మహబూబ్‌నగర్ విద్యావిభాగం, అక్టోబర్ 3 : మహబూబ్‌నగర్ జిల్లా పోలీసు పరేడ్ మైదానంలో జోగుళాం బ జోనల్ పోలీస్ డ్యూటీ మీట్-2024ను జోగుళాంబ జోన్-7 డీఐజీ ఎల్ఎస్ చౌహాన్ గురువారం ప్రారంభించారు. కేసుల దర్యాప్తు, పరిశోధన, ఫింగర్ ప్రింట్స్, డాగ్ స్కాడ్, బాబు డిస్పోజల్ టీం, ఫొటోగ్రఫీ వీడియోగ్రఫీ అంశాల్లో పోలీసులకు పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇందులో నైపుణ్యం ప్రదర్శించిన వారికి రివార్డులు అందించడంతోపాటు రాష్ట్రస్థాయికి ఎంపిక చేయనున్నట్లు పేర్కొన్నారు.
పోలీసు అధికారులు, సిబ్బంది పనితనాన్ని మెరుగుపరిచేందుకు, పెంపొందించేందుకు జోనల్, రాష్ట్ర, జాతీయ స్థాయి పోలీస్ డ్యూటీ మీట్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రస్థాయిలో ప్రతిభ కనబర్చిన వారికి మెడల్స్, నగదు బహుమతులు, బహుళ ఇంక్రిమెంట్స్ ఇస్తామన్నారు. కేసుల దర్యాప్తులో, నేరాలు జరిగిన స్థలంలో, వస్తువులను సీజ్ చేసినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, బాంబు స్కాడ్, నార్కోటిక్ జాగిలాలను ఉపయోగించి ఏ విధంగా నేర పరిశోధన చేయాలనే అంశాలపై పరీక్షలు నిర్వహించారు.
కార్యక్రమంలో మహబూబ్‌నగర్ ఎస్పీ జానకి, అదనపు ఎస్పీ రాములు, ఏఆర్ ఎస్పీ సురేశ్‌కుమార్, నాగర్‌కర్నూల్ జిల్లా అదనపు ఎస్పీ సీహెచ్ రామేశ్వర్, వనపర్తి అదనపు ఎస్పీ రామ్దాస్తేజ, నారాయణపేట ఏఆర్ అ దనపు ఎస్పీ రియాజ్ ఉల్హక్, మహబూబ్‌నగర్ డీఎస్పీ వెంకటేశ్వర్లు, డీసీఆర్బీ డీఎస్పీ రమణారెడ్డి, వర్టికల్ డీఎస్పీ సుదర్శన్, డీటీసీ డీఎస్పీ నర్సింహులు, గద్వాల డీఎస్పీ నరేందర్‌రావు, ఏఆర్ డీఎస్పీ శ్రీనివాసులు, పో లీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.