కొల్లాపూర్, నవంబర్ 25 : మా ఇంటి పెద్దకొడుకు కేసీఆర్ దిగిపోయాక మాకు పింఛన్లు సరి గ్గా రావడంలేదని వృద్ధులు వాపోతున్నారు. గ తంలో ప్రతినెలా మొదటి వారంలోనే పింఛన్లు వచ్చేవని.. ఇప్పుడు నెలాఖరు వచ్చినా పింఛన్లు రావడంలేదని వృద్ధులు ఆరోపిస్తున్నారు. నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలంలోని ముక్కిడిగుండం జీపీ కార్యాలయం వద్ద సోమవారం పింఛన్లు పంపిణీ చేయాలని గ్రామానికి వంద మంది వృద్ధులు నిరసన వ్యక్తం చేశారు.
ఫించన్లు రాకపోవడంతో సుస్తయితే గోళి బిళ్లలకు పైసలు లేవని వృద్ధులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రా మంలో రూ.2016 బదులు రూ.2వేలు మాత్ర మే ఇస్తూ కొసరు మింగుతున్నారన్నారు. ఈ సందర్భంగా సీపీఎం గ్రామ కార్యదర్శి అశోక్ వృ ద్ధులతో మాట్లాడారు. ప్రభుత్వం వెంటనే వృద్ధులకు ఫించన్లు పింపిణీ చేయకుంటే ఆందోళన కార్యక్రమాలు చేపడుతామని హెచ్చరించారు.
ధన్వాడ, నవంబర్ 25 : బీఆర్ఎస్ ప్రభుత్వంలో వృద్ధులకు నెలనెలా సక్రమంగా పింఛనందించేవారని.. కాంగ్రెస్ ప్రభుత్వంలో పింఛన్ కోసం పడిగాపులు పడాల్సి వస్తుందని వృద్ధులు ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం మండల కేంద్రంలో పింఛన్ డబ్బులు పంపిణీ చేయాలని కోరుతూ రోడ్డెక్కారు. ప్రతినెలా పింఛన్ డబ్బులు 18నుంచి 20వ తేదీ వరకు పోస్టాఫీస్‌లో ఇచ్చేవారని.. ఈనెల 25వ తేదీ వచ్చినా మాకు పింఛన్ డబ్బులు ఎందుకు ఇవ్వడంలేదని ప్రశ్నించారు. అనంతరం పోలీసులు చేరుకొని వృద్ధులను సముదాయించి రెండు రోజుల్లో పింఛన్ డ బ్బులు ఇచ్చేవిధంగా చూస్తామని హామీ ఇవ్వడం తో వృద్ధులు శాంతించారు.