దేవరకద్ర, ఆగస్టు 2 : రాష్ట్రంలోని సబ్బండ వర్గాల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి తెలిపారు. దేవరక్రద పట్టణంలో నియోజకవర్గంలోని 300 మందికి బుధవారం బీసీ బంధు చెక్కులను జెడ్పీ చైర్పర్సన్ స్వర్ణాసుధాకర్‌రెడ్డి, కలెక్టర్ రవినాయక్‌తో కలిసి ఎమ్మెల్యే ఆల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కులవృత్తులను నమ్ముకున్న వారికి ప్రభుత్వం అండగా నిలుస్తున్నదన్నా రు. నియోజకవర్గానికి 300 మంది బీసీలకు రూ.3 కోట్ల ఆర్థిక సాయం అందిస్తు న్నామన్నారు. రూ.లక్ష సాయం నిరంతరం కొనసాగుతుందని, అర్హులైన ప్రతి ఒక్కరికీ పంపిణీ చేస్తామన్నారు. తొమ్మిదేండ్లల్లో కనీవినీ అభివృద్ధి సాధించామన్నారు. వలసల జిల్లాగా పేరుగాంచిన పాలమూరుకే నేడు వేరే రాష్ర్టాల కూలీలు వలసలు వస్తున్నారని, ఇదంతా సీఎం కేసీఆర్‌తోనే సాధ్యమైందన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ రూ.లక్ష సాయా న్ని సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా ఎదగాలన్నారు. కార్యక్రమంలో ఎంపీపీలు ర మాదేవి, మౌనిక, హర్షవర్ధన్‌రెడ్డి, శేఖర్ రెడ్డి, జెడ్పీటీసీలు, మండలాధ్యక్షులు, సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు పాల్గొన్నారు.
భూత్పూర్, ఆగస్టు 2 : సర్కారు చేపడుతున్న సంక్షేమానికి ఆకర్షితులై బీఆర్ఎస్కి వలసలు కడుతున్నారని ఎమ్మెల్యే ఆల తెలిపారు. మున్సిపాలిటీ పరిధిలోని 1వ వా ర్డులో బీజేపీ నేత శంకర్‌నాయక్ ఆధ్వర్యంలో 60 మంది బుధవారం ఎమ్మెల్యే సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తండాలకు బీటీరోడ్ల నిర్మాణం కోసం రూ.12.60 కోట్లు మంజూరయ్యాయన్నారు. రాందాస్‌తండా, నల్లగుట్ట తండా, సిద్దాయపల్లిలో సీసీ రోడ్ల నిర్మాణం పూర్తయిందన్నారు. బీఆర్ఎస్లో చేరిన వారిలో శంకర్‌నాయక్, లక్ష్మణ్‌నాయక్, సోమ్లానాయక్, తావుర్యానాయక్, శాం తి, లక్ష్మి, జానకి, సీత, సక్రి, సురేశ్‌నాయక్ తదితరులు ఉన్నారు. కార్యక్రమంలో ము న్సిపల్ చైర్మన్ బస్వరాజ్‌గౌడ్, ఎంపీపీ శేఖర్‌రెడ్డి, మత్స్య సహకార సంఘం జిల్లా ఇన్చార్జి సత్యనారాయణ, సింగిల్‌విండో చైర్మన్ అశోక్‌రెడ్డి, కౌన్సిలర్ రామకృష్ణ, ముడా డైరెక్టర్ సాయిలు, నాయకులు నర్సింహాగౌడ్, అజీజ్, నారాయణగౌడ్ పాల్గొన్నారు.