పెద్దమందడి, జనవరి 25 : ప్రతి కార్యకర్తకూ అండగా ఉంటామని, ఎవరూ అధైర్య పడొద్దని, ఎప్పుడు ఏ ఆపద వచ్చినా ఆదుకుంటామని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి భరోసా ఇచ్చారు. మండలంలోని అల్వాలకు చెందిన బీఆర్ఎస్ కార్యకర్త బాలరాజు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ ఇన్సూరెన్స్ చెక్కును గురువారం బాలరాజు భార్య ఇంద్రజకు మాజీ మంత్రి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ కార్యకర్తలకు పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందన్నారు. గతంలో కేసీఆర్ సర్కారు ప్రజలకు ఎన్నో అభివృద్ధి, సంక్షేమ పథకాలను అందించి వారికి ఆర్థిక తోడ్పాటునందించిందని గుర్తుచేశారు. కార్యకర్తలు నిరంతరం ప్రజల మధ్య ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని, ప్రస్తుత ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు.
వచ్చే పార్లమెంట్ ఎన్నికలకు సిద్ధం కావాలని, ప్రతి కార్యకర్త బీఆర్ఎస్ అభ్యర్థి గెలుపే లక్ష్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సర్పంచ్ సువర్ణ, జెడ్పీటీసీ రఘుపతిరెడ్డి, సింగిల్‌విండో అధ్యక్షుడు విష్ణువర్ధన్‌రెడ్డి, మాజీ ఎంపీపీ మన్నెపురెడ్డి, గొర్రెల సంఘం జిల్లా డైరెక్టర్ నాగేంద్రంయాదవ్, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు వేణుయాదవ్, సింగిల్‌విండో ఉపాధ్యక్షుడు కుమార్‌యాదవ్, మాజీ సింగిల్‌విండో అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి, మాజీ సర్పంచ్ రాజమహేందర్‌రెడ్డి, శేఖర్‌గౌడ్, కృపానంద్గౌడ్, కురుమూర్తి, పురుషోత్తంరెడ్డి, సేనాపతి, లక్ష్మీకాంతారెడ్డి, చిన్న వెంకట్‌రెడ్డి, గోపాల్‌రెడ్డి, రామచంద్రారెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, లక్ష్మణ్‌గౌడ్, సంజీవరెడ్డి, ఎంపీటీసీ గిరమ్మ, బాల్‌రెడ్డి, జానకీరాంరెడ్డి, రవీందర్‌రెడ్డి, మోహన్, చిన్న అంజన్న, వెంకట్రాములు తదితరులు పాల్గొన్నారు.