నిజరూప దర్శనం.. సర్వ పాపహరణం
ఐదో శక్తిపీఠమైన అలంపూర్ క్షేత్రంలో ఐదు రోజులుగా అంగరంగ వైభవంగా జరిగిన బ్రహ్మోత్సవాలు బుధవారంతో ముగిశాయి. చివరి రోజు భక్తులు వివిధ ప్రాంతాల నుంచి భారీగా తరలివచ్చి ఉభయ ఆలయాల్లో పూజలు చేశారు. ఆలయ ప్రాంగణం భక్తులతో కిక్కిరిసిపోయింది.
- జగజ్జననీ పాహిమాం అంటూ జోగుళాంబను వేడుకున్న భక్తులు
- నయనానందకరం.. గ్రామోత్సవం
- అలంపూర్‌లో ముగిసిన ఉత్సవాలు
అలంపూర్, ఫిబ్రవరి 14 : ఐదో శక్తిపీఠమైన అలంపూర్ క్షేత్రంలో ఐదు రోజులుగా అంగరంగ వైభవంగా జరిగిన బ్రహ్మోత్సవాలు బుధవారంతో ముగిశాయి. చివరి రోజు భక్తులు వివిధ ప్రాంతాల నుంచి భారీగా తరలివచ్చి ఉభయ ఆలయాల్లో పూజలు చేశారు. ఆలయ ప్రాంగణం భక్తులతో కిక్కిరిసిపోయింది. ఎలాంటి అలంకరణ లేకుండా జోగుళాంబ దేవి నిజరూపంలో భక్తులు దర్శనమిచ్చింది. అమ్మల గన్న అమ్మ.. జగజ్జననీ పాహిమాం.. పాహిమాం.. మమ్మల్ని చల్లంగా చూడమ్మా అంటూ వేడుకున్నారు. కొందరు పూనకాలతో ఊగిపోయారు. 1108 కలశాలతో అభిషేకాలు, పూజలు జరిపించారు. ఆలయ కమిటీ చైర్మన్ చిన్న కృ ష్ణయ్యనాయుడు, ఆలయ ఈవో పురేందర్‌కుమార్ ఆ ధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు.
ఉత్సవాల ముగింపు వేడుకల్లో భాగంగా నిర్వహించిన గ్రామోత్సవం అలరించింది. జోగుళాంబ సేవా సమితి ప్రధాన కార్యదర్శి ఆనంద్ శర్మ, ఉపాధ్యక్షుడు బండారు బాబు, గౌరవ అధ్యక్షుడు బండారి శ్రీనివాస్ సొంత ఖర్చుతో ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు ప్రాంతం నుంచి కళాకారులను తీసుకొచ్చారు. గ్రామ దేవతల వేషధారణలో నిర్వహించిన ఊరేగింపు అలరించింది. తుంగభద్ర నదీ తీరంలోని హరిశ్చంద్ర ఘాట్‌లో వెలిసిన ఘంటలేశ్వరాలయం నుంచి ఊరేగింపు మొదలై జోగుళాంబ ఆలయం వరకు చేరుకున్నది. అలాగే జోగుళాం బాబాలబ్రహ్మేశ్వరస్వామి కల్యాణోత్సవంలో ఎమ్మెల్యే విజయుడు పాల్గొని పూజలు చేశారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Maganur | షార్ట్ సర్య్కూట్‌తో ఇళ్లు దగ్ధం..పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే
Chennai Metro | చెన్నైలో మెట్రో నూతన మార్గం ప్రారంభం.. ప్రధాని మోదీ, సీఎం విజయ్ తొలి ప్రయాణం..!
Violence In Manipur | మణిపూర్‌లో కొనసాగుతున్న హింస.. ఐదుగురు మృతి, పలు ఇళ్లకు నిప్పు
Delhi Police | పోలీసులపై దాడులు, అడ్డగింత.. సీజేపీ నిరసనలో 20 ఎఫ్ఐఆర్లు నమోదు
Hanumanthu Naidu | కొత్త జిల్లాల ఏర్పాటుతో విరజిమ్మిన ప్రగతి వెలుగులు : బీఆర్ఎస్ నాయకుడు హనుమంతు నాయుడు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

