కొల్లాపూర్, డిసెంబర్ 30 : సమస్యల పరిష్కారం కోసం తమ వద్దకు వచ్చే సామాన్యుల ను ఇబ్బంది పెడితే ఉపేక్షించేది లేదని ఎక్సైజ్, పర్యాటక శాఖల మంత్రి జూపల్లి కృష్ణారావు అ ధికారులను హెచ్చరించారు. శనివారం కొల్లాపూర్‌లోని ఆరో వార్డు కౌన్సిలర్ రమణ సమక్షంలో ప్రజాపాలన నిర్వహించారు. అక్కడ ఉన్న ప్ర జలతో మాట్లాడారు. తనకు ఉన్న సమస్యలను పరిష్కరించాలని రెవెన్యూ అధికారుల వద్దకు వెళ్తే లంచం డిమాండ్ చేశారని, ఇప్పటికే కొన్ని డబ్బులు కూడా ముట్టజెప్పానని ఓ మహిళ మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసి ఆధారాలు సమరిస్తే విచారణ జరిపి అధికారులపై చర్యలు తీసుకుంటామని మంత్రి చెప్పారు. అలాగే సిలిండర్లు, భూమార్పిడి కోసం డబ్బులు వసూలు చేస్తున్నారని మంత్రికి చెప్పగా.. గ్యాస్ అధికారులతో ఫోన్లో మాట్లాడారు. తాసీల్దార్ శ్రీకాంత్‌పై ఆగ్రహం వ్యక్తంచేశారు. ఎంతో నమ్మకంతో ప్రజలు కాం గ్రెస్‌ను గెలిపించారని, వారి నమ్మకాన్ని వమ్ముచేయకుండా ప్రజాపాలన ఉంటుందన్నారు. అభయహస్తం దరఖాస్తుల కోసం ఎవరైనా డ బ్బుల వసూలుకు పాల్పడితే ఉపేక్షించేదిలేదని దళారులను హెచ్చరించారు. కొల్లాపూర్ మున్సిపాలిటీలో జనవరి 15వ తేదీ వరకు ప్రజల ఇం డ్లల్లో సిలిండర్ ఉండాలని, లేకపోతే వచ్చే ఎన్నికల్లో ఎవరికీ టికెట్ ఇవ్వబోమని కాంగ్రెస్ కౌన్సిలర్లకు, ఆశావహులకు సూచించారు. అంతకు ముందు మంత్రి జూపల్లిని మున్సిపల్ కమిషనర్ రాజయ్య, కౌన్సిలర్ రమ్య స్వాగతం పలికారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకుడు శ్రీనివాస్‌రెడ్డి, ఆర్డీవో నాగరాజు, ఎంపీపీ భోజ్యానాయక్, కౌన్సిలర్లు శ్రీదేవిగౌతంగౌడ్, నరసింహారావు, నహీం, నాయకులు పాల్గొన్నారు.
దరఖాస్తు చేసుకోవాలి..
కాంగ్రెస్ ప్ర భుత్వం అందిస్తున్న గ్యారెంటీలకు దరఖాస్తులు చేసుకొని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. మండలంలోని దేవునితిరుమలాపూర్లో నిర్వహించిన ప్రజాపాలనలో పాల్గొని మాట్లాడారు. సీఎం రేవంత్‌రెడ్డి పేదల సంక్షేమం కోసం గ్యారెంటీలను ప్రవేశపెట్టారన్నారు. అనంతరం కల్వకోల్‌లో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో ఎంపీపీ ప్రతాప్ గౌడ్, జెడ్పీటీసీ గౌరమ్మ, సర్పంచులు సత్యం, వెంకటేశ్వర్‌రెడ్డి మాజీ ఎంపీటీసీ నరసింహ, సీపీఐ జిల్లా నాయకులు యేసయ్య పాల్గొన్నారు.