Kollapur : కొల్లాపూర్ నియోజవర్గంలోని అన్ని గ్రామాల బీఆర్ఎస్ (BRS) పార్టీ నాయకులు, కార్యకర్తలకు దూరెడ్డి రఘువర్ధన్ రెడ్డి (Dureddy Raghuvardhan Reddy) ముఖ్య సూచన చేశారు. నూతనంగా ఏర్పాటు చేసిన గ్రామపంచాయతీలలో గురువారం ప్రదర్శించిన ఓటర్ లిస్టు (Voters List)లో ఏవైనా పొరపాట్లు ఉంటే వెంటనే సరి చేసుకోవాలని ఆయన కోరారు. అధికార పార్టీ వాళ్లు బీఆర్ఎస్ పార్టీ అభిమానుల ఓట్లను కొల్లగొట్టే ప్రమాదం ఉందని.. బీఆర్ఎస్ కార్యకర్తలు జాగ్రత్త వహించగలరని దూరెడ్డి పేర్కొన్నారు. పేరులోలోగానీ, ఇంటి పేరులోగానీ, ఆధార్ కార్డులోగానీ ఏదైనా పొరపాటు ఉన్నా..
ఇంటి అడ్రస్ లో ఏదైనా పొరపాటు ఉన్నా స్థానిక బూత్ లెవెల్ అధికారి (BLO)ని సంప్రదించి.. తప్పులను సరి చేసుకోవాలని దూరెడ్డి రఘువర్ధన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. అలాగే ఓటు హక్కు కలిగి ఉండి లిస్టులో పేరు లేనివారు, గ్రామం పేరు తప్పు పడిన వాళ్లు, ఒకే కుటుంబానికి చెందినవారి పేర్లు వేరే వేరే వార్డులలో నమోదైనా గ్రామ పంచాయతీ కార్యదర్శులు సంప్రదించాలని ఆయన సూచించారు. కొత్తగా ఓటు హక్కు కోసం నమోదు చేసుకునేవారు మీ- సేవలో అప్లై చేసి, ఆ ఫారాన్ని ఎమ్మార్వోకు ఇవ్వాలని వెల్లడించారు దూరెడ్డి.