మహబూబ్నగర్ : పాలమూరు యూనివర్సిటీలో (Palamuru University ) విధులు నిర్వహిస్తున్న నాన్ టీచింగ్ ఉద్యోగులకు ఈఎస్ఐ( ESI ) అమలు చేస్తున్నట్లు వైస్ ఛాన్స్లర్ జి ఎన్ శ్రీనివాస్ ( Vice Chancellor Srinivas ) తెలిపారు . గురువారం వర్సిటీ పరిపాలన భవనంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బోధనేధర సిబ్బందికి ఈఎస్ఐ అమలు ఆర్డర్ కాపీలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యోగులందరీ శ్రేయస్సు కోరి ఈఎస్ఐ అమలు చేస్తున్నట్లు తెలిపారు.
ఈఎస్ఐ అమలుతో వర్సిటీ సిబ్బంది రాష్ట్రంలోని 17 కార్పొరేట్ హాస్పిటల్లో చికిత్స పొందేందుకు అవకాశం ఉందని తెలిపారు. బోధనేతర సిబ్బంది వేతన పెంపు సమస్యను సైతం త్వరలోనే పరిష్కరిస్తామని అన్నారు. ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ తీర్మానంతో శాశ్వత పరిష్కారానికి చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. రిజిస్టర్ రమేష్ బాబు మాట్లాడుతూ సిబ్బంది ఆరోగ్యమే తమకు ముఖ్యమని అన్నారు. అందులో భాగంగానే ఈఎస్ఐ అమలు నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.
బోధనేతర సిబ్బందికి ఈఎస్ఐ అమలుపరచడంతో పాలమూరు యూనివర్సిటీ బోధ నేతర ఉద్యోగుల సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు జే ఆర్ రామ్మోహన్ ఆధ్వర్యంలో ఉద్యోగ యూనియన్ నాయకులు, వర్సిటీ ఉపకులపతి జీఎన్ శ్రీనివాస్, రిజిస్టర్ రమేష్ బాబును పూలమాలలు శాలువాలతో సత్కరించారు. ఈ సందర్భంగా రామ్మోహన్ జి మాట్లాడుతూ ఈఎస్ఐ అమలకు ఎన్నో ఏళ్లుగా వినతి పత్రాలు అందజేస్తూ ఆందోళనలు చేపట్టామని తెలిపారు .
హెల్త్ కార్డు తీసుకోవాలన్న ఇన్సూరెన్స్ కంపెనీకి ప్రీమియం కట్టలేని పరిస్థితుల్లో నాన్ టీచింగ్ ఎంప్లాయిస్ ఉన్నారని వారందరికీ ఈఎస్ఐ అమలుపరచడం సంతోషమని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉద్యోగుల సంఘం ఉపాధ్యక్షుడు పర్వతాలు, రాగిణి, కోశాధికారి రాజేందర్, కార్యవర్గ సభ్యులు సురేష్, శ్రీనివాసులు, వెంకటేష్, శ్రీనివాస్, రామకృష్ణ, యూసుఫ్, సత్యమూర్తి , రఘునందన్, రాము, శృతి ,తారకేశ్వరి, శంకర్, రవి, కిరణ్, బాలకృష్ణ ,తదితరులు పాల్గొన్నారు.