కేటీదొడ్డి, సెప్టెంబర్ 9 : కేటీదొడ్డి మండలంలోని కొం డాపురం గ్రామంలో తాగునీటి ఎద్దడి తీవ్రంగా ఉందని గ్రామస్తులు వాపోతున్నారు. గ్రామంలో వారం రోజులు గా ఇదే పరిస్థితి ఏర్పడిందన్నారు. మిషన్ భగీరథ ద్వా రా గ్రామానికి తాగునీటిని అందించేవారు. అయితే కొన్ని వార్డులకు సరఫరా కాకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ఆయా వార్డుల ప్రజలు తాగునీటి కోసం వ్యవసాయ బోర్లను ఆశ్రయించి నీటిని తెచ్చుకోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సమస్యను పరిష్కరించాలని పలుమార్లు అధికారులను కోరుతున్నా పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి గ్రామంలో తాగునీటి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరారు.