చేరికల జోరు
రేవల్లిలో మండల మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంగళవారం వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ప్రారంభించారు. అంతకుముందు బీఆర్ఎస్ పార్టీ జెండాను ఎగురవేశారు. కార్యక్రమంలో ఎంపీపీ బంకల సేనాపతి, జెడ్పీటీసీ భీమయ్య, సర్పంచులు, ఎంపీటీసీలు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
- అభివృద్ధి, సంక్షేమాన్ని చూసి కారెక్కిన వివిధ పార్టీల నాయకులు
- ప్రభుత్వ విప్ గువ్వల, ఎమ్మెల్యేలు లక్ష్మారెడ్డి, చిట్టెం రామ్మోహన్‌రెడ్డి, బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి సమక్షంలో చేరికలు
- కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానం
- అందరూ కలిసికట్టుగా ఉండాలని పిలుపు
రేవల్లిలో మండల మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంగళవారం వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ప్రారంభించారు. అంతకుముందు బీఆర్ఎస్ పార్టీ జెండాను ఎగురవేశారు. కార్యక్రమంలో ఎంపీపీ బంకల సేనాపతి, జెడ్పీటీసీ భీమయ్య, సర్పంచులు, ఎంపీటీసీలు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
– రేవల్లి, ఏప్రిల్ 25
ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు సమక్షంలో మంగళవారం లింగాలకు చెందిన పలువురు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరారు. వారికి విప్ గువ్వల గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ మాకం తిరుపతయ్య, సర్పంచ్ కోనేటి తిరుపతయ్య, వర్కింగ్ ప్రెసిడెంట్ రానోజీ, హన్మంతునాయక్ పాల్గొన్నారు.
– లింగాల, ఏప్రిల్ 25
బాలానగర్‌కు చెందిన బీజేపీ గ్రామాధ్యక్షుడు శివకుమార్ మంగళవారం జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. వైస్‌ఎంపీపీ వెంకటాచారి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కర్ణం శ్రీనివాసరావు ఆధ్వర్యంలో శివకుమార్ పార్టీలో చేరగా, ఎమ్మెల్యే గులాబీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. కార్యక్రమంలో టీజీసీసీ చైర్మన్ వాల్యానాయక్, ఎంపీపీ కమల, బీఆర్ఎస్ యూత్వింగ్ మండల అద్యక్షుడు సుప్ప ప్రకాశ్, సర్పంచ్ ఖలీల్, సింగిల్‌విండో డైరెక్టర్ మంజూనాయక్ పాల్గొన్నారు.
– బాలానగర్, ఏప్రిల్ 25
గద్వాల నియోజకవర్గంలోని పెద్దొడికి చెందిన ఉపసర్పంచ్ సత్యమ్మతోపాటు పుటాన్పల్లి, నీలిపల్లి గ్రామాలకు చెందిన సుమారు 200మంది బీజేపీ కార్యకర్తలు మంగళవారం ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్రావు సమక్షంలో బీఆర్ఎస్ తీర్ణం పుచ్చుకున్నారు. వారికి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.
– గద్వాల, ఏప్రిల్ 25
మక్తల్‌లో మంగళవారం నిర్వహించిన బీఆర్ఎస్ ప్రతినిధుల సమావేశంలో అమరచింతకు చెందిన 40మంది బీజేపీ, టీడీపీ కార్యకర్తలతోపాటు మాగనూర్ మండలం అడవి సత్యారం గ్రామానికి చెందిన పీఏసీసీఎస్ డైరెక్టర్ లక్ష్మణ్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి సమక్షంలో గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. బీఆర్ఎస్లో చేరిన వారిలో కోరి శ్రీనివాసులు, డ్రైవర్ శ్రీనివాసులు, సాకలి రాములు, మైనార్టీ యువకులు ఉన్నారు.
– మక్తల్‌టౌన్/అమరచింత, ఏప్రిల్ 25
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

