ఆకాశం కాంతులతో ప్రజ్వరిల్లింది. దీపాలు కాంతులీనుతుండగా.. చెడుపై మంచి సాధించిన విజయానికి నిదర్శనంగా దీపావళి ధూంధాంగా జరిగింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వెలుగు దివ్వెల పండుగను ఘనంగా జరుపుకొన్నారు. నోములు, వ్రతాలను భక్తులు ఆచరించారు.
ఆలయాలకు వెళ్లి ప్రత్యేక పూజలు చేశారు.ఇండ్ల లోగిళ్లు దీపకాంతులతో కళకళ లాడాయి. సాయంత్రం వేళ పటాకుల మోత హోరెత్తింది. చిన్నా పెద్ద తేడా లేకుండా కేరింతలతో పండుగను ఉత్సాహంగా నిర్వహించారు. వివిధ రకాల క్రాకర్స్‌ను కాల్చి సంబురాలు చేయగా.. కుటుంబ సభ్యులు, బంధువులతో కలిసి నిర్వహించిన వేడుక అంబరాన్నంటింది.
– నెట్వర్క్ మహబూబ్‌నగర్, నవంబర్ 1