మహబూబ్ నగర్ కలెక్టరేట్ : రైతులకు నాణ్యమైన , లో ఓల్టేజ్ సమస్య లేకుండా విద్యుత్ ను అందించేందుకు కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే యెన్నేం శ్రీనివాస్ రెడ్డి ( MLA Yennem Srinivas Reddy ) అన్నారు. మహబూబ్ నగర్ నియోజకవర్గం లోని మన్యంకొండ( Manyamkonda) గ్రామం లో నూతన 33/11 కెవి విద్యుత్ సబ్ స్టేషన్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సబ్ స్టేషన్ నిర్మాణంతో పాలమూరు యూనివర్సిటీకి నిరంతరం కరెంటు సరఫరా అవుతుందని పేర్కొన్నారు.
విద్యుత్ సబ్ స్టేషన్ ఏర్పాటుతో విద్యుత్ సరఫరాలో అంతరాయం , విద్యుత్ కోతలు, లో ఓల్టేజ్ సమస్యలు లేకుండా గ్రామాలకు మేలు జరుగుతుందని వెల్లడించారు. మన్యంకొండ దేవాలయ అభివృద్ధికి ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని అన్నారు. మన్యంకొండ దేవాలయ అభివృద్ధికి రూ. 130 కోట్లతో నివేదికలు తయారు చేసి ప్రభుత్వానికి పంపించామని వివరించారు.
కార్యక్రమంలో వీసీ ఆచార్య జి ఎన్ శ్రీనివాస్, యూనివర్సిటీ పీజీ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ మధుసూదన్ రెడ్డి , జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహ్మారెడ్డి, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, మార్కెట్ కమిటీ చైర్మన్ బెక్కెరి అనిత మధుసూదన్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్, ఎస్ఈ పివి రమేష్ , డిఇ (ఆపరేషన్) లక్ష్మణ్, తహసీల్దార్ సుందర్ రావు, నాయకులు మల్లు అనిల్ రెడ్డి, అనిల్, సుధాకర్ రెడ్డి, రామచంద్రయ్య, శ్రీనివాస్ యాదవ్, గోవింద్ యాదవ్, ధర్మాపూర్ నర్సింహారెడ్డి, ఎన్ బాలయ్య, పోతన్ పల్లి మోహన్ రెడ్డి, కె.మహేందర్ గౌడ్, ప్రవీణ్ కుమార్, పులిజాల రవికిరణ్, కురుమూర్తి , తదితరులు పాల్గొన్నారు.