మహబూబ్‌నగర్ అర్బన్, అక్టోబర్ 8 : కులవృత్తులకు పూ ర్వ వైభవం తీసుకొచ్చేందుకే సీఎం కేసీఆర్ బీసీబంధు పథకానికి శ్రీకారం చుట్టారని ఎక్సైజ్, క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. ఆదివారం మహబూబ్‌నగర్‌లోని శి ల్పారామంలో వెనుకబడిన తరగతుల శాఖ ఆధ్వర్యం లో 200మంది లబ్ధిదారులకు రూ.లక్ష చెక్కులను మం త్రి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వరాష్ట్రంలో పేదల సంక్షేమం కోసం అనేక ప థకాలు ప్రవేశ పెట్టామన్నారు. రైతులు, పేద ఆడపిల్ల లు, వృద్ధులు, వికలాంగులను దృష్టిలో ఉంచుకొని రై తుబంధు, రైతుబీమా, కల్యాణలక్ష్మి, ఆసరా పింఛన్లు వంటి ఎన్నో పథకాలను ప్రభుత్వం అమలు చేస్తున్నదన్నారు. తమ ప్రభుత్వ హయాంలోనే కులవృత్తులకు గౌర వం దక్కిందని, అన్ని కులసంఘాలకు హైదరాబాద్, మహబూబ్‌నగర్‌లో ఆత్మగౌరవ భవనాలు, కమ్యూనిటీ హాల్స్ నిర్మిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో ముడా చైర్మన్ వెంకన్న, గ్రంథలయాల సంస్థ జిల్లా చైర్మన్ రాజేశ్వర్‌గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ రెహమాన్, డీసీసీబీ, మున్సిపల్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్లు వెంకటయ్య, గణేశ్, గిరిధర్‌రెడ్డి, గోపాల్‌యాదవ్, రాజేశ్వర్, ఎంపీపీ సుధాశ్రీ, బీసీ సంక్షేమ శాఖ అధికారి ఇందిర తదితరులు పాల్గొన్నారు.
అభివృద్ధికి ఆకర్షితులై..
అభివృద్ధి, సంక్షేమానికి ఆకర్షితులై గులాబి పార్టీలో చేరుతున్నారని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నా రు. మహబూబ్‌నగర్‌లోని క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వీరన్నపేటకు చెందిన బీజేపీ పట్టణ వైస్ ప్రెసిడెంట్ అచ్చుగట్ల అంజయ్య, కోశాధికారి శివకుమార్, బీజేవైఎం నాయకులు మహేశ్, అజయ్, విజయ్ సహా 50మంది, బండమీదిపల్లి యాదవసంఘం అధ్యక్షుడు జంగయ్య ఆధ్వర్యంలో బీజేపీకి చెందిన 50మంది బీఆర్ఎస్లో చేరా రు. వారికి మంత్రి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆ హ్వానించారు. కార్యక్రమంలో రైతుబంధు సంఘం జిల్లా అధ్యక్షుడు గోపాల్‌యాదవ్, గొర్రెకాపరుల సంఘం జిల్లా అధ్యక్షుడు శాంతన్నయాదవ్, శివరాజ్, రాములు, రామలింగం తదితరులు పాల్గొన్నారు.
మంత్రికి మద్దతు..
అసెంబ్లీ ఎన్నికల్లో మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అఖండ విజయం సాధించాలని కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఎంప్లాయీస్ యూనియన్ మహబూబ్‌నగర్ శాఖ పూర్తి మద్దతు ప్రకటించింది. మహబూబ్‌నగర్‌లోని క్యాంప్ కార్యాలయంలో మంత్రిని కలిసి తమ యూనియన్ తరఫున మద్దతు పత్రాన్ని అందజేశారు. ఉద్యోగుల కోసం నిరంతరం శ్రమిస్తున్న మంత్రికి అండగా ఉంటామని సంఘం నాయకులు హామీ ఇచ్చారు. కార్యక్రమంలో యూనియన్ జిల్లా అధ్యక్షుడు బాలస్వామి, ప్రధాన కార్యదర్శి చంద్రకాంత్, రాఘవేంద్ర తదితరులు పాల్గొన్నారు.
అన్ని వర్గాలు సంతోషంగా ఉండాలి
మహబూబ్‌నగర్ టౌన్, అక్టోబర్ 8 : అన్ని వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని మంత్రి అన్నారు. జిల్లాకేంద్రంలోని గౌతమబుద్దనగర్లో దేవాంగకుల కమ్యూనిటీ హాల్, బిల్డింగ్ పెయింటర్స్ అసోసియేషన్ భవన నిర్మాణ పనులకు మంత్రి భూమిపూజ చేసి మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పాలమూరును కులమతాలకు అతీతంగా అన్ని రంగాల్లో అభివృద్ధి చేశామన్నారు. పని చేసే ప్రభుత్వానికి ప్రజలు అండగా ఉండాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ముడా చైర్మన్ వెంకన్న, కౌన్సిలర్ రాణి, నాయకులు శ్రీహరి, వెంకటేశ్, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.
సెంట్రల్ లైటింగ్ ప్రారంభం
జిల్లా కేంద్రంలోని పిస్తా హౌస్ నుంచి ఎదిర ఎక్స్‌రోడ్డు వరకు ఏర్పాటు చేసిన సెంట్రల్ లైటింగ్‌ను మంత్రి ప్రారంభించి మాట్లాడారు. మహబూబ్‌నగర్‌ను సుందరంగా తీర్చిదిద్దుతున్నామన్నారు. కార్యక్రమంలో డీసీసీబీ వైస్ చైర్మన్ వెంకటయ్య, కౌన్సిలర్లు, మున్సిపల్ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.
ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలి
దసరా ఉత్సవాలను గతానికి మించి నిర్వహించాలని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని దయానంద విద్యామందిరంలో ఆర్యసమాజ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దసరా ఉత్సవ కమిటీ సమావేశానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. తెలంగాణలోనే ఎక్కడా లేని విధంగా ధ్వజ దారి కార్యక్రమాన్ని పాలమూరులో నిర్వహిస్తున్నామన్నారు. ఉత్సవ ఊరేగింపు అత్యంత అద్భుతంగా ఉంటుందని, ఈ ఏడాది ఊరేగింపులో పటాకుల మోత, స్వాగత తోరణాలు, కళాజాత, కాళాకారుల కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేపట్టాలన్నారు. అత్యధిక సంఖ్యలో ప్రజలను భాగస్వాగం చేసి దసరా ఉత్సవాలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఇకపై నిర్వహించే అన్ని కార్యక్రమాలను ట్యాంక్‌బండ్‌పై నిర్వహిస్తే బాగుంటుందని, ముఖ్యంగా బతుకమ్మ ఘాట్, శిల్పారామం, ఐలాండ్ అందుబాటులో ఉన్నాయని వీటిని వినియోగించుకునేలా కార్యక్రమాలు రూపొందించాలన్నారు. పండుగలోపే 20 ఫీట్ల ఎత్తయిన జమ్మి వృక్షాన్ని ఏర్పాటు చేయాలన్నారు. ఉత్సవాల నిర్వహణకు సహాయం చేస్తానని మంత్రి తెలిపారు. ఈ ఏడాది ధ్వజధారిగా కుమారస్వామిని మంత్రి సమక్షంలో కమిటీ నిర్ణయించింది. కార్యక్రమంలో రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు గోపాల్‌యాదవ్, గ్రంథాలయాల సంస్థ జిల్లా చైర్మన్ రాజేశ్వర్‌గౌడ్, ముడా చైర్మన్ వెంకన్న, మున్సిపల్ వైస్ చైర్మన్ గణేశ్, మాజీ మున్సిపల్ చైర్మన్ ముత్యాల ప్రకాశ్, డా.మురళీధర్, చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.
దేవుడికి ప్రతిరూపం డాక్టర్లు
వైద్యులు దేవుడికి ప్రతిరూపమని మంత్రి పేర్కొన్నారు. ఆదివారం అప్పన్నపల్లి సమీపంలో రూ.50లక్షలతో నిర్మించనున్న ఇండియన్ మెడికల్ అసోసియేషన్ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ డాక్టర్లకు సగం జీవితం చదవడానికి, మిగిలిన జీవితంలో మానసిక ఒత్తిడి, ఆందోళనతో గడుపుతూ ప్రజలకు వైద్య సేవలు అందిస్తారన్నారు. అంత పవిత్రమైన వృత్తిలో కొనసాగుతున్న వారికి చేయూతనివ్వాలనే ఉద్దేశంతో ఇండియన్ మెడికల్ అసోసియేషన్, గైనకాలజీ సొసైటీ భవనాన్ని నిర్మిస్తున్నామన్నారు. భవిష్యత్‌లో మహబూబ్‌నగర్‌ను వైద్యపరంగా అన్ని రకాలుగా ఆభివృద్ధి చేస్తామన్నారు. మెట్రో రైల్ సౌకర్యాన్ని సైతం పాలమూరుకు తీసుకొస్తామన్నారు. కార్యక్రమంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు రామ్మోహన్, డాక్టర్లు సంపత్, శామ్యూల్, వెంకటరామిరెడ్డి, ప్రతిభ, విజయ్‌కాంత్, రజినీకాంత్, బాల శ్రీనివాస్, రాఘవేందర్, ఆనుసూయరెడ్డి, అపర్ణ, విష్ణు ప్రియాంక తదితరులు పాల్గొన్నారు.