వనపర్తి, నవంబర్ 9 (నమస్తే తెలంగా ణ) : వనపర్తి జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ అస్తవ్యస్తంగా మారింది. దసరా నుంచి జిల్లాలో వరికోతలు నడుస్తుండగా, ధాన్యం కొనుగోలు చేసే ఆనవాళ్లు కనిపించడం లేదు. అక్కడక్కడా కొన్ని సెంటర్లను ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు, అ ధికారులు ప్రారంభం చేసి వెళ్లడమే తప్పా ఎలాంటి కార్యాచరణ సాగడం లేదు. దా దాపు పక్షం రోజుల కిందట ఎమ్మెల్యేలు ప్రారంభించిన కేంద్రాల్లోనూ ఒక్క వడ్ల గింజ కూడా సర్కారు కొనుగోలు చేయలేదంటే జిల్లాలో ప్రభుత్వ కొనుగోళ్ల పరిస్థితి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రైవేట్ వ్యాపారులు మాత్రం ప్రభుత్వ ఉదాసీనతను సొమ్ము చేసుకుంటున్నారు. సందట్లో సడేమియా అన్నట్లు అందినకాడికి రైతులతో ధాన్యాన్ని కొనేస్తున్నారు. ఇప్పటి వరకు జిల్లాలో 30వేల మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని ప్రైవేట్ వ్యాపారులు కొనుగోలు చేసినట్లు అనధికార అంచనా.
కేంద్రాలకు చేరని సామగ్రి..
ధాన్యం కొనుగోలు కేంద్రాలకు సామగ్రి పంపిణీ సరిగా లేదు. గత నెలలోనే అంతా సిద్ధమంటూ ప్రకటించినా జిల్లా లో ఏ ఒక్క సెంటర్‌కు పూర్తిస్థాయిలో సా మగ్రి సరఫరా కాలేదు. దీంతో రోజుల త రబడి ధాన్యం తూకాల కోసం రైతులు ఎ దురు చూడాల్సి వస్తున్నది. విధిలేని పరిస్థితిలో తుఫాన్ల ధాటికి ప్రైవేట్‌గా రైతులు విక్రయించుకోవాల్సి వస్తున్నది. అనేక సెం టర్లకు సంచులు కూడా సరఫరా కాలేదు. కొన్ని సెంటర్లకు పనికిరాని చిరిగిన సంచులను పంపించారు. మరికొన్నింటికి స్టాం పులు రాలేదు. కొనుగోలు చేసిన ప్రతి స న్న, లావు వడ్ల సంచులపై ప్రత్యేకంగా స్టాంపులు వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలో కోతలు జోరందుకు న్నా.. ప్రైవేట్ వ్యాపారులు వేగంగా కొనుగోలు చేస్తున్నా సెంటర్లకు సామగ్రి చేరకపోవడంతో అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
బోనస్ పేరుతో అసలుకే ఎసరు..
సన్న వడ్లకు క్వింటాకు రూ.500 బో నస్ ప్రకటించిన కాంగ్రెస్ ప్రభుత్వం అసలుకే ఎసరు పెట్టిందన్న విమర్శలను అన్నదాతలు వ్యక్తం చేస్తున్నారు. ఎవరు అడగకుండానే ప్రభుత్వమే ప్రకటించి అనేక కొ త్త నిబంధనలు విధించిందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వడ్ల గింజ పొడవు, వెడల్పు, లావు సైజుల నిబంధనలతో రై తులను ఇబ్బందులకు గురిచేయడమేంట ని ప్రశ్నిస్తున్నారు. పదేండ్లలో ఎప్పుడూ ఇంతలా వడ్ల తూకాలకు రైతులు ఇబ్బందులు పడిన దాఖలాలు లేవని చెబుతున్నారు. రైతులు విసుగు చెంది ప్రైవేట్‌కు అమ్ముకునేలా ప్రభుత్వమే ఇలా చేస్తుందన్నట్లుగా ప్రచారం జరుగుతున్నది.
జిల్లా పౌరసరఫరాల శాఖ అస్తవ్యస్తం గా కొనసాగుతున్నది. గతంలో జరిగిన ధా న్యం కొనుగోళ్లలో ఇంతలా మిల్లర్లు కాజేయడానికి పౌరసరఫరాల శాఖనే ప్రధాన కారణం. ఇందుకు బాధ్యులుగా వ్యవరించిన అధికారులు కొందరైతే, తెరవెనక నుంచి నడిపించింది మరికొందరు అధికారులుగా ప్రచారంలో ఉన్నది. ఇదిలా ఉం టే, ప్రస్తుతం ధాన్యం కొనుగోలు ప్రక్రియ జిల్లాలో రాద్ధాంతమవుతున్నది. ఈ నేపథ్యంలోనే జిల్లా పౌరసరఫరాల శాఖ డీ ఎంగా ఉన్న ఇక్బాల్ వివిధ ఆరోపణలతో బుధవారం బదిలీకి గురయ్యారు. ఈయ న స్థానంలో మరో అధికారి రమేశ్ బాధ్యతలు తీసుకున్నారు. కొనుగోళ్లలో జరిగిన అవినీతి స్కాంలు ఒక పక్క కొనసాగుతుండగా, ఇప్పుడు జరగాల్సిన కొనుగోళ్ల ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించడం లో కొత్త అధికారికి సవాలన్నట్లుగా ఉన్నది.