కొత్తకోట : పట్టణంలో నిర్మిస్తున్న శ్రీ హరిహర పుత్ర ధర్మశాస్త్ర అయ్యప్ప క్షేత్రం ఆలయ (Ayyappa Temple ) నిర్మాణానికి దేవరకద్ర పట్టణానికి చెందిన అయ్యప్ప భక్తులు గురుస్వామి కరణం లక్ష్మీకాంత రావు ( Laxmikantha rao) అలియాస్ కరణం రాజు గురుస్వామి దంపతులు విరాళం ( Donation ) అందజేశారు. ఆలయ నిర్మాణం లో భాగంగా గర్భాలయ పిల్లర్ దాతగా రూ. 2,51,116ను విరాళాన్ని ప్రకటించి అయ్యప్ప సేవాసమితి సభ్యులకు అందజేశారు . ఈ సందర్భంగా అయ్యప్ప సేవాసమితి సభ్యులు జోషి గోపాలకృష్ణ గురుస్వామి , ధూపం నాగరాజు , బలిజ లింగేశ్వర్ , పొగాకు అనీల్ కుమార్ , లక్ష్మీ నారాయణ యాదవ్ దాతకు ధన్యవాదాలు తెలిపారు .