పెబ్బేరు, డిసెంబర్ 12 : బీఆర్ఎస్ ప్రభుత్వ హయాం లో మున్సిపాలిటీలో కోట్లాది రూపాయల తో చేపట్టిన అభివృద్ధి పనులను.. కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ దురుద్దేశంతో మధ్యలో నిలిపి వేయడాన్ని నిరసిస్తూ గురువా రం పార్టీ పిలుపు మేరకు ఉమ్మడి మండలం నుంచి వచ్చి న నాయకులు పెబ్బేరులో ధర్నాకు సిద్ధమయ్యారు. విష యం గ్రహించిన పోలీసులు ఆందోళనను అడ్డుకొనేం దుకు పెద్దఎత్తున బలగాలను మొహరించారు. ఈ నేపథ్యంలో మున్సిపల్ పాలకవర్గ సభ్యులతోపాటు, పెబ్బేరు, శ్రీరంగాపురం మండలాల నాయకులు రోడ్డుపై కూర్చొని ఆందోళనకు దిగగా పోలీసులు వారిని లేపేందుకు ప్రయ త్నం చేశారు. ఈ నేపథ్యంలో నాయకులు, పోలీసులకు వాగ్వాదం చోటు చేసుకున్నది. కొందరు నాయకులను పో లీసులు బలవంతంగా ఎత్తుకెళ్లి జీపులో పోలీస్‌స్టేషన్‌కు త రలించారు. పోలీసులు ఆందోళనను నిలవరించే ప్రయ త్నం చేయగా నాయకులు కొనసాగించేందుకు ప్రయత్నించారు. ఈ నేపథ్యంలో ఉద్రిక్తత నెలకొన్నది. అనంతరం అరెస్టు చేసిన నాయకులను విడిచిపెట్టాలని డిమాండ్ చేస్తూ పోలీస్‌స్టేషన్ వద్ద కూడా ధర్నాకు దిగారు. అనంత రం సొంత పూచీకత్తుపై పోలీసులు వారిని వదిలిపెట్టారు.
రాజకీయాల మధ్య ప్రజలు నష్టపోతున్నారు..
పెబ్బేరు మున్సిపాలిటీలో నిధులు పుష్కలంగా ఉండి.. టెండర్లు, అగ్రిమెంట్లు అయిన పనులను కాంగ్రెస్ నాయకులు ఉద్దేశ పూర్వకంగా అడ్డుకుంటున్నారని మున్సిపల్ చైర్పర్సన్ కరుణశ్రీ, వైస్‌చైర్మన్ కర్రెస్వామి ఆరోపించారు. ఆ పనులు పూర్తి చేస్తే బీఆర్ఎస్ పాలకవర్గానికి మంచి పేరు వస్తుందన్న దురుద్దేశంతో ముందుకు సాగనీయడం లేదన్నారు. దీంతో గతుకుల రోడ్లతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారని, రాజకీయాల మధ్య అమాయకులు నలిగిపోతున్నారని వాపోయారు. ఈ విషయంలో ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేసినా తమ పలుకుబడితో వారిని ప్రభావితం చేస్తూ పనులు జరగనివ్వడం లేదని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పనులు పూర్తి చేసే వరకు వివిధ రూపాల్లో ఆందోళనలు కొనసాగిస్తూనే ఉంటామని నాయకులు హెచ్చరించారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు ఎల్లారెడ్డి, గోపిబాబు, పార్వతి, సుమ తి, మండల బీఆర్ఎస్ అధ్యక్షుడు రాములు, పట్టణ అధ్యక్షుడు దిలీప్‌రెడ్డి, శ్రీరంగాపురం సింగిల్ విండో అధ్యక్షుడు జగన్నాథం, మండల పార్టీ అధ్యక్షడు వెంకటస్వామి, నాయకులు వెంకటేశ్, సాయినాథ్, రమేశ్, శంకర్, విశ్వరూపం, మధు, మజీద్, పృథ్వీరాజు, సత్యం, రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు.