మహబూబ్నగర్, ఆగస్టు 4 : మహబూబ్నగర్ జిల్లా కోయిలకొండ మండలకేంద్రంలోని శ్రీరామకొండకు ఆదివారం అమావాస్యను పురస్కరించుకొని భక్తులు పోటెత్తారు. చుట్టుపక్కల ప్రాంతాలతోపాటు ఉమ్మడి జిల్లా నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి కొండపై ఉన్న శ్రీరాముడిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు.
దర్శనం అనంతరం కొండపై ఉన్న గుండంలోని నీటిని, చెట్టు కొమ్మలను ఇండ్లకు తీసుకెళ్లారు. ఆ చెట్టు కొమ్మలను ఇంటో పెట్టుకుంటే మంచి జరుగుతుందని భక్తుల నమ్మ కం. శ్రీరామకొండకు భక్తులు వేల సంఖ్యలో తరలిరావడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పోలీసులు బందోబస్తు నిర్వహించిన భక్తులను కంట్రోల్ చేయలేకపోయారు.