వడ్డేపల్లి : గద్వాల్ జిల్లా వడ్డేపల్లి మండలం శాంతినగర్‌కు చెందిన రిటైర్డ్ ఉపాధ్యాయులు ఎర్రమల్ల రామ్మోహన్ షెడ్యూల్ క్యాస్ట్ ఫెడరేషన్ ( SCF ) రాష్ట్ర ప్రధానకార్యదర్శిగా నియామకమయ్యారు. ఈ మేరకు నియామక పత్రాన్ని అందజేశారు. రామ్మోహన్ మాట్లాడుతూ తెలంగాణలోని ఎస్సీల అభివృద్ధికి జనాభా దామాషా ప్రకారం బడ్జెట్‌ను ( Budget ) కేటాయించాలని డిమాండ్ చేశారు.
విద్యా,ఉద్యోగ, ఉపాధి , భూమి, ఇల్లు సంక్షేమ కార్యక్రమాలకు నిధులు విడుదల చేయాలని కోరారు. జోగులాంబ గద్వాల జిల్లాలో బీసీ ఫెడరేషన్, ఎస్సీ ఫెడరేషన్, తదితర అనుబంధ సంఘాల కమిటీలు వేసి బలోపేతం చేస్తామని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో బీసీ ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు నాగనమోని చెన్నరాములు ముదిరాజ్ , ఎస్సీ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు పస్పుల రామకృష్ణ ,రాష్ట్ర కార్యదర్శి బహుజన రమేష్ , బీసీ ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి అమడబాకుల రామన్ గౌడ్, మాజీ ఎంపీటీసీ, మహాజన రైతు సమాఖ్య రాష్ట్ర ఉపాధ్యక్షులు సంధ్య, పాగా వెంకటేష్ , తదితరులు పాల్గొన్నారు.