మహబూబ్‌నగర్‌టౌన్, డిసెంబర్ 7 : చదువుతోనే బంగారు భవిష్యత్తు ఉంటుందని, విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకొని ఉన్నతంగా రాణించాలని మైనార్టీ సంక్షేమశాఖ జిల్లా అధికారి శంకరాచారి అన్నారు. ఒడిశా రాష్ట్రంలోని సెంచురీయన్ యూనివర్సిటీలో 10నుంచి 22వ తేదీవరకు నిర్వహించనున్న ఆన్‌జాబ్ ట్రైనింగ్‌కు జిల్లా కేద్రంలోని మైనార్టీ బాలుర-3 ఒకేషనల్ జూనియర్ కళాశాల విద్యార్థులు ఎంపికయ్యారు.
ఈ సందర్భంగా బుధవారం కళాశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి హాజరై విద్యార్థులను అభినందించారు. అ నంతరం మాట్లాడుతూ సాంకేతిక విద్యతో ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని, విద్యార్థులు సాంకేతిక విద్యలో రాణించాలని సూచించారు. ఒడిశాలో ఇవ్వనున్న శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని తెలిపా రు. కార్యక్రమంలో ఆర్ఎల్సీ ఖాజా జమీల్ అహ్మద్, జమీర్‌ఖాన్, అబ్దుల్ సలీం, ప్రిన్సిపాల్ మహ్మద్సమీ పాల్గొన్నారు.