జడ్చర్లటౌన్, జనవరి 27 : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటివెలుగు కార్యక్రమంతో పేదలకు ఎంతో మేలు చేకూరుతున్నదని జెడ్పీ వైస్‌చైర్మన్ యాదయ్య అన్నారు. మండలంలోని చిన్న ఆదిరాలలో కంటివెలుగు శిబిరాన్ని ఎంపీడీవో ఉమాదేవితో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా దృష్టిలోపంతో బాధపడుతున్న పలువురికి కండ్లద్దాలను పంపిణీ చేశారు. అనంతరం మాట్లాడుతూ 18ఏండ్లు నిండిన ప్రతిఒక్కరూ కంటి పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీవో జగదీశ్, సర్పంచ్ రవి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రఘుపతిరెడ్డి, రాము లు, శ్రీశైలం, పర్వతాలు, బాలకిష్టయ్య పాల్గొన్నారు. కాగా గంగాపూర్‌లో మొత్తం 129మందికి పరీక్షలు నిర్వహించి నలుగురికి కండ్లద్దాలను అందజేశారు. మరో ఏడుగురికి అ ద్దాల కోసం ఆర్డర్ పెట్టారు. అలాగే చిన్నఆదిరాలలో 168 మందికి పరీక్షలు నిర్వహించగా, 25 మందికి కండ్లద్దాలను పంపిణీ చేశారు. మరో 25 మందికి అద్దాల కోసం ఆర్డర్ పెట్టినట్లు డాక్టర్ సమత తెలిపారు. అదేవిధంగా మున్సిపాలిటీలోని 1 ,2 వార్డుల్లో ఏర్పాటు చేసిన శిబిరంలో మొత్తం 326మందికి పరీక్షలు నిర్వహించి 40మందికి కండ్లద్దాలు పంపిణీ చేశారు. మరో 17 మందికి అద్దాల కోసం ఆర్డర్ పెట్టినట్లు అర్బన్ హెల్త్‌సెంటర్ డాక్టర్ శివకాంత్ తెలిపారు.
అనూహ్య స్పందన
భూత్పూర్, జనవరి 27 : ప్రభుత్వం చేపట్టిన కంటివెలుగు కార్యక్రమానికి ప్రజల నుంచి అనూహ్య స్పందన వస్తున్నదని మున్సిపల్ చైర్మన్ సత్తూర్ బస్వరాజ్‌గౌడ్ అన్నారు. మున్సిపాలిటీలోని మూడోవార్డు గోప్లాపూర్‌లో కంటివెలుగు శిబిరాన్ని పరిశీలించారు. అలాగే కప్పెటలో కంటివెలుగు శిబిరాన్ని వైస్‌ఎంపీపీ నరేశ్‌గౌడ్ పరిశీలించి వివరాలను తెలుసుకున్నారు. గోప్లాపూర్ 280మందికి పరీక్షలు నిర్వహించి 110మందికి అద్దాలను పంపిణీ చేసినట్లు సీహెచ్‌వో రామ య్య తెలిపారు. కప్పెటలో 251మందిని పరీక్షించి 56మందికి కండ్లద్దాలను అందజేసినట్లు పేర్కొన్నారు. కార్యక్రమం లో సర్పంచ్ వేణుగోపాలాచారి, కౌన్సిలర్ శ్రీనివాస్‌రెడ్డి, డాక్టర్లు అబ్దుల్ రబ్బు, హిమబిందు, రాధిక, సూపర్వైజర్లు యాదమ్మ, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.
479మందికి కంటి పరీక్షలు
నవాబ్‌పేట, జనవరి 27 : కంటివెలుగు కార్యక్రమంలో భాగంగా నవాబ్‌పేట, రాంసింగ్‌తండా, కొల్లూరు గ్రామాల్లో 479మందికి పరీక్షలు నిర్వహించినట్లు మండల వైద్యాధికారి విజయలక్ష్మి తెలిపారు. నవాబ్‌పేటలో 202మందికి పరీక్షలు నిర్వహించి 32మందికి కండ్లద్దాలు అందజేసినట్లు పేర్కొన్నారు. మరో 32మందికి అద్దాల కోసం ఆర్డర్ పెట్టిన ట్లు వివరించారు. అలాగే రాంసింగ్‌తండాలో 76మందికి ప రీక్షలు నిర్వహించి 16మందికి అద్దాలు అందజేశారు. ఇద్దరి కి అద్దాల కోసం ఆర్డర్ చేసినట్లు తెలిపారు. కొల్లూరులో 201మందికి కంటి పరీక్షలు నిర్వహించి 25మందికి కండ్లద్దాలు పంపిణీ చేశారు. మరో ఐదుగురికి అద్దాల కోసం ఆర్డర్ చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో సిబ్బంది బీచుపల్లిగౌడ్, శ్రీనివాస్, శకుంతల, శరబలింగం, రాఘవేందర్ ఉన్నారు.
మిడ్జిల్ మండలంలో..
మిడ్జిల్, జనవరి 27 : మండలకేంద్రంతోపాటు ఈదులబావితండాలో ఏర్పాటు చేసిన కంటివెలుగు శిబిరాల్లో 349 మందికి పరీక్షలు నిర్వహించినట్లు డాక్టర్ మనుప్రియ తెలిపారు. వీరిలో 29మందికి కండ్లద్దాలను అందజేశామని, మరో 37మందికి అద్దాల కోసం ఆర్డర్ చేసినట్లు పేర్కొన్నా రు. కంటివెలుగు కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అందరూ సహకరించాలని కోరారు. కార్యక్రమంలో డాక్టర్ కృష్ణకుమార్, సిబ్బంది దేవయ్య, జంగయ్య పాల్గొన్నారు.
దేవరకద్ర మండలంలో..
దేవరకద్ర, జనవరి 27 : మండలకేంద్రంతోపాటు బస్వాయిపల్లిలో ఏర్పాటు చేసిన కంటివెలుగు శిబిరాల్లో 290మందికి పరీక్షలు నిర్వహించినట్లు డాక్టర్ శరత్చంద్ర తెలిపారు. దృష్టిలోపంతో బాధపడుతున్న పలువురికి కండ్లద్దాలను అందజేసినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో వైద్యసిబ్బంది పాల్గొన్నారు.
బాలానగర్ మండలంలో..
బాలానగర్, జనవరి 27 : మండలంలోని చిన్నరేవల్లిలో ఏర్పాటు చేసిన కంటివెలుగు శిబిరాన్ని తాసిల్దార్ శ్రీనివాసు లు పరిశీలించారు. మండలకేంద్రంలో 212మందికి కంటి పరీక్షలు నిర్వహించి 29 మందికి కండ్లద్దాలు పంపిణీ చేశా రు. మరో 26మందికి అద్దాల కోసం ఆర్డర్ పెట్టినట్లు డాక్టర్ సృజన తెలిపారు. చిన్నరేవల్లిలో 151మందికి కంటి పరీక్షలు నిర్వహించి 28మందికి అద్దాలు అందజేయగా, మరో 11మందికి అద్దాల కోసం ఆర్డర్ చేసినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆర్ఐ వెంకట్‌రెడ్డి, సర్పంచ్ లక్ష్మీచంద్రమౌ ళి, వైద్యసిబ్బంది పాల్గొన్నారు.
రాజాపూర్ మండలంలో..
రాజాపూర్, జనవరి 27 : కంటివెలుగు కార్యక్రమంలో భాగంగా రాజాపూర్ ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో 141మందికి పరీక్షలు నిర్వహించి 51మందికి కండ్లద్దాలను పంపిణీ చేసినట్లు కోఆర్డినేటర్ శ్రీనివాసులు తెలిపారు. మరో 16మందికి అద్దాల కోసం ఆర్డర్ చేసినట్లు పేర్కొన్నారు. కాగా కంటివెలుగు శిబిరాన్ని స్పెషల్ ఆఫీసర్ శ్వేత, ఎంపీడీ వో పరిశీలించారు. కార్యక్రమంలో డాక్టర్లు మధుసూదన్రా వు, మౌనిక, ప్రసన్న, ఉత్తరయ్య పాల్గొన్నారు.
కౌకుంట్ల, సీసీకుంట మండలాల్లో..
దేవరకద్ర రూరల్, జనవరి 27 : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటివెలుగు కార్యక్రమం చురుకుగా సాగుతున్నది. కౌకుంట్ల మండలం పేరూర్లో 157మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. వీరిలో ఆరుగురికి కండ్లద్దాలు పం పిణీ చేసి, మరో ముగ్గురికి అద్దాల కోసం ఆర్డర్ చేశారు. చిన్నచింతకుంటలో 204మందికి పరీక్షలు నిర్వహించి 11మందికి కండ్లద్దాలు అందజేశారు. మరో 17మందికి అద్దాల కోసం ఆర్డర్ చేశారు. మద్దూర్‌లో 63మందికి పరీక్షలు నిర్వహించి నలుగురికి అద్దాలు పంపిణీ చేశారు. మరో ఐదుగురికి అద్దాల కోసం ఆర్డర్ చేశారు. కార్యక్రమంలో కంటివెలుగు అధికారులు సనా, సంతోష్, షఫీఖ్, వైద్యాధికారులు రాధిక, రాహుల్, క్యాంప్ కోఆర్డినేటర్ రాజన్న, ఖాదర్, సూపర్వైజర్ సుశీల పాల్గొన్నారు.