గోపాల్పేట, ఏప్రిల్ 29 : కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజలకు కష్టాలు వచ్చాయని, కేసీఆర్ సర్కార్ రైతులను కంటికి రెప్ప లా కాపాడుకుందని, కాంగ్రెస్ మా యమాటలు నమ్మి కష్టాలను కొనితెచ్చు కున్నామని రైతులు తమ ఆ వేదన వ్యక్తం చేస్తున్నారు. మండలంలోని బుద్ధారంలోని వరి ధా న్యం కొనుగోలు కేంద్రాల్లో తూ కం వేసిన ధాన్యం లారీలు రాక వారాల తరబడి నిలిచిపోవడం తో మంగళవారం రైతులు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ ప్రభుత్వం రైతులను చులకనగా చూ స్తుందని, రైతులపై ప్రభుత్వ మెండి వైఖరి మా నుకొని, ధాన్యం కొనగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బదులు కలుగకుండా చూడాలన్నారు.
కొనుగోలు కేంద్రాల వద్ద లారీలు రాక తూకం వేసిన ధాన్యం బస్తాలు భారీగా నిలిచిపోయాయని, అకాల వర్షాలకు ధాన్యాన్ని కాపాడుకునేందుకు నానా తం టాలు పడుతున్నామని, తూకం వేసిన బస్తాలు నిల్వ ఉండడంతో మరో రైతు ధాన్యం ఆరబెట్టుకునేందుకు వీలు లేకుండా పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ధాన్యం మిల్లర్ల వద్దకు చేరాక తరుగు పేరుతో రైతులు మో సపోతున్నారన్నారు. తూకం అయిన ధాన్యం తీ సుకెళ్లకపోవడంతో ఎండనకా, వాననకా, రేయింబవళ్లు ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద పడిగాపులు గాస్తున్నామన్నారు. కేసీఆర్ సర్కార్ ఉన్నప్పుడు ఇ లా జరగలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రైతుల పరిస్థితి దయనీయంగా తయారైయిందన్నారు.
గంటకుపైగా రైతులు రోడ్డుపై ధర్నా చేయగా ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. రైతుల ధర్నా విష యం తెలుసుకున్న ఎస్సై నరేశ్‌కుమార్, తాసీల్దార్ తిలక్‌కుమార్‌రెడ్డి అక్కడికి చేరుకొని అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లుతో రైతులను ఫోన్లో మాట్లాడించారు. అదనపు కలెక్టర్ ధాన్యం తరలించేందుకు లారీలు ఏర్పాటు చేస్తామని హామీ ఇవ్వడంతో రైతులు శాం తించారు. కార్యక్రమంలో డీసీఎంస్ వైస్ చైర్మన్ పా త్లావత్ హర్యానాయక్, మాజీ ఎంపీటీసీ శేఖర్‌గౌడ్, బీఆర్ఎస్ నాయకులు, రైతులు గోపాల్‌రావు, రాజు, రవి, శేఖర్, లక్ష్మయ్య, కృష్ణయ్య, మైబూస్, ఓంకార్, విష్ణు, శ్రావణ్, లచ్చగౌడ్, రాంబాబురావు, లాలునాయక్, హనుమంతు, లక్ష్మయ్య, రాందాస్ తదితరులు పాల్గొన్నారు.
చేను కోసి ఇరవై రోజులు అవుతున్నది. కొనుగోలు కేంద్రం వద్ద ధాన్యం ఆరబోసుకునేందుకు స్థలం లేదు. కొనుగోలు కేంద్రాలకు వచ్చిన ధాన్యం లారీలు రాక నిలిచిపోయింది. నాటిన కాడి నుంచి కష్టపడితే నోటి కాడికి వచ్చినా భద్రం లేదు. రైతుల కష్టాలు పట్టించుకునే నాథుడే లేకుండా పోయాడు. పండించిన పంట అమ్ముకునేందుకు పోతే అక్కడ కూడా కష్టాలు తప్పడం లేదు. కేసీఆర్ సర్కార్ ఉన్నప్పుడు ఇట్ల లేకుండే.
– గోపాల్‌రావు, రైతు, బుద్ధారం
పంట కోసి పది హే ను రోజులు అవుతున్నది. ధాన్యం కొనుగో లు కేంద్రానికి తీసుకొచ్చినం. లారీలు రాక తూకం వేసిన ధాన్యం తీసుకపోతలేరు. వా నలు వస్తే మా బతుకు బజారే. మా బాధలు పటించుకునే వారు లేరు. లారీలు ఇప్పుడు, అప్పుడు వస్తాయని చెప్పుతుండ్రూ.. కానీ రావడంలేదు. లారీల కోసం ఎదురు చూసుకుంటా, ధాన్యం మీద కవర్లు కప్పి పడిగాపులు కాస్తున్నాం.
– మూడావత్ నానునాయక్, రైతు, లక్ష్మీతండా , వనపర్తి జిల్లా
కల్వకుర్తి రూరల్, ఏప్రిల్ 29 : ఆరుగాలం కష్టించి పండించిన ధా న్యాన్ని తరుగు పేరిట మిల్లర్లు దోపిడీకి పాల్పడుతున్నారు. ఒక క్విం టా ధాన్యానికి దాదాపుగా ఎనిమిది నుంచి పది కిలోల వరకు తరు గు తీయడంతో రైతుల్లో ఆగ్రహం కట్టలు తెచ్చుకుంది. దీంతో మంగళవారం రైతులు పాలమూరు చౌరస్తా వరకు ర్యాలీగా నిర్వహించి మిల్లర్ల దోపిడీని నిరసిస్తూ వరి ధాన్యానికి నిప్పటించి మరి కొంత వరి ధాన్యాన్ని రోడ్డు పైన పారబోసి నిరసన తెలియజేశారు. ఈ సం దర్భంగా వారు మాట్లాడుతూ మిల్లర్లు రైతులు మిల్లుకు తీసుకువచ్చిన ధాన్యానికి తేమ, తాళ్లు, నట్టలు, ఇలా పలు విధాలుగా వం కలు పెడుతూ మోసాలకు పాల్పడుతున్నారన్నారు.
రైతులను మిల్ల ర్లు మోసం చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని వారు ఆరోపించారు. రైతులకు గన్నీ బ్యాగులు ఇవ్వకుండా కనీసం ధాన్యం రవాణా ఖర్చులు ఇవ్వకుండా, మిల్లుల వద్ద తాగడానికి నీటి వసతి కల్పించకుండా ఇబ్బందుల పాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. క ల్వకుర్తి డివిజన్ పరిధిలో 8 పారాబాయిల్డ్ రైస్ మిల్లులుండగా కేవ లం 2 మిల్లులకు మాత్రమే వరి కొనుగోలు అనుమతి ఇవ్వడం ఏం టని మిగతా వాటిలో అమ్ముకునే అవకాశం ఇస్తే తమకు నచ్చిన చో ట అమ్ముకుంటామన్నారు. ఒక క్వింటాకు పది కిలోల వరకు తరు గు తీయడం తమకు చాలా నష్టం జరుగతుందని ఇది ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. మిల్లర్లు ప్రభుత్వ నిబంధనలు
గేటు బయట ఫ్లెక్సీలకు పరిమితం చేస్తున్నారని లోపలికి వెళ్లిన ధాన్యానికి మాత్రం తమకు ఇష్టమున్నట్లుగా కొంటున్నారని ఇదేంటని ప్రశ్నిస్తే నీకు నచ్చితే అమ్ము లే కపోతే వెళ్లిపోమ్మని అంటున్నారని ఆవేదన వ్యక్తం చే శారు. కేసీఆర్ ప్రభుత్వంలో రైతు పొలాల వద్దకు వాహనాలను పంపించి అక్కడే కొనుగోలు చేసి రైతులకు మేలు చేశారని గుర్తు చేసుకున్నారు. ఇప్పుడు రేవంత్ సర్కారు కే వలం ప్రచారాలు ఆర్భాటాలకు మాత్రమే అన్నట్లుగా ఉంద ని రైతు సంక్షేమ ప్రభుత్వమని చెప్పుకుంటున్నా ఆచరణలో అంతా శూన్యం అన్నారు. రైతు ఏడ్చిన రాజ్యం.. ఎద్దు ఏడ్చి న ఎవుసం బాగుపడిన చరిత్ర లేదన్నారు. రైతులు తెచ్చిన వ రి ధాన్యంలో నట్టలు, నూకలు ఉంటే మరి ప్రభుత్వం రేషన్ దుకాణాల ద్వారా అందిస్తున్న బియ్యంలో నూకలు లేవా అం టూ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే మిల్ల ర్ల దోపిడీని అరిట్టాలని అధికారులు, ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రైతుల నిరసన విషయాన్ని తెలుసుకున్న పోలీసులు అ క్కడకు చేరుకుని రైతులతో మాట్లాడి వారిని శాంతింపజేశారు. అనంతరం ఆర్డీవో కార్యాలయం వరకు రైతులు ర్యాలీగా వెళ్లి అధికారికి వినతిపత్రాన్ని అందించారు. కార్యక్రమంలో ఆయా గ్రా మాల రైతులు, రైతు సంఘాల నాయకులు ఉన్నారు.
పెబ్బేరు, ఏప్రిల్ 29 : పెబ్బేరు మండలం గుమ్మడం క్రాస్‌రోడ్డు వద్ద కొల్లాపూర్ ప్ర ధాన రహదారిపై మంగళవారం రైతులు రాస్తారోకో చేపట్టారు. గుమ్మడం గ్రామంలోని ప్రభుత్వం ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రంలో పెద్ద ఎత్తున ధాన్యం రాశులు పేరుకపోయాయని వెంటనే కొనుగోళ్లు ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టారు. పర్మిట్లు, సంచులు, హమాలీలు అన్నీ సిద్ధంగా ఉన్నప్పటికీ ధాన్యం రవాణా చేసేందుకు లారీలు లేకపోవడంతో కొనుగోళ్లు నిలిచిపోయాయని రైతులు వాపోతున్నారు. అధికారులకు ఎంత మొరపెట్టుకున్నా స్పందన లేకపోవడంతో విసుగు చెందిన రైతు రోడ్డుకు అడ్డంగా ట్రాక్టర్లు, బైకులు పెట్టి రాస్తారోకో నిర్వహించారు. రోడ్డుపై పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోవడం తో అధికారులు స్పందించి వెం టనే లారీలు పంపిస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు.
మక్తల్, ఏప్రిల్ 29 : ఆరుగాలం కష్టించి పండించిన పంటను అమ్ముకునేందుకు కూడా రైతులు అష్టకష్టాలు పడాల్సి వస్తున్నది. పేరుకే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి గన్నీ బ్యాగులు ఇవ్వకపోవడంతో రైతులు నిత్యం అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. మంగళవారం మక్తల్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయానికి రైతులు గన్నీ బ్యాగుల కోసం వెళ్లారు. తీరా అధికారులు గన్నీ బ్యాగులు లేవని చెప్పడంతో ఆగ్రహించి మక్తల్ జాతీయ రహదారిపై రాస్తారోకో చేపట్టారు. మక్తల్ మండలంలో 10 కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేయగా, గన్నీ బ్యాగులు ఇవ్వకపోతే ఎక్కడ అమ్ముకోవాలని ప్రశ్నించారు. అకాల వర్షానికి నిత్యం కల్లాల వద్దే కాపలా కాస్తున్నామని, తడిసిన ధాన్యంతో తీవ్రంగా నష్టపోతున్నామని వాపోయారు. అధికారులకు ఎన్నిసార్లు తమ గోడు వెళ్లబోసుకున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యారని ఆరోపించారు. సర్కారు, అధికారులు ఇప్పటికైనా స్పందించి వెంటనే గన్నీబ్యాగులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాస్తారోకో వద్దకు మక్తల్ సీఐ రాంలాల్, ఎస్సై భాగ్యలక్ష్మిరెడ్డి వచ్చి రైతులతో మాట్లాడారు. సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని చెప్పడంతో రైతులు ఆందోళన విరమించారు.
గద్వాల అర్బన్, ఏప్రిల్ 29 : కూటి కోసం కోటి తిప్పలు.. అంటే ప్రస్తుత జిల్లాలోని రైతుల పరిస్థితి అం త దయనీయంగా మారింది. ఓ వైపు వానలు.. మరో వైపు సెంటర్లో ఉన్న ధాన్యం తరలించడంలో ఆల స్యం.. అకాల వర్షాలకు ధాన్యం తడిస్తే.. పాడవుతుందని రైతులు ఆందోళనకు గురవుతున్నారు. జోగుళాంబ గద్వాల జిల్లాలో వడ్ల కొనుగోలు ప్రారంభించడంలో అధికారులు ఆలస్యం చేస్తున్నారని గత కొన్ని రోజులుగా రైతులు నుంచి ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి. అలానే రైతులు ఆరుగాలం పండించిన ధాన్యాని కొనుగోలు సెంటర్‌కు తీసుకువస్తే వాటిని పరిక్షించి తరలించాల్సిన సెంటర్ నిర్వాహకులు, అధికారులు తరలించే వ్యవహారంలో ఆలస్యం చేయడంపై రైతులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
ఇవన్నీ పక్కన పెడితే సెంటర్‌కు వచ్చే గన్నీ బ్యాగులు మాత్రం మరీ ఘో రంగా ఉన్నాయంటూ రైతులతో పాటు సెంటర్ నిర్వహకులు ఆరోపిస్తున్నారు. మరి ఎంతలా అంటే.. ప్రభు త్వ గోదాం నుంచి వచ్చే 500 సంచుల కట్టలో దాదా పు 200 నుంచి 300 సంచుల దాకా చినిగినవే వస్తున్నట్లు సెంటర్ నిర్వాహకులు వెల్లడిస్తున్నారు. మంచి బ్యాగులకు ధాన్యం నింపితే.. రోజుకు ఒక్క లారీ కూ డా పోవడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారంలో మంగళవారం ధరూర్ మండల కేంద్రంలో వడ్లు నింపే క్రమంలో సంచులు చినిగినవే ఉండడంపై అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలిసింది. మంచి సంచులు ఇ వ్వాలని.. ఇలాంటి సంచులు ఇ స్తే.. వడ్లు ఎన్ని రోజులకు తరలించాలని అనుకుంటున్నారని రైతులు ప్రశ్నించారు. ఈ విషయంపై జిల్లా డీఎం విమలను వివరణ కోరగా.. బ్యాగులు అన్నీ కొత్తగానే ఉన్నాయని, ఎక్కడ అవసరం ఉన్నాయో అక్కడికి పంపిస్తున్నామన్నారు. చినిగిన బ్యాగులు ఉంటే తెప్పించుకొని వాటి స్థానంలో కొత్తవి పంపిస్తున్నాం. గన్నీ బ్యాగుల కొరత ఉంటే తనను సంప్రదించాలని సూచించారు.
హన్వాడ, ఏప్రిల్ 29 : మండలంలో మంగళవారం సాయంత్రం పలు గ్రామాల్లో కురిసిన ఆకాల వర్షానికి కొనుగొలు కేంద్రంలో ఉన్న వరిధాన్యం తడిసి ముద్దయింది. హన్వాడలో రైతు సేవా సహకార సంఘం ఆవరణలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రానికి తూకానికి తీసుకొచ్చిన ధాన్యం అకాల వర్షానికి తడిసిపోయింది. వర్షపునీరంతా ఆరబోసిన ధాన్యంలో నిలిచిపోవడంతో రైతులు వాటిని ఎత్తిపోసేందుకు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఆరుగాలం పడించిన పంటను అమ్ముకునే సమయంలో వచ్చిన అకాల వర్షంతో తీవ్రనష్టం వాటిల్లిందని రైతులు వాపోతున్నారు. మునిమోక్షం, నాయినోనిపల్లి, కోనగట్టుపల్లి, ఇబ్రహీంబాద్ గ్రామాల్లోని కొనుగోలు కేంద్రాల వద్ద కూడా ధాన్యం తడిసి ముద్దయ్యింది.