మహబూబ్‌నగర్ టౌన్, డిసెంబర్ 14 : టీఆర్ఎస్ ప్రభుత్వం పేదల ప్రభుత్వమని, ఎల్లప్పుడు అండగా ఉంటామని ఆబ్కారీ, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. మంగళవారం మహబూబ్‌నగర్ మున్సిపాలి టీ పరిధిలోని అశోక్‌టాకీస్ చౌరస్తా వేపూర్ గేరి సమీపంలో ప్రధాన మురిగి కాలువలో రూ.10లక్షల 30వేలతో ఆధునిక టెక్నాలజీతో ఏర్పాటు చేసిన చెత్తను వేరు చేసే రోబోటిక్ డివైజ్‌ను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో మున్సిప ల్ చైర్మన్, వార్డు కౌన్సిలర్లు వార్డులో తిరగలేని పరిస్థితి ఉండేదన్నారు. తాగునీరు, విద్యుత్, అనేక సమస్యలు ఉండేవన్నారు. ఎమ్మెల్యేగా గెలిచిన తరువాత వార్డు కౌ న్సిలర్లు, అధికారులతో కలిసి ప్రతి వార్డు తిరిగి సమస్య గుర్తించి పరిష్కరించామన్నారు. ఇప్పడు మహబూబ్‌నగర్ వేగంగా అభివృద్ధి చెందుతున్నదన్నారు. మినీ ట్యాంక్ బండ్లో చెత్తను తొలగించి సుందరంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. వేపూర్గేరిలో కమ్యూనిటీ హా ల్కు ఇప్పటికి రూ.14లక్షలు ఇచ్చామని, మరో రూ.15 లక్షలు కావాలని కోరారని మంత్రి తెలిపారు. అశోక్‌టాకీస్ చౌరస్తా వద్ద ఉన్న మెకానిక్ షాపు ఓనర్ల భవన ని ర్మాణానికి ఆర్థికసాయం అందజేస్తామన్నారు. త్వరలో మున్సిపాలిటీలో పింఛన్ ఇచ్చే కార్యక్రమాన్ని చేపడుతామన్నారు.
మైదానాలు అభివృద్ధి చేస్తాం..
క్రీడాభివృద్ధికి, మైదానాల అభివృద్ధికి కృషి చేస్తున్నామని మంత్రి డా.వీ.శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. ఫీర్ హష్మీ జన్మదినాన్ని పురస్కరించుకొని మంగళవారం స్థానిక బాలుర కళాశాల మైదానంలో ఫీర్ హష్మీ ఫుట్‌బాల్ టో ర్నీ, రక్తదాన శిబిరం నిర్వహించారు. మంత్రి ముఖ్య అ తిథిగా హాజరై పోటీలను ప్రారంభించారు. జిల్లా మైదానంలో సింథటిక్ ట్రాక్ ఏర్పాటు చేస్తామన్నారు. ఫుట్‌బాల్ టోర్నీ, రక్తదాన శిబిరం నిర్వహించడం అభినందనీయమన్నారు.
ఆలయాల అభివృద్ధికి కృషి..
ఆలయాల అభివృద్ధికి కట్టుబడి ఉంటూ ముందుకు సాగుతున్నామని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని నాగేంద్రనగర్ కాలనీలో శ్రీఅభయ వరద ఆంజనేయస్వామి ఆలయంలో శ్రీ విష్ణు నామ అఖండ పారాయణం నిర్వహించారు. కార్యక్రమానికి మంత్రి హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. పాతపాలమూరులోని గాంధీ చౌక్ వద్ద కమ్యూనిటీలో ఏర్పాటు చేసిన అయ్యప్పస్వాముల పడిపూజకు మంత్రి హాజరయ్యారు. ఆయా కార్యక్రమాల్లో మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సింహులు, మున్సిపల్ కమిషనర్ ప్రదీప్‌కుమార్, డీసీసీబీ వైస్ చైర్మన్ కొరమోని వెంకటయ్య, కౌన్సిలర్లు ఉమర్‌షేక్, రాము, నరేందర్, ఆనంద్‌గౌడ్, కో ఆప్షన్ సభ్యుడు రామలింగం, నాయకులు జూపల్లి భాస్కర్‌రావు, రామ్‌లక్ష్మణ్, జీఎల్ గౌడ్, బాలుర కళాశాల ప్రిన్సిపాల్ భగవంతాచారి, నాయకులు షఫీ, జూపల్లి భాస్కర్‌రావు, జహంగీర్, ముంజిమిల్, మోషిన్ అధికారులు పాల్గొన్నారు.