అచ్చంపేట రూరల్ : ఆర్టీసీ సంస్థలో పదవీ విరమణ పొందిన ఆర్టీసీ కార్మికుల ( Retired RTC workers) సమస్యలు పరిష్కరించాలని అచ్చంపేట డిపో కార్యాలయం ఎదుట టీఎస్ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ధర్నానిర్వహించారు. అనంతరం డిపో మేనేజర్ దుర్గ మురళి ప్రసాద్ కు వినతి పత్రాన్ని అందజేశారు.
కార్మిక సంఘం నాయకులు రాములు, ఉడుత జంగమ్మ మాట్లాడుతూ రిటైర్మెంట్ కార్మికులకు రావాల్సిన టెర్మినల్ లీవ్ (Terminal Leave) , ఎన్క్యాష్మెంట్ రిటైర్మెంట్ అయినా నెలలోపు చెల్లించాలని డిమాండ్ చేశారు. కార్మికులకు నెలలోగా గ్రాడ్యుయేట్ చెల్లించాలని కోరారు. మెడికల్ ఫెసిలిటీ స్కీమ్ సౌకర్యం 10 లక్షలకు పెంచాలని, ఉమ్మడిగా 20 లక్షలు వర్తింప చేయాలని కోరారు.
2017 అరియర్స్ తో డీఏ, అరియర్స్ ముడి పెడుతూ తీసుకొచ్చిన సర్కులర్ను ఉపసహరించుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వము కనీసం పెన్షన్ రూ.9వేలు వర్తింపచేయాలని, ఈపీఎస్ కు కరువు భత్యం లింకు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. చట్ట విరుద్ధంగా అమలు చేస్తున్న హైయర్ పెన్షన్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రిటైర్మెంట్ ఆర్టీసీ కార్మికులు ఎంఆర్ రెడ్డి, పీవీ చారి, ఎండీ హబీబ్ ,ఆర్ శంకర్, జంగమ్మ, విజయలక్ష్మి, శ్రీశైలం, బి శేఖర్, కుదూస్ పాల్గొన్నారు.