కాంగ్రెస్ ప్రభుత్వం రైతు వ్యతిరేక చర్యలకు పాల్పడడంపై బీఆర్ఎస్ భగ్గుమన్నది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు క్వింటా ధాన్యం కొనుగోలుపై రూ.500 బోనస్ చెల్లిస్తామని ప్రకటించి.. ఇప్పుడేమో కేవలం సన్న వడ్లకే ఇస్తామని.. దొడ్డు వడ్లకు కాదని సీఎం రేవంత్‌రెడ్డి మాట మార్చడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. గురువారం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా రైతులకు మద్దతుగా పార్టీ నాయకులు, కార్యకర్తలు నిరసనలతో హోరెత్తించారు.
మక్తల్‌లో మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి, వనపర్తిలో గులాబీ పార్టీ జిల్లా అధ్యక్షుడు గట్టు యాదవ్ ఆధ్వర్యంలో పార్టీ నాయకులు ధర్నా చేపట్టారు. మహబూబ్‌నగర్‌లోని తెలంగాణ చౌరస్తాలో నల్ల కండువాలు కప్పుకొని నాయకులు నిరసన తెలిపారు. కొల్లాపూర్, పెబ్బేరు, గద్వాల, దేవరకద్రలోనూ ధర్నా చేపట్టి.. సీఎం రేవంత్‌రెడ్డి రైతులపై మరోసారి విషం కక్కడంతో కన్నెర్ర చేశారు. కర్షకులకు బోనస్ చెల్లించాలని డిమాండ్ చేశారు. రైతుల సంక్షేమాన్ని విస్మరిస్తే గుణపాఠం తప్పదని హెచ్చరించారు.
– మహబూబ్‌నగర్, మే 16 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
మహబూబ్‌నగర్ అర్బన్, మే 16 : కష్టపడి పం డించిన పంటకు మద్దతు ధర కల్పించకపోవడం తో ధాన్యం మార్కెట్ యార్డ్కే పరిమితమైందని, అ కాల వర్షంతో ధాన్యం మొలకెత్తి పాడైపోయినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని జిల్లా గ్రంథాల య సంస్థ మాజీ చైర్మన్ రాజేశ్వర్‌గౌడ్ అన్నారు. అన్ని రకాల ధాన్యానికి బోనస్ చెల్లించాలని డిమాండ్ చే స్తూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పిలుపు మేరకు గురువారం జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌరస్తాలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నల్ల కండువాలు ధరించి నిరసన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా రాజేశ్వర్‌గౌడ్ మా ట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి న వెంటనే రూ.2లక్షల రైతు రుణమాఫీ, క్వింటాకు రూ.500 బోనస్ ఇస్తామన్న సీఎం రేవంత్‌రెడ్డి.. ఇ ప్పుడు సన్న రకానికి మాత్రమే బోనస్ ఇస్తామని మాటమార్చి రైతులను మోసం చేస్తున్నారని ఆరోపించారు. ఇది మీ చేతగాని తనానికి నిదర్శనం కా దా అని ప్రశ్నించారు. రైతులకు సమయానికి కరెంట్ ఇవ్వలేదు.. సాగునీరు లేక సరైన పంటలు పండలే దు.. కనీసం చేతికి వచ్చిన పంటనైన ప్రభుత్వం కొ నుగోలు చేసి బోనస్ చెల్లించకపోతే రైతులు ఎలా బ తకాలన్నారు.
కేసీఆర్ ప్రభుత్వంలో రైతులు ఎక్కడ పంట పండిస్తే అక్కడే కొనుగోలు చేశారని, ఇవాళ ఆ పరిస్థితి లేక మార్కెట్ యార్డుకే పరిమితమయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల్లో రైతులకు ఇ చ్చిన హామీలు వెంటనే అమలు చేయాలని, ప్రతి గింజనూ కొనుగోలు చేయడంతోపాటు బోనస్ చెల్లించాలని లేదంటే రైతుల పక్షాన ఆందోళనలు నిర్వహిస్తామని ప్రకటించారు. కార్యక్రమంలో ముడా మా జీ చైర్మన్ వెంకన్న, మున్సిపల్ మాజీ చైర్మన్ నర్సింహులు, డీసీసీబీ వైస్ చైర్మన్ వెంకటయ్య, నాయకులు గోపాల్‌యాదవ్, శివరాజ్, దేవేందర్‌రెడ్డి, కరుణకర్గౌడ్, నరేందర్, గణేశ్, గిరిధర్‌రెడ్డి, శివకుమా ర్, అహ్మదుద్దీన్, రాజేశ్వర్‌రెడ్డి, రైతులు ఉన్నారు.