Nagar Kurnool | వాగు దాటుతు ప్రమాదవశాత్తు కొట్టుకుపోయి మృత్యువాత పడ్డ వృద్ధుడు
Nagar Kurnool | నాగర్కర్నూల్ జిల్లాలో దుందుభి వాగు దాటుతూ ఓ వృద్ధుడు మృతి చెందాడు.
నాగర్ కర్నూల్ : వరుసగా కురుస్తున్న ముసరు వర్షాలకు నాగర్కర్నూల్ జిల్లాలోని దుందుభి వాగు (Dundubhi vagu ) ఉదృతంగా ప్రవహిస్తోంది. ఈ నేపథ్యంలో ఓ వృద్ధుడు ( Oldman ) వాగు దాటుతుండగా ప్రమాదవశాత్తు కొట్టుకుపోయి మృత్యువాత పడ్డాడు. ఈ ఘటన శనివారం ఉదయం చోటు చేసుకుంది.
తెలకపల్లి మండలం (Telakapalli Mandal) గౌరారం గ్రామానికి చెందిన కురువ సొంటె పెద్ద జంగయ్య (65) వంగూర్ మండల పరిధిలోని పోతిరెడ్డిపల్లిలో ఉండే కుమార్తె వద్దకు వెళ్లేందుకు వాగు దాటుతున్న క్రమంలో కాలుజారి వాగులో గల్లంతయ్యాడు. స్థానికులు గుర్తించి వెంటనే కాపాడే ప్రయత్నం చేసినప్పటికీ అప్పటికే మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నారు. వాగు ఉధృతి పెరుగుతున్న నేపథ్యంలో అధికారులు రక్షణ చర్యలు చేపట్టారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

