గద్వాల అర్బన్/ధరూర్, మే 30 : ఆ కార్యాలయంలో ఏ పనైనా.. సరే.. పైసలు పెట్టనిదే కాదు…పైకం చెల్లిస్తేనే…ఏ ఫైల్ అయినా కదిలేది..అన్న చందగా ఆ కార్యాలయంలో వ్యవహరాలు నడుస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. జిల్లా నుంచి కూత వేటు దూరంలో ఉన్న ధరూర్ మండల కేంద్రంలోని తాసీల్దార్ కార్యాలయంలో పనిచేయాలంటే.. పైసలు తడపనిదే… అధికారులు ఏ ఫైల్ ముట్టరని తెలిసింది.
అయితే ఈ మధ్యనే కొందరు రైతులు తమ వ్యవసాయ భూమికి సంబంధించి గత పాత వివరాలు సేకరించేందుకు కార్యాలయ అధికారికి దరఖాస్తు చేసుకున్నారు. అధికారి అనుమతి అనంతరం పాత వివరాల రికార్డ్ల ద్వారా సమాచారం సేకరించేందుకు రికార్డ్ రూం వెళ్లగా…తమకు పైకం చెల్లిస్తేనే…మీ పని త్వరగా అయిపోతుంది. లేదంటే కొంత సమయం పడుతుందని ప్రజలకు నిర్మోహ
మాటంగా చెప్పినట్లు సమాచారం. అలానే కుల, ఆదాయం ధ్రువీకరణ పత్రాల వ్యవహారంలో కూడా ఇదేతీరు ఉన్నట్లు బాహాటంగానే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ప్రభుత్వం అర్హులకు రేషన్ కార్డులు అందజేస్తామని ప్రకటించింది. ఇదే అదునుగా భావించిన కార్యాలయ అధికారులు తమ జేబుకు పని చెప్పారు. రేషన్ కార్డు కావాలంటే రూ.200 నుంచి రూ.500 వరకు వసూలు, అలాగే పాత రేషన్ కార్డుల నుంచి పేరు తొలగించాలంటే రూ.100 నుంచి రూ.200 ప్రజల నుంచి వసూలు చేస్తున్నట్లు తెలిసింది. రేషన్ కార్డులు సరిచేసే అపరేటర్ రోజు ఆదాయం రూ.5వేల నుంచి రూ.10వేల
వరకు ఉంటుందని కార్యాలయ సిబ్బం ది చర్చించుకుంటున్నారు.
కార్యాలయానికి సంబంధించి ప్రతిరోజూ అందరి అధికారులు రూ. 30వేల నుంచి రూ.80వేల వరకు ప్రజల నుంచి వసూలు చేస్తున్నట్లు మండల కేంద్రంలో పుకార్లు షికా ర్లు చేస్తున్నాయి. అలానే కార్యాలయంలో పైరవీకారుల వ్యవహరాలు కూడా అదే స్థాయిలో పైరవీలు కొనసాగిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. పైరవీకారులు తెచ్చే పంచాయితీలు అన్ని కూడా రూ. లక్షలతో కూ డిన వ్యవహారాలు వస్తున్నట్లు తెలిసిం ది. వాటిని సెటిల్ చేస్తే అదే తరహల్లో లక్షల్లో అధికారులకు ముట్టచెబుతు న్నట్లు పెద్దమొత్తంలో ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక్కడ ఒక్క చోటే కాదు జిల్లా లోని పలు కార్యాలయాల్లో ఇదే తంతు ఉందన్న ఆరోపణలు ఉన్నాయి. అధికారుల దోపిడీకి కార్యాలయానికి రావాలంటే సామాన్య ప్రజలు జంకుతున్నారు.
కార్యాలయం సిబ్బందికి మీ పని చేయడానికి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు. కార్యాలయంలో ఏ అధికారి అయినా డబ్బుల కోసం ఇబ్బంది పెడితే.. తన దృష్టికి తీసుకొస్తే తక్షణమే వారిపై చర్యలు తీసుకుంటాం. ఈ మధ్యనే రికార్డ్ల వ్యవహరానికి సంబంధించి సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేసి మరోమారు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటానని హెచ్చరించాను. బాధితులు నన్ను అశ్రయిస్తే వారికి న్యాయం చేస్తాం
-భూపాల్‌రెడ్డి, ధరూర్ తాసీల్దార్