పౌరుల చేతిలో బ్రహ్మాస్త్రం
ఎన్నికల్లో జరిగే అ క్రమాలపై ఫిర్యాదు చేసేందు కు ఎన్నికల సంఘం రూపొం దించి న సీ-విజిల్ యాప్ పౌరుల చేతిలో బ్రహ్మా స్త్రం మారింది. ప్రస్తుతం ఈ యాప్ ఆధునీకరణతోపాటు ఫ్రేయింగ్ స్కౌడ్తో అనుసంధానం చేసింది.
- సీ-విజిల్ యాప్‌ను రూపొందించిన ఈసీ
- యాప్ ఆధునీకరణ ఫ్లయింగ్ స్కౌడ్కు అనుసంధానం
- ఎన్నికల్లో జరిగే అక్రమాలు, కోడ్ ఉల్లంఘనలపై ఫిర్యాదు
- నిమిషాల వ్యవధిలో ఫిర్యాదుదారుడికి సమాచారం
ఖిల్లాఘణపురం , అక్టోబర్ 12 : ఎన్నికల్లో జరిగే అ క్రమాలపై ఫిర్యాదు చేసేందు కు ఎన్నికల సంఘం రూపొం దించి న సీ-విజిల్ యాప్ పౌరుల చేతిలో బ్రహ్మా స్త్రం మారింది. ప్రస్తుతం ఈ యాప్ ఆధునీకరణతోపాటు ఫ్రేయింగ్ స్కౌడ్తో అనుసంధానం చేసింది. అక్రమాలకు సంబంధించిన ఫొటో యాప్‌లో అప్లోడ్ చేస్తే 100నిమిషాల వ్యవధిలో దర్యా ప్తు చేసిన ఫిర్యాదుదారుడికి సమాచారం తేలియజేస్తారు. ఈ సమాచారం జిల్లా ఎన్నికల అధికారితోపాటు నియోజక వర్గపరిధిలోని ఫ్రేయింగ్ స్కౌడ్కు చేరుతుంది. ఎవరైనా కోడ్‌ను ఉల్లంఘించినా, రాజకీయ పార్టీల అభ్యర్థులు, నాయకులు ఓటర్లను డబ్బు, మద్యం, బహుమతులు వంటివి ఇచ్చి ప్రలోభాలకు గురిచేసినా ఈ వివరాలను నేరుగా యాప్‌లో ఫిర్యాదు చేయవచ్చు. అలాగే ఎన్నికల ప్రచారంలో అనుమతులు లేకుండా లౌడ్ స్పీకర్ వాడడం, ఇతర నిబంధనలు ఉల్లఘించినా, కుల, మతాలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినా, ర్యాలీలు తీసినా ఈ యాప్ ద్వారా ఫిర్యాదు చేసే అవకాశం కల్పించారు. ఈ యాప్ ద్వారా ఫిర్యాదు అందిన తర్వాత 10నిమిషాలలో ఎన్నికల నిర్వహిస్తున్న అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని 100 నిమిషాల వ్యవధిలో దర్యాప్తు చేసి చర్యలు తీసుకుంటారు.
యాప్‌తో నేరుగా ఫిర్యాదు
స్మార్ట్ ఫోన్లలో సీ-విజిల్ యాప్ ద్వారా కేంద్ర ఎన్నికల సంఘానికి కోడ్ ఉల్లంఘనలపై నేరుగా ఫిర్యాదు చేయవచ్చు. స్మార్ట్ ఫోన్లలోని ప్లే స్టోర్‌లో సీ-విజిల్ యాప్‌ను డౌన్లొడ్ చేసుకోవచ్చు. అనంతరం భాషను ఎంపిక చేసుకొని టీక్ చేయమని సూచిస్తుంది. అనంతరం ఈ యాప్ మీ స్మార్ట్ ఫోన్లో స్క్రీన్‌పై దర్శన మిస్తుంది. అ తర్వాత సెల్‌ఫోన్ నెంబర్ ఎంటర్ చేయమని సూచిస్తుంది. సంబంధిత సెల్ నెంబర్‌కు కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ ఆఫ్ ఇండియా నుంచి ఎస్ఎంఎస్ ద్వారా 4 అంకెలతో కూడిన నెంబర్ వస్తుంది. ఈ నెంబర్‌ను సెల్ ఫోన్లలో ఎంటర్‌చేసిన అనంతరం వినియోగదారుడికి సంబంధించిన పూర్తి వివరాలు పొందుపర్చబడుతాయి. అనంతరం మీ ఫోన్లో యాప్ ఓపెన్ అవుతుంది. మీ పరిధిలోని కోడ్ ఉల్లంఘనపై ఫొటో లేదా వీడియోలు యాప్‌లో అప్లోడ్ చేస్తే ఫిర్యాదు అందిన తర్వాత 10నిమిషాల్లో ఎన్నికల అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని 100 నిమిషాల వ్యవధిలో దర్యాప్తు చేసి చర్యలు తీసుకుంటారు.
నిబంధనలు ఉల్లంఘిస్తే యాప్‌లో ఫిర్యాదు చేయవచ్చు
ఎన్నికల నియమ నిబం ధనలు ఏ రాజకీయ పార్టీ లు అయినా ఉల్లంఘిస్తే యాప్‌లో ఫిర్యాదు చేయవచ్చు. విషయం ఎన్నికల అధికారులకు సమా చారం అందిన 10 నిమిషాల్లో ఘటనా స్థలాని కి చేరుకొనే విధంగా మండల స్థాయి ప్లే యింగ్ అధికారులకు సమ చారం అందజేస్తారు. వారు ఘటనా స్థలానికి చేరుకొని 100 నిమిషాల వ్యవధిలో దర్యాప్తు చేసి చర్యలు తీసుకుంటారు.
-పాండు తాసీల్దార్, ఖిల్లాఘణపురం
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
- Tags
- cVIGIL
- EC
- Whistle app
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

