‘ధరణి’ వచ్చాకే కొత్త పట్టాలొచ్చాయ్.. రైతుబంధు వస్తున్నది.. రైతు బీమా అండగా నిలుస్తున్నది.. భూముల ధరలూ పెరిగినయ్.. భూమిని అమ్మాలన్నా, కొనాలన్నా ఇబ్బందులు తొలిగినయ్.. పైరవీలు లేకుండా రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి.. భూ సమస్యలు కనుమరుగయ్యాయి. ప్రతిపక్ష నాయకులకు ఇవేమీ కనిపించడం లేదు.. రైతులు ఆనందంగా ఉండడం వారికి ఇష్టం లేదేమో! ధరణి పోర్టల్‌ను రద్దు చేస్తామంటూ అనవసర రాద్ధాంతాలు చేస్తున్నారు. మళ్లీ దళారులను రైతులపై రుద్దడానికి ప్రయత్నిస్తున్నారు. పాత పద్ధతిని తీసుకొచ్చి అన్నదాతలను బాధపెట్టాలని కుట్రలు పన్నుతున్నారు. దీంతో రైతన్నలోకం భగ్గుమంటున్నది. కష్టాలన్నీ తొలిగి సంతోషంగా సాగుతున్న తమ జీవితాలను మళ్లీ పాత ఊబిలోకి నెట్టాలని చూస్తున్న నాయకులకు బుద్ధి చెబుతామంటూ హెచ్చరిస్తున్నారు.
వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్లు, ఆస్తుల బదిలీలకు ఇబ్బందులు లేకుండా సులభంగా రిజిస్ట్రేషన్లు చేసేందుకు ప్రభుత్వం ధరణి పోర్టల్‌ను ప్రవేశపెట్టి.. విజయవంతంగా అమలు చేస్తున్నది. నాడు భూములను రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే నానా తిప్పలు పడాల్సి వ చ్చేది. రిజిస్ట్రేషన్ అయ్యాక కంప్యూటరీకరణ అనంతరం పట్టా పుస్తకం చేతికందాలంటే కొన్ని నెలల సమయం పట్టేది. రిజిస్ట్రేషన్, రెవెన్యూ కార్యాలయాల చుట్టూ చెప్పులు అరిగిలా తిరిగితే తప్పా ప ని అయ్యేది కాదు. పాసుబుక్‌లో, రికార్డుల్లో ఏమై నా పొరపాట్లు జరిగితే సవరించుకొనేందుకు పనులన్నీ వదులుకొని కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వచ్చేది.
రైతులు పడుతున్న ఇబ్బందులను గుర్తించిన ప్రభుత్వం వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లను సులభతరం చేసేందుకు ‘ధరణి’ ఆన్లైన్ ప్రక్రియను తీసుకురావడంతో క్షణాల్లో రిజిస్ట్రేషన్లు అవుతుండగా.. ఇంటివద్దకే పాసుపుస్తకాలు వస్తున్నా యి. ధరణి అమల్లోకి వచ్చిన తర్వాత వ్యవసాయ భూములను తాసీల్దార్లు, వ్యవసాయేతర భూములను సబ్రిజిస్ట్రార్లు రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. ముందుగానే మీసేవ కేంద్రాల్లో స్లాట్ బుక్ చేసుకోవడంతో గంటలపాటు నిరీక్షించే రోజులు పోయాయి. ధరణి వచ్చినప్పటి నుంచి రైతులు సంతోషంగా ఉన్నారు. కృష్ణ మండలంలో 3,089, నర్వ మండలంలో 4,299, కోస్గి మండలంలో 752, కొత్తపల్లి మండలంలో 455, దామరగిద్ద మండలంలో 4,970, గుండుమల్ మండలంలో 340, మక్తల్ మండలంలో 6,907, మాగనూర్ మండలంలో 2,983, ధన్వాడ మండలంలో 3,943, మరికల్ మండలంలో 5,485 రిజిస్ట్రేషన్లు పూర్తయ్యాయి.
భూ సమస్యలు దూరం
ధరణి రావడం వల్ల భూ సమస్యలు దూరమయ్యాయి. ఎంతోమంది రైతులు సంతోషంగా ఉన్నారు. గతంలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద పడిగాపులు కాసేటోళ్లం. ధరణితో తాసీల్దార్ కా ర్యాలయంలోనే రిజిస్టేషన్ చే సుకునేందుకు అవకాశం కల్పించారు. ఇంత చేసిన సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు.
ధరణి వచ్చాక రైతులకు ఎంతో మే లు జరుగుతున్నది. దళారులు లేకుండానే స్వతహాగా భూమి రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది. ధరణి వల్లే పహాణి, ఆర్వోఆర్ తీసుకోవడం సులువైంది. ఇంటర్నెట్ సెంటర్‌కి వెళ్లి భూమి కాగితాలు తీసుకుంటున్నం. ధరణికి ముందు రోజులను ఇప్పుడు ఊహించుకోలేం. మ్యు టేషన్ కూడా అయి పో యింది
సులభంగా రిజిస్ట్రేషన్
గతంలో రిజిస్ట్రేషన్ కోసం ఆత్మకూర్‌కు వెళ్లేవాళ్లం. ఎన్నో ఇబ్బందు లు పడుతూ రిజిస్ట్రేషన్ చేసుకోనేటో ళ్లం. తెలంగాణ ప్రభుత్వం వచ్చాక ధరణి పథకం తీసుకొచ్చి 15నిమిషాల్లోనే రిజిస్ట్రేషన్ చేస్తున్నరు. అది కూడా మండలకేంద్రంలోనే చేస్తుండడంతో చాలావరకు సమస్య తీరింది. మేము భాగస్వామ్యం పద్ధతిలో రిజిస్ట్రేషన్ చేసుకున్నాం. దీం తో మాకు ఖర్చు తక్కువైం ది.
భూ రికార్డులు భద్రం
ప్రభుత్వం ధరణి పోర్టల్‌ను తీసుకురావడంతో మాభూముల రికార్డులు భ ద్రంగా ఉన్నాయి. గతంలో భూ ముల వివరాలు తెలుసుకోవాలంటే అధికారుల చుట్టూ తిరగా ల్సి వచ్చేది. ప్రస్తుతం అలాంటి అవసరం లేకుండా పోయింది. రైతులకు సత్వర సేవలను అం దించేందుకు ధరణి పోర్టల్‌ను ప్రా రంభించారు. దీంతో రైతులకు సం బంధించిన వివరాలను ఆన్లైన్లో ఉంచడంతో సులువుగా చూసుకునే వీలు కలిగింది.
– రాంరెడ్డి, పీఏసీసీఎస్ వైస్ చైర్మన్, ఊట్కూర్
ఎంతో ఉపయోగకరం
ధరణి పోర్టల్ ప్రవేశపెట్టడంతో మాలాంటి సదువు రాని రైతులకు ఎంతో మేలు జ రుగుతోంది. ఎవరితో సంబంధం లే కుండా మేమే భూమి అమ్మడం, కొ నడం సులభంగా మారింది. సీఎం కేసీఆర్ దూరదృష్టితో ఈపథకాన్ని తీసుకురావడం అభినందనీయం. ధరణితో రైతులు తక్కువ సమయం లో, అనుకున్న తేదీన డబ్బులు వృథా చేసుకోకుండా రిజిస్ట్రేషన్‌ను పూర్తి చేసుకుంటున్నా రు. రిజిస్ట్రేషన్ విషయంలో ధరణి వచ్చాకే అవినీతి, అక్రమాలకు ఆస్కారం లేకుండా కచ్చితత్వంతో పని అవుతున్నది.
– ఎం. హన్మంతు, రైతు, నర్వ మండలం
దూర, సమయ భారం తప్పింది
ధరణి రాకముందు రిజిస్ట్రేషన్ కోసం నా రాయణపేట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్లేవాళ్లం. అక్కడ ఉదయం నుంచి సాయంత్రం వరకు పడిగాపులు కాసేటోళ్లం. ధరణి వచ్చాక మద్దూర్ మండలకేంద్రంలోని తాసీల్దార్ కార్యాలయంలోనే రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. ఇది చాలా సంతోషకరమైన విషయం. అప్పట్లో ఎవరైనా ఒక లీడర్‌ను తీసుకెళ్తే తప్పా పని అయ్యేది కాదు. కానీ ఇప్పుడు పైరవీలు లేకుండా సాఫీగా పని జరుగుతోంది. రూపాయి లంచం ఇచ్చే అవసరం కూడా లేదు. ధరణి మాకు చాలా మేలు చేసింది.
– హన్మంత్‌రెడ్డి, నిడ్జింత, మద్దూర్ మండలం
దళారుల బాధ తప్పింది
భూముల క్రయ, విక్రయాలకు సీఎం కేసీఆర్ ధరణి ప్రక్రియను ప్రారంభించి విప్లవాత్మక మార్పునకు శ్రీకారం చు ట్టారు. ఎర్గట్‌పల్లి శి వారులో నేను ఎకరా పొలం కొనుగోలు చేశా. రిజిస్ట్రేషన్ కోసం రెండ్రోజులు ముందుగానే మీసేవలో స్లాట్ బుకింగ్ చేసుకున్నా. రిజిస్ట్రేషన్ నూటికి నూరు శాతం పారదర్శకంగా జరిగింది. దళారుల ప్రమేయం లేకుండా నిమిషాల వ్యవధిలోనే రిజిస్ట్రేషన్ చేశారు. వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ కోసం సామాన్య రైతులు పడిగాపులు కాసే బాధ తప్పింది.
– వై. శంకర్, రైతు, ఊట్కూర్
ఇబ్బందులు తప్పినయ్!
ధరణి వచ్చినంక రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఇబ్బందులు తప్పినయ్. కానీ అధికారుల నిర్లక్ష్యం కారణంగా గతంలో ఉన్న పట్టా పాసుపుస్తకాల్లో కొన్ని సమస్యలున్నాయి. వాటిని పరిష్కరిస్తే బా గుంటది. కొన్ని చిన్న చిన్న సమస్యల వల్ల రైతులు ఇబ్బంది పడుతున్నారు. ధరణి ద్వారా రిజిస్ట్రేషన్లు సక్రమంగా జరుగుతున్నాయి. ధరణి రావడంతో ఆర్వోఆర్, పహాణి వంటి వాటిని మీసేవలో పొందడం ఆనందంగా ఉంది. కలెక్టర్లు స్పందించి గతంలో ఉన్న సమస్యలను పరిష్కరించడం హర్షణీయం. ధరణి వల్ల రైతుల కష్టాలు తీరాయి.
– కుర్వ వెంకటేశ్, రైతు, మరికల్ మండలం