దేవరకద్రరూరల్(చిన్నచింతకుంట)/దేవరకద్ర, అక్టోబర్ 27 : తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ పేదల కోసం అనేక సంక్షేమ పథకాలు రూపొందించి ప్రతి ఇంటికీ ఏదో ఒక సంక్షేమ ఫలం అందజేస్తున్నట్లు జెడ్పీ చైర్పర్సన్ స్వర్ణాసుధాకర్‌రెడ్డి పేర్కొన్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా శుక్రవారం చిన్నచింతకుంట మండలం గూడూరులో బీఆర్ఎస్ పార్టీ మ్యానిఫెస్టోను ప్రజలకు వివరిస్తూ, కారు గుర్తుకు ఓటు వేసి ఆల వెంకటేశ్వర్‌రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని బీఆర్ఎస్ కార్యకర్తలతో కలిసి ఇంటింటి ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మా ట్లాడుతూ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి దేవరకద్ర నియోజకవర్గాన్ని సస్యశ్యామలంగా మార్చేందుకు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు సాధించారని, ప్రభుత్వ సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించారు. అదేవిధంగా సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, బీఆర్ఎస్ పార్టీ మ్యానిఫెస్టోపై బీఆర్ఎస్ పార్టీ నాయకులు శుక్రవారం దేవరకద్ర మండల కేంద్రంతోపాటు మండలంలోని ఆయా గ్రామంలోని గడపగడపకు వెళ్లి ముమ్మరంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా శుక్రవారం మండల కేంద్రంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ వెంకటేశ్, మండలాధ్యక్షుడు నర్సింహారెడ్డి ఆధ్వర్యంలో ప్రచారం చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ హర్షవర్ధన్‌రెడ్డి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కోట రాము, సర్పం చ్ కాంతారావు, పీఏసీసీఎస్ అధ్యక్షుడు సురేందర్‌రెడ్డి, మార్కెట్ కమిటీ వైస్‌చైర్మన్ దశరథ్‌రెడ్డి, రైతుబంధు సమితి సభ్యులు కరుణాకర్‌రె డ్డి, మన్నెంగౌడ్, అజయ్‌కుమార్‌రెడ్డి, డాక్టర్ సు రేందర్‌రెడ్డి, పట్టణాధ్యక్షుడు బాలరాజు, నాయకు లు వజీఆర్బాబు, యాకోబ్, మహిపాల్, సత్యంసాగర్, రాధాకృష్ణ, యుగేందర్‌రెడ్డి, చాల్మారెడ్డి, సయ్యద్ జక్కి, ఎండీ మజరోద్దీన్, బైండ్ల రాములు, బాలరాజు, ఆంజనేయులు పాల్గొన్నారు.
కొత్తకోట, అక్టోబర్ 27 : మండలంలోని నాచారంపేటతండాలో హజ్రత్ అలీ దర్గాలో శుక్రవా రం ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి సతీమణి అల మంజుల ప్రత్యేక పూజలు చేశారు. దర్గాలోని చాదర్, పూలమాల వేసి ఆమె మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం జయరాంతండా, వట్లంపొడితండా, విలియంకొండ తండా, నాటవెల్లి పెద్దతండాలో ఎన్నికల మ్యానిఫెస్టోపై ఆమె గిరిజనులకు వివరించారు. రాబోయే కాలంలో బీఆర్ఎస్ పార్టీ హ్యట్రిక్ విజయం సాధిస్తుందని పేర్కొన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డికి ఓటు వేసి గెలిపించాలన్నారు. కొత్తకోట పట్టణంలోని 1 నుంచి 15వ వార్డు వరకు కౌన్సిలర్లు విస్తృత ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపీపీ గుంతమౌనిక, మున్సిపల్ చైర్పర్సన్ సుకేశిని, వైస్ చైర్పర్సన్ జయమ్మ, మాజీ జెడ్పీటీసీ విశ్వేశ్వర్, సర్పంచులు చంద్రకళ, లావణ్య, దేవి, నారమ్మ, కౌన్సిలర్లు సంధ్య, పద్మ, కొండారెడ్డి, తిరుపతయ్య, రామ్మోహన్‌రెడ్డి, ఖాజమైనుద్దీన్, నాగన్నసాగర్, కోఆప్షన్ సభ్యులు మిసేక్, వహీద్, అల్లాభాష, గోపాల్‌నాయక్, లక్ష్మణ్‌నాయక్, శ్రీనుజీ, మహేశ్, రవి పాల్గొన్నారు.
మదనాపురం, అక్టోబర్ 27 : దేవరకద్ర నియోజకవర్గంలో అభివృద్ధే మంత్రంగా పనిచేస్తున్న ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డికి హ్యాట్రిక్ విజయం పక్కా సాధిస్తాడని బీఆర్ఎస్ పార్టీ మండలాధ్యక్షుడు యాదగిరి అన్నారు. శుక్రవారం మండలంలోని దుప్పల్లిలో ఇంటింటికీ తిరిగి కారుగుర్తుపై ఓటు వేయాలని ప్రచారం చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ శివశింకర్, ఉప సర్పంచ్ మణివర్ధన్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ వెంకట్‌నారాయణ, పార్టీ మాజీ మండలాధ్యక్షుడు రాము లు, గ్రామాధ్యక్షుడు ప్రవీణ్‌చారి, మాజీ ఎంపీటీసీ నాగన్నయాదవ్, ఆంజనేయులు పాల్గొన్నారు.
మూసాపేట, అక్టోబర్ 27 : మండలంలోని వేముల తదితర గ్రామాల్లో శుక్రవారం బీఆర్ఎస్ నాయకులు ఇంటింటి ప్రచారం చేశారు. ఇంటింటికి వెళ్లి ప్రజలను కలుస్తూ బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలను వివరించారు. కారు గుర్తుకు ఓటు వేసి అభివృద్ధిలో భాగస్వాములు కావాలని కోరారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ ఇంద్రయ్యసాగర్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు లక్ష్మీనర్సింహ యాదవ్, సర్పంచ్ అరుణరఘుపతిరెడ్డి పాల్గొన్నారు.
భూత్పూర్, అక్టోబర్ 27 : బీఆర్ఎస్ పార్టీ గెలుపు కోసం ప్రతి కార్యకర్త కృషి చేయాలని మున్సిపల్ చైర్మన్ సత్తూర్ బస్వరాజ్‌గౌడ్ అన్నారు. శుక్రవారం మున్సిపాలిటీలోని 10వ వార్డులో ప్రచారం చేస్తూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ రాష్ట్ర ప్రజల కోసం ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేశారు. ముఖ్యంగా రైతుబంధు, కల్యాణలక్ష్మి, రైతుబీమా, 24గంటల ఉచిత కరెంట్, పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను రన్నింగ్‌లోకి తీసుకురావడం, అదేవిధంగా కరివెన ప్రాజెక్టును మంజూరు చేసి, పనులను పూర్తి చేయడం ఎంతో గొప్ప విషయమన్నారు. ఎమ్మెల్యేగా ఆల వెంకటేశ్వర్‌రెడ్డిని మూడో సారి గెలిపించాలని కార్యకర్తలంతా కలిసి కట్టుగా పని చేయాలని కోరారు. కొత్తమొల్గరలో, మద్దిగట్ల, అన్నాసాగర్, పోతులమడుగు, హస్నాపూర్, తాటికొండ, వెల్కిచర్ల, అమిస్తాపూర్ గ్రామాల్లో బీఆర్ఎస్ నాయకులు ప్రచారం చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ కదిరె శేఖర్‌రెడ్డి, రైతుబంధు సమితి మండలాధ్యక్షుడు నర్సింహాగౌడ్, ముడా డైరెక్టర్ చంద్రశేఖర్‌గౌడ్, మాజీ సర్పంచులు సత్తూర్ నారాయణగౌడ్, సత్యనారాయణ, నాయకులు సత్యనారాయణ, ఆల శశివర్ధన్‌రెడ్డి, బాలస్వామి, అశోక్‌గౌడ్, రాములు, సురేశ్‌గౌడ్, శ్రీకాంత్‌రెడ్డి, ప్రేమ్‌కుమార్ పాల్గొన్నారు.
మూసాపేట(అడ్డాకుల), అక్టోబ ర్ 27 : బీఆర్ఎస్ పాలనలో ఎమ్మె ల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి చేసిన అభివృద్ధిపై ఆయన వ్యక్తిగత మనస్తత్వ ంపై రాచాల గ్రామానికి చెందిన అరవింద్ సొంతంగా రాసిన పాట, పా డిన విధానం అందరిని ఆకట్టుకున్న ది. అడ్డాకుల మండలం చారాల గ్రామంలో శుక్రవారం నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో అరవింద్ పాడిన పాట ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డితోపాటు అక్కడున్న అందరిని ఆకట్టుకున్నది. అందుకు ఎమ్మెల్యే ఆల, జెడ్పీటీసీ నల్లమద్ది రాజశేఖర్‌రెడ్డి, ఎంపీపీ నాగార్జునరెడ్డి ఆ యువకుడిని ప్రత్యేకంగా అభినందించారు.