
మహబూబ్‌నగర్, డిసెంబర్ 6 : కొవిడ్ వ్యాక్సిన్‌తో ప్రా ణానికి రక్షణ ఉంటుందని, ప్రతిఒక్కరూ వ్యాక్సిన్ వేసుకోవాలని కలెక్టర్ ఎస్.వెంకట్రావు అన్నారు. సోమవారం కలెక్టరేట్లోని రెవెన్యూ సమావేశ మందిరం నుంచి మండల అధికారులతో వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భం గా మాట్లాడుతూ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వారీగా వ్యాక్సినేషన్ ప్రక్రియను పూర్తిస్థాయిలో పరిశీలించాలని సూచించారు. అలాగే గ్రామాలవారీగా సూక్ష్మప్రణాళిక తయారు చేయాలని, మొబిలైజేషన్, వ్యాక్సినేషన్ బృందాలను నియమించాలని తెలిపారు. వ్యాక్సినేషన్ వందశాతం పూర్తి చేయడమే లక్ష్యంగా పని చేయాలన్నారు. అలాగే నర్సరీలపై ప్రత్యే క దృష్టి కేంద్రీకరించాలని ఎంపీడీవోలకు తెలిపారు. అనంతరం ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. మొత్తం 67 ఫిర్యాదులు అందినట్లు కలెక్టర్ తెలిపారు. కాగా, కలెక్టర్ స్వయంగా ప్రజల వద్దకు వెళ్లి ఫిర్యాదులు స్వీకరించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ సీతారామారావు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
రెండు డోసులు వేసుకోవాలి
అర్హులైన ప్రతిఒక్కరూ రెండు డోసుల కరోనా టీకా వేసుకోవాలని జిల్లా పరిషత్ డిప్యూటీ సీఈవో మొగులప్ప కోరారు. సోమవారం మండలంలోని గంగాపూర్‌లో వ్యాక్సినేషన్ సెంటర్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అన్ని గ్రామాల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేసినట్లు తెలిపారు. వైద్యసిబ్బంది ఇంటింటికెళ్లి వ్యాక్సిన్ వేయాలని సూచించారు. కాగా, గంగాపూర్ పీహెచ్సీ పరిధిలో ఇప్పటివరకు 34వేల మందికి వ్యా క్సిన్ వేసినట్లు మెడికల్ ఆఫీసర్ రాహుల్ తెలిపారు. అలాగే జడ్చర్ల మున్సిపాలిటీలో ఫస్ట్‌డోస్ 43వేలమందికి, సెకండ్ డోస్ 24వేలమందికి వేసినట్లు అర్బన్ హెల్త్‌సెంటర్ డాక్టర్ శివకాంత్ తెలిపారు.
వందశాతం పూర్తి చేయాలి
మున్సిపాలిటీలోని అన్ని వార్డుల్లో కొవిడ్ వ్యాక్సినేషన్‌ను వందశాతం పూర్తి చేయాలని మున్సిపల్ కమిషనర్ ప్రదీప్‌కుమార్ అన్నారు. సోమవారం 25వ వార్డులో వ్యాక్సినేషన్ ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వైద్య, మున్సిపల్ సిబ్బంది ప్రతి ఇంటికీ వెళ్లి కొవిడ్ వ్యాక్సిన్ వేస్తున్నట్లు తెలిపారు. మున్సిపాలిటీలో వందశాతం పూర్తి చేసేందుకు ప్రజలు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో డాక్టర్ రఫీక్ తదితరులు పాల్గొన్నారు.
వ్యాక్సిన్‌పై నిర్లక్ష్యం వద్దు
ఒమిక్రాన్ నేపథ్యంలో కొవిడ్ వ్యాక్సిన్‌పై నిర్లక్ష్యం చేయొద్దని జడ్చర్ల అర్బన్ హెల్త్‌సెంటర్ డాక్టర్ శివకాంత్ తెలిపారు. కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రత్యేక డ్రై వ్‌లో భాగంగా సోమవారం అర్బన్ హెల్త్‌సెంటర్‌లో వ్యాక్సినేషన్ కొనసాగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ కొత్త వేరి యంట్ దృష్ట్యా ప్రజలందరూ త్వరితగతిన రెండో డోస్ వ్యా క్సిన్ వేసుకోవాలని కోరారు. కొవిడ్ వ్యాక్సిన్ వేసేందుకు ము న్సిపాలిటీలోని అన్ని వార్డుల్లో వ్యాక్సినేషన్ సెంటర్లను ఏర్పా టు చేసినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆర్బీఎస్కే వైద్యాధికారి సునీల్, ఫ్లోరోసిస్ అధికారి కుమినీదేవి పాల్గొన్నారు.