
చారకొండ, డిసెంబర్ 17: కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రతిఒక్కరూ వ్యాక్సిన్ వేసుకోవాలని ఎంపీడీవో జయసుధ పేర్కొన్నారు. శుక్రవారం మండలంలోని తిమ్మాయిపల్లిలో వ్యాక్సినేషన్ కేంద్రాన్ని పరిశీలించి మాట్లాడారు. గ్రామాలో అర్హులు వ్యాక్సిన్ తీసుకోవాలని, మొదటి డోస్ తీసుకున్న వారు రెండో డోస్ తప్పకుండా తీసుకోవాలని చెప్పారు. ప్రతిఒక్కరూ మాస్కు ధరించి, భౌతికదూరం పాటించాలన్నారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి కృష్ణయ్య, ఏఎన్ఎంలు, ఆశకార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
ప్రతిఒక్కరూ టీకా వేసుకోవాలి
అర్హులైన ప్రతిఒక్కరూ కరోనా నివారణ వ్యాక్సిన్ వేసుకోవాలని డాక్టర్ శ్రీకాంత్ పేర్కొన్నారు. శుక్రవారం మండలంలోని ఆయా గ్రామాల్లో ఇంటింటికీ తిరుగుతూ కరోనా నివారణపై తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. 18ఏండ్లు నిండిన ప్రతిఒక్కరికీ టీకా వేయనున్నట్లు తెలిపారు. మొదటి డోస్ వేసుకున్న వారు రెండో డోస్, అసలే వేసుకోని వారు మొదటి డోస్ వేసుకోవాలన్నారు. ఒమిక్రాన్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ప్రతిఒక్కరూ శుభ్రత పాటించాలన్నారు. కార్యక్రమంలో శ్రీనివాసులు, యాదగిరి, ఆంజనేయులు, గోవర్ధన్ తదితరులు ఉన్నారు.
450మందికి వ్యాక్సినేషన్
మండలంలోని ఆరు ప్రాథమిక ఆరోగ్య మినీ కేంద్రాల పరిధిలో శుక్రవారం మొత్తం 450మందికి టీకా వేసినట్లు సీహెచ్‌వో సుధాకర్ తెలిపారు. 57మందికి మొదటి డోస్ వ్యాక్సినేషన్ కాగా 393మందికి రెండో డోస్ టీకా వేసినట్లు పేర్కొన్నారు. మండల కేంద్రంతోపాటు రంగాపూర్, కొండారెడ్డిపల్లి, గాజర, మిట్టసదగోడు, పోతారెడ్డిపల్లిలో వ్యాక్సినేషన్ వైద్యసిబ్బంది నిర్వహించారు. కార్యక్రమంలో ఏఎన్ఎంలు, అంగన్వాడీ టీచర్స్, ఆశవర్కర్లు తదితరులు పాల్గొన్నారు.
తాడూరు మండలంలో..
మండలకేంద్రంలోని సబ్ సెంటర్లో 48మందికి రెండో డోస్, ఇద్దరికి ఫస్ట డోస్ టీకా వేసినట్లు డాక్టర్ సుబ్బారెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో కొంతమంది టీకా వేసుకునేందుకు భయాందోళన చెందుతున్నారని, వారి ఇంటికెళ్లి వ్యాక్సిన్‌పై అవగాహన కల్పించాలన్నారు. సర్పంచులు, ఎంపీటీసీలు గ్రామాల్లో అవగాహన కల్పించి వందశాతం వ్యాక్సినేషన్ సహకరించాలన్నారు. కార్యక్రమంలో ఏఎన్ఎం కృష్ణకుమారి, ఆశవర్కర్లు సునీత, బాలమణి, సుమతి, శశికళ, జ్యోతి తదితరులు పాల్గొన్నారు.
తిమ్మాజిపేట మండలంలో..
మండలంలో వ్యాక్సినేషన్ స్పెషల్‌డ్రైవ్ కొనసాగుతున్నది. మండలంలోని ఏడు ఆరోగ్య ఉపకేంద్రాల్లో రెండో డోస్ టీకాలు వేస్తున్నారు. శుక్రవారం మండలంలో 620మందికి వ్యాక్సిన్ వేసినట్లు సూపర్వైజర్ గౌస్ తెలిపారు. టీకాలు వేసుకోనివారు తమ గ్రామాల్లో, ఆరోగ్య ఉపకేంద్రాల్లో టీకాలు వేసుకోవాలని కోరారు.