మహబూబ్‌నగర్, జనవరి 30 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : నారాయణపేట పట్టణ కాంగ్రెస్ పార్టీని బడా బంగారు వ్యాపారి వద్ద తాకట్టు పెట్టరా? పార్టీలో మొదటి నుంచి క్రియాశీలకంగా పని చేసిన కార్యకర్తలను పట్టించుకోరా? అంటే కాంగ్రెస్ శ్రేణుల్లో అవును.. అనే అభిప్రాయమే వ్యక్తమవుతున్నది. ‘మేము మీ తాత చిట్టెం నర్సిరెడ్డి హయాం నుంచి కాంగ్రెస్‌లోనే ఉన్నాం.. లేక లేక ఈ మున్సిపల్ ఎన్నికల్లో తమకు అవకాశం వచ్చింది.. కానీ మీ మామ కుంభం శివకుమార్‌రెడ్డి మాకు టికెట్ ఇవ్వకుండా ఇతర పార్టీల నుంచి వలస వచ్చిన బడా బాబు లు,
బంగారు వ్యాపారీ అనుచరులకు టికెట్లు ఇచ్చారు.. మమల్ని పకన పెడుతున్నారు’ అని పలువురు సీనియర్ కార్యకర్తల భావన. ఈ విషయమై మొర పెట్టుకుందామని ఎమ్మెల్యే పర్ణికారెడ్డికి ఫోన్ చేసినా.. ఆమె అందుబాటులో లేకుండా పోయారని పార్టీలో చర్చింకుంటున్నట్లు తెలుస్తోంది. దీంతో నారాయణపేట పట్టణ కాంగ్రెస్‌లో అంతర్మథనం మొదలైంది. ఈ మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల ఎంపికలో కీలక పాత్ర పోషించిన శివకుమార్‌రెడ్డి మున్సిపాలిటీ చేయి జారితే నైతిక బాధ్యత ఎమ్మెల్యే వహిస్తారా? అని ఎలాంటి అధికారిక పదవిలేని శివకుమార్‌రెడ్డి వహిస్తారా? అనేది కాంగ్రెస్ అధిష్టానమే నిర్ణయించాలని కార్యకర్తలు గుసగుసలాడుతున్నారు.
అతనో బడా బంగారు వ్యాపారి. ఎలాంటి రాజకీయ అనుభవం లేదు. క్రియాశీల రాజకీయాల్లో లేరు. గత మున్సిపల్ ఎన్నికల్లోనూ డబ్బు ప్రభావంతోనే పోటీ చేసి వైస్ చైర్మన్ అయ్యారన్న ఆరోపణలు వినిపించాయి. కానీ ఐదేండ్ల పదవీ కాలంలో తాను ఎన్నికైన 17వ వార్డులో ప్రజల సమస్యలు పరిషరించింది శూన్యమేనని స్థానికులు ఆరోపిస్తున్నారు. గత మున్సిపల్ ఎన్నికల్లో ఇదే కాంగ్రెస్ పార్టీ ఓటమికి బీఆర్ఎస్ నుంచి పనిచేసిన ఆయనను అదే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కేవలం డబ్బు ఉందనే ఉద్దేశంతో ఆయన భార్యను చైర్పర్సన్ అభ్యర్థిగా ప్రకటింపజేసిందనేది జగమెరిగిన సత్యం.
అయితే రాజకీయాన్ని వ్యాపారం చేస్తే లాభం వస్తుందో లేదో కానీ.. నష్టం మా త్రం పట్టణ ప్రజలకేనని సోషల్ మీడియాలో వీడియో చకర్లు కొడుతున్నాయి. అయితే తొండికో మొండికో.. ఎస్ఆర్ రెడ్డే బెటర్ అంటూ పట్టణ వాసులు పేర్కొంటున్నారు. పట్టణంలో ఏదైనా అభివృద్ధి జరిగిందంటే అది మాజీ ఎమ్మెల్యే ఎస్‌ఆర్‌రెడ్డి హయాంలోనే అని పట్టణ ప్రజల మనసులో ఇంకా ఉంది.ఎమ్మెల్యే పర్ణికారెడ్డి రెం డేళ్ల కాలంలో ప్రజలకు అందుబాటులో ఉన్న సందర్భా లు చాలా తకువ. ప్రస్తుత మున్సిపాలిటీ ఎన్నికలకు అం దుబాటులో లేరు. పార్టీ నుంచి కౌన్సిలర్లకు పోటీ చేసే వారికి టికెట్లు సైతం ఆమె ఇచ్చే పరిస్థితి లేదు.