నాగర్‌కర్నూల్‌టౌన్, జూలై 1 : తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని బుధవారం జిల్లాలో పర్యటించారు. కలెక్టరేట్‌కు చేరుకున్న ఆమెకు కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్, ఎస్పీ సంగ్రా మ్ సింగ్ జీ పాటిల్ పుష్పగుచ్ఛాలు అందించి స్వాగ తం పలికారు. అనంతరం కలెక్టరేట్లోని కలెక్టర్ చాంబర్లో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కలెక్టర్, ఎస్పీతో సమావేశమయ్యారు. జిల్లాలో కొనసాగుతున్న ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ సవరణ ప్రక్రియపై ఆరా తీశారు. జిల్లాలో కొనసాగుతున్న వివిధ కార్యక్రమాలు, పరిపాలన అంశాలపై కలెక్టర్, ఎస్పీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కు వివరించారు.
ఓటరు జాబితా నవీకరణ, కొత్త ఓటర్ల నమోదు, చిరునామా, మార్పులు, మరణించిన ఓటర్ల వివరాల తొలగింపు, అర్హులైన ప్రతి పౌరుడికి ఓటు హక్కు కల్పించే దిశగా చేపడుతున్న చర్యలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. సర్ కార్యక్రమాన్ని పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహిస్తూ ఎన్నికల సంఘం మార్గదర్శకాలను ఖచ్చితంగా అమలు చేయాలని సూచించినట్లు తెలిసింది. ఈ సందర్భంగా కలెక్టర్ జిల్లాలో సర్ ప్రక్రియ అమలు తీరు, బూత్ స్థాయి అధికారుల పనితీరు, ప్రజల నుంచి అందుతున్న దరఖాస్తుల స్వీకరణ, పరిశీలన ప్రక్రియ గురించి వివరించారు.
సోమశిలలోనూ..
కొల్లాపూర్, జూలై 1: తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుముదిని బుధవారం కొల్లాపూర్ ప్రాంతంలో పర్యటించారు. ముందుగా కృష్ణానదితీరంలో ఉన్న లలితాసోమేశ్వర ఆలయాన్ని కుటుంబ సమేతంగా సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే సంగమేశ్వర ఆలయాన్ని సం దర్శించారు. అంతకు ముందు ఆమెకు ఆర్డీవో బన్సీలాల్, కొల్లాపూర్ తాసీల్దార్ మాధవి, టూరిజం జిల్లా అధికారి కల్వరాల నరసింహలు స్వాగతం పలికారు.