మహబూబ్‌నగర్, మే 12 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) ; లోక్‌సభ ఎన్నికలకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్ లోక్‌సభ స్థానాలకు సోమవారం ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కానున్నది. భారీ బందోబస్తు మధ్య ఓటింగ్ సరళిని జిల్లా అధికార యంత్రాంగం వెబ్‌క్యాస్ట్ ద్వారా పరిశీలించనున్నది. ఈ మేరకు పోలింగ్ కేంద్రాల్లో సీసీ కెమెరాలకు ఏర్పాటు చేశారు. ఆయా జిల్లాల్లోని సమీకృత కలెక్టర్ కార్యాలయం, పోలీస్ హెడ్‌క్వార్టర్‌లో రెవెన్యూ, పోలీసు అధికారులు ప్రత్యేకంగా కంట్రోల్ రూంలను ఏర్పాటు చేశారు. ఆదివారం ఈవీఎంలను భారీ బందోబస్తు మధ్య పోలింగ్ కేంద్రాలను తరలించారు. ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. రెండు లోక్‌సభ సెగ్మెంట్ల పరిధిలో మొత్తం 50 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. పోలింగ్ సాయంత్రం 6గంటల వరకు కొనసాగనున్నది.
సార్వత్రిక ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. సోమవారం ఉద యం ఏడు గంటల నుంచే పో లింగ్ ప్రారంభం కానుండగా ఈ మేరకు మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్ పార్లమెంట్ పరిధిలోని అ న్ని పోలింగ్ కేంద్రాల్లో అధికార యంత్రాంగం వి స్తృతంగా ఏర్పాట్లు చేసింది. భారీ బందోబస్తు నడు మ పోలింగ్ కొనసాగనుండగా పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ సరళిని జిల్లా అధికార యంత్రాంగం వెబ్ క్యాస్ట్ ద్వారా పరిశీలించనుంది. సమీకృత జిల్లా కలెక్టర్ కార్యాలయంలో, పోలీస్ హెడ్ క్వార్టర్లో ఇటు పోలీస్ యంత్రాంగం, అటు రెవెన్యూ అధికారులు ప్రత్యేక కంట్రోల్ రూంలను ఏర్పాటు చేశారు. లోక్‌సభ పరిధిలోని ఆయా అసెంబ్లీ సె గ్మెంట్లకు ఆదివారం పోలింగ్ సామగ్రిని(ఈవీఎంలను) భారీ బందోబస్తు మధ్య తరలించా రు. రెండు లోక్‌సభ పరిధిలో మొత్తం 50 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. మహబూబ్‌నగర్‌లో 31 మంది, నాగర్‌కర్నూల్‌లో 19 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. పక్షం రోజులుగా ప్రచారం చేపట్టి ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. చివరి రెండు రోజులు ఆయా పార్టీల అభ్యర్థులు ఓటర్లను పెద్దఎత్తున ప్రలోభ పెట్టినట్లు ఆరోపణలు వచ్చాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ఓటర్లు స్వేచ్ఛాయుతంగా తమ ఓటు హక్కును వినియోగించుకునే విధంగా విస్తృత ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే పోలింగ్ స్లిప్పులతోపాటు ఓటరు అవగాహన కార్యక్రమాలను నిర్వహించారు. వేసవికాలం కావడంతో పోలింగ్ కేంద్రాల వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
నాగర్‌కర్నూల్ పార్లమెంట్ పరిధిలో మొత్తం ఓటర్లు 17, 38,254 ఉండగా పురుషులు 8,64,875, స్త్రీలు 8,73,340, ఇతరులు 39మంది ఉన్నారు. మహబూబ్‌నగర్ పార్లమెంట్ పరిధిలో మొత్తం ఓటర్లు 16,80,417 ఉండగా పురుషులు 8,32,080, స్త్రీలు 8,48,293, ఇతరులు 44మంది ఉన్నారు. మహబూబ్‌నగర్ లోక్‌సభ పరిధిలో 1937పోలింగ్ కేంద్రాలు, నాగర్‌కర్నూల్ లోక్‌సభ పరిధిలో 1994పోలింగ్ కేంద్రాలను ఏ ర్పాటు చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు సాయం త్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగనున్నది.
పోలింగ్ సరళిపై పార్టీల అంచనాలు..
మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్ లోక్‌సభ పరిధిలో విస్తృత ప్రచారం నిర్వహించిన ప్రధాన పార్టీలు పోలింగ్ సరళిపై దృష్టి సా రించాయి. ఆయా సెగ్మెంట్లలోని పోలింగ్ స్టేషన్లల్లో భారీగా అంచనాలు వేసుకుంటున్నారు. ఫలానా పోలింగ్ కేంద్రంలో తమకు లీడ్ వచ్చే అవకాశం ఉందంటూ ఇప్పటికే ఒక అంచనాకు వచ్చా రు. పోలింగ్ ముగిశాక ఈ అంచనాలతో ఆయా పార్టీల అభ్యర్థులు ఓటింగ్ సరళిపై కొంతమందిని నియమించుకొని ఎప్పటికప్పుడు పర్యవేక్షించనున్నారు. ఈసారి అన్ని పార్టీలు ఓటర్లను కలవడంతోపాటు డిజిటల్ మీడియాను విస్తృతంగా ఉపయోగించారు. ఓటర్లకు తమ వాయిస్ మెసేజ్‌లు ఒకవైపు, మరోవైపు ఆయా ప్రధాన పార్టీలు తమ అధినేతల వాయిస్‌తో మెసేజ్‌లు పంపించాయి. ఇవ న్నీ ప్రచార సరళిలో భాగంగా ఓటర్లను ఆకట్టుకున్నాయి. పోలింగ్ రోజు కూడా ప్రత్యేక సర్వే బృందాలను ఏర్పాటు చేసుకొని ఓటర్ల నాడిని పసిగట్టేందుకు ఆయా పార్టీలు సిద్ధమవుతున్నాయి. అయి తే ఓటర్లు ఎవరికి పట్టం కడతారో కౌంటింగ్ రోజున తేలనున్నది.
పోలింగ్ కేంద్రాలకు చేరిన ఈవీఎంలు..
మహబూబ్‌నగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ఏడు సెగ్మెంట్లకు అధికార యంత్రాంగం పోలింగ్ సామగ్రిని భారీ బందోబస్తు మధ్య పోలింగ్ కేంద్రాలకు తరలించారు. కార్యక్రమాన్ని ఆయా జిల్లాల రిటర్నింగ్ అధికారులు, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులతోపాటు కేంద్ర ఎన్నికల సంఘం నియమించిన పరిశీలకులు డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలను పరిశీలించారు. అన్ని పోలింగ్ కేంద్రాలకు దగ్గర ఉండి సామగ్రిని తరలించారు. ఈవీఎంలు వీవీ ప్యాట్లు, ఇతర సామగ్రిని భారీ బందోబస్తు మధ్య పంపించారు. పోలింగ్ అయ్యాక ఈవీఎంలను పాలమూరు యూనివర్సిటీలోని స్ట్రాంగ్ రూంలకు తరలిస్తారు. స్ట్రాంగ్ రూంలలో భద్రపర్చిన ఈవీఎంల వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
అన్ని ఏర్పాట్లు చేసిన అధికారులు..
ఉమ్మడి జిల్లాలోని పోలింగ్ కేంద్రాల్లో ఓటర్ల కోసం అధికారులు ఏర్పాట్లు చేశారు. ఎండలు మండుతుండడంతో కేంద్రాల వద్ద టెంట్లు, తాగునీటి సౌకర్యం, దివ్యాంగ ఓటర్లకు వీలుగా ర్యాంపులు, ఓటు వేయడానికి వచ్చే వయోవృద్ధులకు కుర్చీలు ఏర్పాటు చేస్తున్నారు. ముందస్తు సమాచారం అందిస్తే వారికోసం వీల్చైర్లు ఇతర ఏర్పాట్లు కూడా చేపడుతున్నారు. ఇప్పటికే పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓటెయ్యని పరిస్థితి ఉన్న ఓటర్లకు హోం పోలింగ్ సౌకర్యాన్ని కూడా కల్పించారు. మహిళలకు ప్రత్యేక పోలింగ్ కేంద్రాలు కూడా ఏర్పాటు చేశారు. ఆయా అసెంబ్లీ సెగ్మెంట్లలో మోడల్ పోలింగ్ కేంద్రాలకూ శ్రీకారం చుట్టారు. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునే విధంగా ఇప్పటికే అధికార యంత్రాంగం అనేక ప్రచార కార్యక్రమాలు నిర్వహించింది.
పార్లమెంట్ బరిలో 50 మంది..
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని రెండు పార్లమెంట్ నియోజకవర్గాల్లో మొత్తం 50మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు పెద్దఎత్తున ఇండిపెండెంట్లు ఈ సారి రంగంలో ఉన్నారు. గతంలో స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేసిన వారికి నయానో బయా నో ఇచ్చి వారిని ప్రధాన పార్టీ అభ్యర్థులు బుజ్జగించి అభ్యర్థిత్వాన్ని ఉపసంహరించుకునేలా చేసేవారు. ఈసారి ప్రధాన పార్టీ అభ్యర్థులు ఎవరూ వీరిని పట్టించుకోకపోవడంతో వారంతా విత్ డ్రా చేసుకోకుండా పోటీలో నిలిచారు. మహబూబ్‌నగర్ లోక్‌సభలో పరిధిలో 31 మంది పోటీ చేస్తుండగా రెండు ఈవీఎంలను ఉపయోగిస్తున్నారు. ఒక్కో ఈవీఎంలో 16 మంది అ భ్యర్థుల గుర్తులు, మరో ఈవీఎంలో 15 మంది అభ్యర్థుల సింబల్స్‌తోపాటు చివరగా నోటాను కూడా కేటాయించారు. దీంతో 32క్రమసంఖ్య కావడంతో రెండు ఈవీఎంలు ఉపయోగిస్తున్నారు. ఇటు నాగర్‌కర్నూల్ లోక్‌సభ పరిధిలో కూడా 19మంది అభ్యర్థులు రంగంలో ఉండడంతో మొదటి ఈవీయంలో 16 మంది రెండో ఈవీఎంలో నోటాతోపాటు మూడు సింబల్స్ ఉన్నాయి. దీంతో ఇక్కడ కూడా రెండు ఈవీఎంలు ఉపయోగించాల్సిన పరిస్థితి నెలకొన్నది.