రేపటి నుంచే డీఎస్సీ.. ఆగస్టు 5 వరకు పరీక్షలు
ఉపాధ్యాయ నియామకాల కో సం నిర్వహించే డీఎస్సీ-2024 పరీక్షకు జిల్లా జిల్లా యం త్రాగం, విద్యాశాఖ పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2017 జూలైలో మొదటి డీ ఎస్సీ నిర్వహించారు. తర్వాత ఏడేండ్లకు నిర్వహిస్తున్న రెండో పరీక్ష ఇది.
పాలమూరు, జూలై 16 : ఉపాధ్యాయ నియామకాల కో సం నిర్వహించే డీఎస్సీ-2024 పరీక్షకు జిల్లా జిల్లా యంత్రాగం, విద్యాశాఖ పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2017 జూలైలో మొదటి డీ ఎస్సీ నిర్వహించారు. తర్వాత ఏడేండ్లకు నిర్వహిస్తున్న రెండో పరీక్ష ఇది. ఈ నెల 18నుంచి ఆగస్టు 5 వరకు మొత్తం 13 రోజులపాటు నిర్వహించే పరీక్షకు ఉమ్మడి జిల్లా నుంచి 11,500 మందికి పైగా అభ్యర్థులు హాజరు కానున్నారు. వీరి కోసం 2 కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొదటిసారి ఆన్లైన్ విధానంలో పరీక్షలు జరగనున్నాయి.
ప్రతి రోజూ రెండు విడుతలుగా నిర్వహించే ఈ పరీక్షలు మొదటి విడుత ఉదయం 9 నుంచి 11:30 గంటల వరకు, రెండో విడుత మధ్యాహ్నం 2నుంచి సాయంత్రం 4:30 వరకు ఉంటుం ది. పీఈటీ, ఫిజికల్ ఎడ్యుకేషన్ వారికి ఉదయం 9నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 2నుంచి 5 గంటల వరకు, దివ్యాంగులైన అభ్యర్థులకు (సదరం సర్టిఫికెట్ ఉన్న వారికి) అదనపు సమయం కేటాయిస్తారు. పరిశీలకులుగా సమగ్ర శిక్ష కో ఆర్డినేటర్లు, సీనియర్ హెచ్ఎంలను నియమించారు. మహబూబ్నగర్ గ్రామీణ మండలం ధర్మాపూర్ సమీపంలోని జేపీఎన్సీఈ కళాశాల, మహబూబ్నగర్ పట్టణం క్రిస్టియన్పల్లిలోని ఫాతిమా విద్యాలయంలో కేంద్రాలు ఏర్పా టు చేశారు. గతంలో ఆన్లైన్ పరీక్షలు నిర్వహించిన చాలా సందర్భాల్లో కేంద్రాల వద్ద తాగునీటి సౌకర్యం, నిల్చునేందుకు గుడారాలు ఏర్పాటు చేయలేదు. ఈ పరీక్షలకు కనీస సౌకర్యాలు కల్పించాల్సిన అవసరం ఉన్నది.
అభ్యర్థులు పాటించాల్సిన నియమాలు..
పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు రెండు గంటల ముందే కేంద్రాలకు చేరుకోవాలి. నిర్ణీత సమయానికి గంటన్నర ముందు నుంచే కేంద్రాల్లోకి లోపలికి అనుమతిస్తారు. పరీక్ష నిర్ధేశిత సమయానికంటే పది నిమిషాల ముందే గేట్లు మూసివేస్తారు. అభ్యర్థులు తప్పనిసరిగా హాల్ టికెట్, ప్రభు త్వ గుర్తింపు కార్డు, బాల్ పాయింట్ పెన్ను వెంట తెచ్చుకోవాలి. గడియారాలు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించరు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
US Diwali: అమెరికాలో దీపావళి వేడుకల్ని అడ్డుకున్న అతివాదులు.. వీడియో
TTD Darshan News | తిరుమలలో కొనసాగుతున భక్తుల రద్దీ. శ్రీవారి దర్శనానికి 15 గంటల సమయం
Family suicide | గచ్చిబౌలిలోని ఇంట్లో నుంచి దుర్వాసన.. పోలీసులు వచ్చి చూడగా..
Parkinson’s Disease | పార్కిన్సన్స్ వ్యాధి చికిత్సలో కీలక ముందడుగు.. మూలకణాలతో మెరుగైన ఫలితాలు..
Tirumala | శ్రీవారి ఆలయంలో వైభవంగా దీపావళి ఆస్థానం
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

