్య, జం బులమ్మ తదితరులు ఉన్నారు. కార్యక్రమంలో నాయకులు మల్లారెడ్డి, నరసింహారావు, సురేందర్, వెంకటకృష్టారెడ్డి, ఉపసర్పంచ్ శ్రీనివాసులు, మాజీ సర్పంచ్ తిరుపతయ్య, తిరుపతయ్యగౌడ్ తదితరులు పాల్గొన్నారు.