మరికల్ (ధన్వాడ), మార్చి 6 : విద్యార్ధులకు సులభంగా అర్థమయ్యేలా బోధనోపకరణాల(టీఎల్ఎం)తో బోధించాల ని విద్యాశాఖ కమిషనర్ దేవసేన సూ చించారు. ప్రతి విద్యార్థికీ ద్విత్వక్షరాలు, చతుర్విద ప్రక్రియలు నేర్పించాలని, రా యడంతోపాటు అక్షరాలను గుర్తించేలా తీర్చిదిద్దాలన్నారు. మండలంలోని తీలే రు ప్రాథమికోన్నత, మండలకేంద్రంలో ని ఉన్నత పాఠశాలను ఆమె సోమవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె విద్యార్థులతో మమేకమై మాట్లాడారు. సులభంగా అర్థం కావడానికి ఇంగ్లిష్, తె లుగులో పాఠ్యపుస్తకాలను ప్రభుత్వం ముద్రించిందన్నారు. టీఎల్ఎం సహాయంతో విద్యార్థుల సామర్థ్యాలను పరీక్షించి ప్రతిభ చూపిన వారికి చాక్లెట్లు పం చారు. బోధన బాగున్నా.. తరగతిగదు ల్లో అపరిశుభ్రతపై ఆమె అసంతృప్తి వ్య క్తం చేశారు.
మన ఊరు-మన బడిలో భాగంగా చేపట్టిన పనులను పరిశీలించా రు. అనంతరం కలెక్టర్ కోయ శ్రీహర్ష, అదనపు కలెక్టర్ మయాంక్మిట్టల్తో క లిసి తరగతిగదిలో విద్యార్థులతోపాటు కూర్చొని ఉపాధ్యాయుల బోధన తీరును పరిశీలించారు. తీలేరు పాఠశాలలో గదుల్లేక మూడు తరగతులు బయట నిర్వహించడంతో అదనపు గదులకు ప్రతిపాదనలు పంపాలని కలెక్టర్‌కు సూచించా రు. అనంతరం మండలకేంద్రంలోని బా లిక పాఠశాలలో పనులను పరిశీలించా రు. కార్యక్రమంలో కలెక్టర్ శ్రీహర్ష, అదనపు కలెక్టర్ మయాంక్‌మిట్టల్, సర్పంచులు రేవతమ్మ, గోవర్ధన్, మన ఊరు-మన బడి అధికారులు, డీఈవో లియాఖత్ అలీ తదితరులు పాల్గొన్నారు.
‘పేట’ బీసీ కానీలో..
నారాయణపేట రూరల్, మార్చి 6: పేట జిల్లాకేంద్రంలోని బీసీ కాలనీలో ప్రాథమిక పాఠశాలలో చేపట్టిన మన ఊరు- మనబడి పనులను కమిషనర్ దేవసేన, కలెక్టర్, అదనపు కలెక్టర్‌తో కలిసి సోమవారం పరిశీలించారు. తరగతిగదుల్లో విద్యార్థులతో మాట్లాడి వారి బోధనా సామర్థ్యాలను పరిశీలించారు. పాఠశాలకు వేసిన రంగులు సరిగ్గా లేకపోవడంతో పెయింటర్‌ను పిలిచి వెంటనే సరిచేయాలని సూచించారు. వారి వెంట డీఈవో లియాఖత్ అలీ, మున్సిపల్ కమిషనర్ సునీత, ఎంఈవో గోపాల్‌నాయక్, సెక్టోరియల్ అధికారులు శ్రీనివాస్ ఉన్నారు.